Rangula Ratnam June 22th: రేఖ.. ప్రసాద్ తో ఇకపై ఏ టెండర్ కూడా ఇకపై సూర్యకు దక్కనివ్వకుండా చేస్తాను అని గట్టిగా చెబుతుంది. తనను ఆ సీట్లో కూర్చొని ఇవ్వకుండా టార్గెట్ చేస్తున్నాడు అని కొన్ని మాటలు చెబుతుంది. ఇక ప్రసాద్ మనశ్శాంతి కోసం వెళ్తున్నాను అనడంతో నేను తీసుకొస్తాను అని చెప్పి మద్యం సీసా తీసుకువచ్చి ప్రసాద్ కి ఇస్తుంది. ఇలా తాగుతున్నంతవరకు నా గురించి నీకు ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకోలేవు అని క్రూరంగా అనుకుంటుంది.


మరోవైపు పూర్ణ కొడుకు, కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు రావటంతో బయటికి వెళుతుంది. ఇక రఘు స్వీట్ బాక్స్ తీసుకొని రాగా.. ఏం జరిగింది అని టెన్షన్ తో అడుగుతుంది పూర్ణ. ఇక వెంటనే నోరు చాపమని చెప్పి స్వీట్ పెట్టి శుభవార్త చెబుతాడు రఘు. దాంతో పూర్ణ సంతోషపడి వారికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది.


ఇక మీ అమ్మే మళ్లీ మీ బిడ్డ రూపంలో పుడుతుంది అని రఘుతో చెబుతుంది. కానీ అప్పుడే కాస్త బాధపడుతున్నట్లు కనిపించడంతో ఏం జరిగింది అని రఘు అడుగుతాడు. ఈపాటికి అందరం కలిసి ఉంటే మీ నాన్న చాలా సంతోషపడి సంబరాలు చేసేవాడు అని అంటుంది. దాంతో రఘు వాళ్ళు.. బిడ్డ పుట్టాక కచ్చితంగా కలుస్తారు అని చెప్పి ధైర్యం ఇస్తాడు.


వెంటనే జానకికి ఫోన్ చేసి పూర్ణ కాసేపు తన మాటలతో భయపడి ఆ తర్వాత శుభవార్త చెబుతుంది. వెంటనే జానకి ఈ విషయాన్ని తన భర్త సూర్యంకి చెప్పగా ఆయన చాలా సంతోషపడతాడు. ఇక ప్రసాద్ బయట బార్ లో మద్యం సేవిస్తూ కనిపించగా అక్కడికి వెళ్లిన సూర్యంకు, ప్రసాద్ కు మధ్య కాసేపు మాటలు యుద్ధం జరుగుతుంది.


ఇక సూర్యం ప్రసాద్ ను ఆడవాళ్ళపై ఆధారపడి వ్యక్తి అంటూ దారుణంగా విమర్శిస్తాడు. అంతేకాకుండా రేఖకు ఏ టెండర్ దక్కించను అని సవాల్ విసురుతాడు. ఇక వర్ష రేఖ దగ్గరికి వెళ్లి తన బాధను మొత్తం బయటికి చెప్పుకుంటుంది. మా అమ్మ గురించి నాన్నకు చెప్పి వారిద్దరిని ఒకటి చేయమని రేఖను వేడుకుంటుంది. కానీ రేఖ అలా చేస్తే నాకేం లాభం అంటూ చచ్చిన ఆ పని చేయను అని.. ఇప్పుడు ప్రసాద్ తో పాటు ఈ ఆస్తి నా చేతుల్లో ఉంది అని అంటుంది. తరువాయి భాగంలో వర్ష రేఖను దారుణంగా దూషిస్తుంది. దాంతో ఆ మాటకి కోపంతో రగిలిపోయిన రేఖ వర్ష చెంప మీద పడుతుంది. వర్ష కింద పడిపోతుండగా తన తండ్రి పట్టుకొని ఆపుతాడు. నా కూతుర్నే కొడతావా అని తిరిగి రేఖను కొడుతాడు.


Also Read: Madhuranagarilo June 22th: సంయుక్త మాటలకు ఫైరైన శ్యామ్, రాధ, పండులను టార్గెట్ చేసిన తల్లి కూతుర్లు?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial