Krishnamma kalipindi iddarini June 19th:
సునంద ఇంటికి వచ్చిన సౌదామిని సునందతో ఎదురు తిరిగి మాట్లాడుతుంది. గౌరీ గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వదిన మెట్టు దిగి గౌరీ ఇంటి మెట్టు ఎక్కుతుందా అనటంతో ఎక్కుతాను అని సునంద షాక్ ఇస్తుంది. దాంతో సౌదామిని షాక్ అవుతుంది. నా కొడుకు జీవితాన్ని అందించడం కోసం ఏమైనా చేస్తాను అని.. అవసరమైతే తలదించుకొని మరి అడుగుతాను అని తన మరిది సూపర్ వదిన అంటూ ఈశ్వర్ ప్రేమకు సపోర్ట్ గా ఉన్నావు అని అంటాడు.
దాంతో సౌదామిని అయితే నాతో చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయావ్ కాబట్టి నా కూతురు ఉజ్వలను మీ చిన్న కొడుకు ఆదిత్యతో ఇచ్చి పెళ్లి చేస్తావన్నమాట అని అంటుంది. వెంటనే సునంద నేను ఓడిపోలేదు నా కొడుకు విషయంలో గెలిచాను అని అంటుంది. గతంలో సునంద తన కొడుకుకు గొప్ప అమ్మాయిని తీసుకొస్తాను అని అన్న మాటలు మరోసారి గుర్తుకు చేస్తుంది సౌదామిని. దాంతో అటువంటి గొప్ప లక్షణాలు అన్ని గౌరీ లో ఉన్నాయని గౌరీ గురించి గొప్పగా చెబుతుంది.
ఇప్పుడే గౌరీ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి ఒప్పించుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే ఆదిత్య ఈ విషయాన్ని ఈశ్వర్ తో చెప్పటంతో ఈశ్వర్ చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత ఆదిత్య అమృతకి వెళ్లి ఈ విషయం చెప్పటంతో సంతోషపడుతుంది. రేపు అన్నయ్య బర్త్డే రేపు మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తాను అని అందరూ ఒప్పుకుంటారు అని తనతో చెప్పి సంతోష పడతాడు.
సునంద దుర్గ భవాని ఇంటికి వెళ్లగా దుర్గ భవాని ఎవరు తెలియకుండా మాట్లాడుతూ ఉండగా అప్పుడే అఖిల వచ్చి సునంద గురించి చెప్పటంతో వెంటనే దుర్గ సునంద ని ఇంట్లోకి తీసుకొని వెళ్లి కూర్చోబెడుతుంది. గౌరీ గురించి అడగటంతో గౌరీ తన తండ్రిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళిందని చెబుతుంది దుర్గ. గౌరీ లేకపోవటంతో సునంద వెళ్ళిపోతుండగా దుర్గ ఆపుతుంది.
వచ్చిన విషయాన్ని ఇప్పుడే చెప్పేయండి అని అంటుంది దుర్గ. దాంతో సునంద మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారని అడగటానికి వచ్చాను అనటంతో వెంటనే అఖిల తన గురించి అనుకొని సంతోషంతో ఉప్పొంగిపోతుంది. దాంతో దుర్గ తన కూతుర్ని పక్కకు తీసుకొని నువ్వెందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగటంతో ఆ ఇంటి కోడలు అవ్వాలని కలలు కంటున్నాను ఆ అదృష్టం ఆవిడ రూపంలో వచ్చింది అనటంతో దుర్గ సంతోష పడుతుంది.
ఇక తిరిగి సునంద దగ్గరికి వస్తారు. ఇక అఖిల గురించి సునంద కు గొప్పగా చెబుతుంది. దాంతో సునంద మీరు పొరపాటు పడుతున్నారు అని తను వచ్చింది గౌరీ కోసం అని చెబుతుంది. దాంతో దుర్గకు కోపం వస్తుంది. అప్పుడే గౌరీ రావడంతో సునంద గౌరీతో మాట్లాడి తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ గౌరీ మాత్రం ఒప్పుకోదు. సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలపాలి కానీ మీ కొడుకు పక్కన స్థానం సంపాదించుకోవటం కరెక్ట్ కాదు అని అంటుంది. అయినా కూడా కొడుకు కోసం గౌరీని పెళ్లికి ఒప్పించడానికి బాగా ఆరటపడుతుంది సునంద. మరోవైపు దుర్గ, అఖిల కోపంతో రగిలిపోతూ కనిపిస్తుంటారు.
Also Read: Prema Entha Madhuram June 19th: మదన్ కంట పడ్డ అను.. ఆర్యకు షాకిచ్చిన శారదమ్మ?