Nalkarpriyanka Divorce:  ప్రియాంక నల్కారీ.. ఈమె మీకు గుర్తుందా? ఒకప్పుడు తెలుగు టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, తమిళనాడులో మాత్రం ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ ఆర్టిస్టుగా అక్కడి ప్రేక్షకుల గుండెల్లో పాగా వేసింది. ప్రియాంక గత ఏడాది మార్చిలో త‌న ప్రియుడు రాహుల్ వ‌ర్మ‌ను మ‌లేషియాలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పెళ్లయ్యి ఏడాది కాకుండా ఆ బంధానికి ఎండ్ కార్డు వేసిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


ఏడాదికే.. 


త‌మిళంలో 'సీతారామ‌న్' అనే సీరియ‌ల్ తో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది ప్రియాంక‌. ఆ త‌ర్వాత 'స‌మ్ థింగ్, స‌మ్ థింగ్' అనే సీరియ‌ల్ లో న‌టించి మంచి పేరు తెచ్చింది. టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 2018లో సీరియ‌ల్ ఆర్టిస్ రాహుల్ తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అప్ప‌ట్లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ త‌ర్వాత 2023లో మ‌లేషియాలోని ఒక గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. 


సోష‌ల్ మీడియాలో యాక్టివ్... 


ప్రియాంక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. త‌నకు సంబంధించిన విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానుల‌తో ట‌చ్ లో ఉంటుంది. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె త‌న భ‌ర్త‌తో విడిపోతున్న‌ట్లు స‌మాధానం చెప్పిందట. దీంతో ఇప్పుడు ఈ వార్త వైర‌ల్ గా మారింది. పెళ్లైన త‌ర్వాత ప్రియాంక‌.. 'సీతారామ‌న్' సీరియ‌ల్ నుంచి త‌ప్పుకుంది. అప్ప‌ట్లో త‌న భ‌ర్త వ‌ల్లే ఆమె మానేసిన‌ట్లు చెప్పింది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కి మ‌ళ్లీ  బుల్లితెర‌పై క‌నిపించింది. భ‌ర్త మ‌లేషియాలో ఉండ‌టం, ఈమె షూటింగ్ కోసం చెన్నై రావ‌డం వ‌ల్లే దూరం పెరిగింద‌నే వార్త‌లు కూడా గ‌తంలో బాగా వినిపించాయి. ఇక ఇప్పుడు ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తూ ఆమె ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రియాంక త‌న ఇన్ స్టాలో రాహుల్ తో క‌లిసి దిగిన ఫొటోల‌ను డిలీట్ చేసింది. రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫొటోలు మొత్తాన్ని తీసేశాడు. 


ప్రియాంక భ‌ర్త రాహుల్ న‌టుడు, బిజినెస్ మ్యాన్. ఆయ‌న‌కు మ‌లేషియాలో కొన్ని బిజినెస్ లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగులో కూడ కొన్ని సీరియ‌ల్స్ లో న‌టించాడు రాహుల్. ప్రియాంక కూడా తెలుగులో చాలా సినిమాల్లో న‌టించింది. 'కాంచ‌న -3'లో న‌టించింది. 'అంద‌రి బంధువ‌య్యా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. 'ఎస్ ఎం ఎస్', 'నేనే రాజు నేను మంత్రి', 'వైఫ్ ఆఫ్ రామ్', 'కిక్ - 2' త‌దిత‌ర‌ సినిమాల్లో కూడా కనిపించింది. 


Also Read: 3 రాజధానులు ఉంటే మీకేంటి సమస్య? జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు.. ‘రాజధాని ఫైల్స్’ డైరెక్ట‌ర్ జవాబు ఇది