Krishnamma kalipindi iddarini July 13th: సౌదామిని తన కూతురు వాళ్ళతో నా తల్లి గారి ఇంట్లో నా కూతురు కోడలుగా అడుగు పెట్టాలన్న ఆశను ఎందుకు వదులుకుంటాను.. ఆస్తి మొత్తం నీకు దక్కేలాగా చూస్తాను అనటంతో మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అలా ఎలా చేస్తావు అని అడుగుతారు. అసలు పెళ్లి జరిగితేనే కదా.. ఇప్పట్లో గౌరీ కిడ్నాప్ అవుతుంది అని అనటంతో వాళ్ళు షాక్ అవుతారు. కిడ్నాప్ ఏ కాదు వేరొకరితో పెళ్లి కూడా జరుగుతుంది అని అంటుంది.
ఇక ఎవరు అతను అని అడగటంతో సూరిబాబు అని చెబుతుంది. సూరిబాబు గౌరీపై మనసు పడ్డాడట కాసేపట్లో తను కిడ్నాప్ కి గురవుతుంది అని చెబుతుంది. మరోవైపు గౌరీ వాళ్ళు పూజ చేస్తారు. ఇక గౌరీ అమ్మవారి పాట పాడి పూజ పూర్తి చేసుకుంటుంది. అందరూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. పూజ పూర్తయ్యాక ఆనందయ్య తన కూతురు గౌరీ దగ్గరికి వచ్చి తనను వదిలి అత్తారింటికి వెళ్తుంది అని బాధపడతాడు.
అంతేకాకుండా కూతురికి ధైర్యం చెబుతాడు. నువ్వు చాలా అమాయకురాలివి అందరినీ గుడ్డిగా నమ్ముతావు అని.. ఎవరి విషయంలోనైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు. నీతో పాటు నీ చెల్లెలు కూడా ఈ ఇంటి కోడలు అవుతుంది అని.. తను అన్న మాటలు పట్టించుకోకు అని.. దాంతో గౌరీ తనని తలిలాగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. ఇక త్వరగా రెడీ అయ్యి మండపం దగ్గరికి రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆనందయ్య.
ఇక ఈశ్వర్ గౌరీని తలుచుకుంటూ ఉంటాడు. గౌరీ కి ఫోన్ చేసి కాసేపట్లో భార్యాభర్తలమవుతున్నాము అంటూ మనసులో మాటలు చెబుతూ ఉంటాడు. మరోవైపు సూరిబాబు బయట కార్ లో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక గౌరీ దగ్గరికి వచ్చి ఒక ఆవిడ పిలవటంతో ఫోన్ కట్ చేసి తన దగ్గరికి వెళ్లగా తను బయట మీ అత్తగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెబుతుంది.
దాంతో గౌరికి అనుమానం వస్తుంది. కానీ తను మీ అత్తగారు ఏదో సీక్రెట్ మాట్లాడారని పిలిచారేమో రమ్మని అంటున్నారు అనటంతో గౌరీ వెళ్తుంది. ఇక కారులో ఉన్నారు మీ అత్తగారు అనటంతో గౌరీ అక్కడ ఎందుకు ఉంటారు ఏదైనా ఉంటే ఇంట్లోకి పిలిచి మాట్లాడుతారు కదా అని అనుమానంతో అడగటంతో ఆవిడ మాత్రం తన మాటలతో నమ్మించి గౌరీని కారు దగ్గరికి తీసుకెళ్తుంది.
గౌరీ కార్ లో ఉన్న సూరిబాబును చూసి షాక్ అవ్వగా వెంటనే తనను అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. గౌరీ ఎంత వదలమన్నా కూడా వదలరు. ఆ తర్వాత అందంగా రెడీ అవ్వగా తన తల్లి చూసి మురిసిపోతుంది. ఇక సునంద జలజ వాళ్ళతో వెంటనే అఖిలను, గౌరీని మండపం దగ్గరికి తీసుకెళ్లాలి త్వరగా తీసుకురా అని చెబుతుంది.
జలజ అఖిలను పిలవగా గౌరీని కూడా పిలవడానికి వెళ్తారు. గౌరీ కనిపించకపోయేసరికి టెన్షన్ పడతారు. భవాని కూడా గౌరీ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుంది. అఖిలకు ఆ విషయం చెప్పటంతో అఖిల తెగ సంబరపడిపోతుంది. కానీ భవాని గౌరీ లేకుంటే నీ పెళ్లి జరగదు అని అనడంతో ఆలోచనలో పడుతుంది. మరోవైపు సూరిబాబు గౌరీని తీసుకెళ్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial