Prema Entha Madhuram July 13th: అను మాన్సీ దగ్గరికి వెళ్లి వారి జోలికి వెళ్లొద్దు అని.. వెళ్తే బాగుండదు అని చెబుతుంది. కానీ మాన్సీ మాత్రం పొగరుగా సమాధానం ఇస్తుంది. అనుకుంటే నీ విషయం కూడా వాళ్లకు చెప్పాలి కానీ నేను నీలాగా అందరి విషయంలోకి దూరను అని అంటుంది. నా జోలికి వస్తే నీకు పట్టిన గతే నీ వాళ్లకు పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక అను లోపలికి కూర్చున్నాక అప్పుడే ఆర్య వాళ్ళు వస్తారు.
ఇక మీ ఈవెంట్ ప్లాన్ బాగుంది అని.. ఏదైనా అవసరం ఉంటే జెండే ని అడగండి అని చెబుతూ ఉండగా అప్పుడే వర్కర్స్ వచ్చి కిడ్స్ టాయ్స్ గురించి ఒక యాప్ క్రియేట్ చేసాము అని.. దానిని మీరే ఓపెన్ చేయండి అని ఆర్యకు ఇస్తారు. ఇక ఆర్య ఇది పిల్లలది కాబట్టి పిల్లలతోనే ఓపెన్ చేయించాలి అని అనుని బాబుని ఇవ్వమని అంటాడు. ఇక బాబుతో ఆ యాప్ ఓపెన్ చేయిస్తాడు. తర్వాత అను వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు.
ఓ వైపు ఆటోలో పద్దు, సుబ్బు దంపతులు ఆర్య ఇంటికి అని బయలుదేరుతారు. అను ఎక్కడ ఉందో అని అను గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అని సుబ్బు చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో కార్లో వస్తున్న అనుకు వెక్కిళ్లు రావడంతో ప్రీతి వాటర్ ఇస్తుంది. ఇక అను ఎవరో గుర్తు చేసుకుంటున్నారు అని అనడంతో వెంటనే ప్రీతి ఇంకెవరు ఆర్య సార్ అని అంటుంది.
లేదు అమ్మానాన్నలు అని అంటుంది అను. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం.. త్వరలోనే పుట్టిన రోజు ఉంది కాబట్టి వాళ్ళు నన్ను తలచుకుంటున్నారు అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ బాధపడుతుంది. మరి మీ అమ్మానాన్న వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చు కదా అని ప్రీతి అనడంతో.. ఆ ఇంటికి ఏమని వెళ్ళాలి భర్త బాగా చూసుకోవడం లేదని వెళ్ళాలా.. నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు.. అని అంటుంది.
మరి వాళ్ళని వీళ్లను వదిలేసి ఎలా ఉంటున్నావు అని అనటంతో పిల్లల కోసం అని.. పిల్లలు, ఆర్య సార్ బాగుండాలి అని అంటుంది. ఇక సుబ్బు దంపతులు కూడా అనుగురించి తలుచుకుంటూ ఉండగా అప్పుడే ఆటో డబ్బులు ఇవ్వటం వల్ల సుబ్బు బైటికి దిగుతాడు. ఇక సుబ్బు అను గురించి ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడతాడు. అప్పుడే అను తన తండ్రిని చూసి వెంటనే కారు ఆపి.. ఏం జరిగింది అమ్మ అని అడుగుతుంది పద్ధుని.
కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పటంతో వెంటనే సార్ అంటూ వాటర్ చల్లి లేపుతుంది. ఇక పద్దు ఎందుకండి బుజ్జమ్మని తలుచుకొని ఇలా బాధపడతారు అని అనటంతో అను ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. ఇక అను కి థాంక్స్ చెప్పి వాళ్లు అక్కడి నుంచి బయలుదేరుతారు. ప్రీతి ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అనటంతో వాళ్లే నా అమ్మానాన్నలు అని అంటుంది. దాంతో ప్రీతి ఆశ్చర్యపోయి ఏం పర్వాలేదు తొందరలోనే అందరిని కలుస్తావు అని అంటుంది.
మరోవైపు ఆర్య ఆఫీసులో వర్కర్స్ అంత అన్ని వెతకడం కోసం ఆర్య చేసిన ప్లాన్ లో బిజీగా ఉంటారు. ఇక పాంప్లెట్ ఇస్తే స్కాన్ ద్వారా పట్టుకోవచ్చు అని అంటాడు. మరోవైపు ఓటర్ సర్వే జరుగుతూ ఉంటుంది. ఇక అను వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ రేష్మ బయట ఉండటంతో రేష్మ ని ఓటర్ గురించి అడుగుతారు.. తనకు ఉంది అనటంతో వెంటనే లోపలికి వెళ్తుంది.
అను ని కొత్త ఓటర్ కార్డులు వచ్చాయి తీసుకోమని అనడంతో వద్దు అని భయపడుతుంది అను. అంత రేష్మ బయటకు వచ్చి తన ఇంకా ఎవరూ లేరు అన్నట్లుగా చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తుంది. అను ఇదంతా ఆర్య సర్ ప్లాన్ అయి ఉండొచ్చు అని అనుకుంటుంది. అప్పుడే సర్వే చేసే వ్యక్తి పాంప్లెట్ ఇవ్వడం మర్చిపోయాను అని వచ్చి కిటికీలోనుంచి పాంప్లెట్ విసిరేసి వెళ్తాడు. ఇక సుబ్బు దంపతులు ఆర్య వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఆర్య అను దొరుకుతుంది అని ధైర్యం ఇస్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial