Trinayani August 25th: సుమన తన గదిలో బెడ్ పై పడుకోగా తన పక్కన పెద్ద బొట్టమ్మ కూడా పడుకొని సుమన కడుపుపై చేతితో రాస్తూ ఉంటుంది. వెంటనే సుమన లేచి పెద్దబొట్టమని చూసి షాక్ అవుతుంది. పెద్దబొట్టమ్మ నువ్వా.. నేను పడుకుని ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. బిడ్డ కోసం అని తను అంటుంది. అంటే కడుపు మీద ఇలా రాస్తే ప్రసవం సులువుగా జరుగుతుంది అని అంటుంది.


ప్రసవం చేయడానికి నేనే వస్తాను అని అనటంతో.. నువ్వెందుకు వస్తావు నేను హాస్పిటల్ లో డబ్బులు పెట్టి చూయించుకుంటాను అని అంటుంది. దానితో పెద్ద బొటమ్మ నువ్వు హాస్పిటల్ లో పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. అక్కడ డాక్టర్లు కడుపు కోయడం వల్ల నువ్వు చచ్చిపోతావు అని అంటుంది. దాంతో సుమన నేను చచ్చిపోతే ఆస్తి మా అక్క దగ్గరే ఉంటుంది కదా అని అంటుంది.


వెంటనే పెద్ద బొట్టమ్మ అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా జరుగుతుందని భయం లేదా అనడంతో.. నాకు బిడ్డ కంటే ఆస్తి ముఖ్యం అని అంటుంది. ఇక పెద్ద బొట్టమ్మ తన మనసులో డెలివరీ ఇక్కడే చేయాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సుమన కూడా ఇక్కడ చేయాలంటే పెద్దమనుషులు ఉండాలి కదా అనటంతో నేను ఉన్నాను కదా ఆ సమయానికి వస్తాను అని అంటుంది. అంతవరకు నాగయ్య పూజ చేసుకోమని అంటుంది.


ఆ తర్వాత ధ్యానంలో ఉన్న గురువు ఒకేసారి ఉలిక్కిపడి ఆకాశంలో చూడగా తనకు ఒక రూపం కనిపించడంతో.. ఏదో కీడు సంభవిస్తుందన్న దానికి ఇదొక నిదర్శనం అని అకాల సమయంలో అనూహ్యమైన కార్యాన్ని తలపెట్ట పోతున్నారు అని.. విది పాచిక వేసి సూచికను సూచిస్తుంది అంటూ.. అక్క, చెల్లెల మధ్య ఏదో జరగబోతుంది అని ముఖ్యంగా సుమన బిడ్డ కోసం చేసే ప్రయత్నాలను ఆపాలని.. నయని తన భర్త కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి అని అనుకుంటాడు.


హాల్ లో సుమన ఏదో పూజా కు ఏర్పాటు చేస్తుండటంతో అందరూ వచ్చి తనను చూసి ఆశ్చర్యపోతారు. ఏం పూజ చేస్తుంది అని ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది. దేవుని పటం కూడా లేదు కదా అని తిలోత్తమా అనటంతో బంగారు నాగు పాముని తీసి చూపించడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే అది గరుడ పంచమి పూజ అని అంటుంది. దానితో సుమన అవును అని అంటుంది.


వెంటనే విశాల్ రేపు కదా గరుడ పంచమి అనటంతో.. 21వ తేదీ నాగ పంచమి అని సుమన కూడా చెప్పింది అని విక్రాంత్ అంటాడు. ఎందుకు మరి ముందు రోజు పూజ చేస్తుంది అని పావని మూర్తి అనడంతో.. తిధి మారింది అని ఎద్దులయ్య అంటాడు. కానీ ఉదయాన్నే చేస్తే ఎవరు కాదంటారు అని నయని అడుగుతుంది. కానీ సుమన రేపు నేను ఏమైనా ఖాళీగా ఉంటానా అని అనడంతో.. వెంటనే హాసిని ఏం పని ఉంది అని అడుగుతుంది.


కనాలి కదా అక్క అనటంతో అందరూ షాక్ అవుతారు. రేపు పురిటి నొప్పులతో బాధపడుతుంటే పూజలు చేసే అవకాశం ఉండదు అందుకు తిధి ఈరోజు మొదలైంది అందుకే పూజ చేస్తున్నాను కాబట్టి తప్పు ఉండదని అంటుంది. ఇక సుమన పూజ చేస్తూ ఉండగా.. అక్కడ కుండలో బంధించి ఉన్న పాముపై కూడా పూలు పడుతుంటాయి. పూజ అనంతరం వెంటనే డమ్మక్క ఇప్పుడుంది అసలైన మజా అని అంటుంది.


దానితో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. తరువాత సుమన కడుపుతో ఉన్నన్ని రోజులు ఏమి అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను అని అంటుంది. దాంతో నయని తనకు చేతనైతే కాదనని తప్పకుండా తీర్చుతాను అని అంటుంది. ఇక సుమన నాగయ్యను చూడాలి అనేటడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోగా తిలోత్తమా షాక్ అవుతుంది. ఇక నయని పిలుస్తాను అని నయని నాగ పిలుస్తూ ఉంటుంది.


ఇక అందరూ నాగయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నయని ఎంత పిలిచినప్పటికీ కూడా రాకపోయేసరికి డమ్మక్క రాలేని పరిస్థితిలో ఉన్నాడేమో అని అంటుంది. కానీ సుమన అపార్థం చేసుకుంటుంది. నువ్వు మనసులో రావొద్దు అనుకొని బయటికి ఇష్టం లేకుండా పిలుస్తున్నావు అని.. ఎందుకంటే నాగయ్య వస్తే నాకు మంచి జరుగుతుందని నువ్వు రావొద్దని కోరుకుంటున్నాను అని అంటుంది.


వెంటనే విక్రాంత్ సుమన పై కోప్పడతాడు. ఇక విశాల్ కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక రేపు హాస్పిటల్ కి వెళ్ళాలి చిట్టి అని హాసిని అనడంతో.. ముందు పురిటి నొప్పిలు రావాలి కదా అని అంటుంది. వెంటనే ఎద్దులయ్య.. మా అమ్మ చెప్పింది కదా మీ అమ్మ వస్తుందని చూడాలి మరి అని అంటాడు. చీకటి పడటంతో హాసిని నాగయ్య కోసం బూర ఊదుతుంది.


అప్పుడే నయని వచ్చి ఆపుతుంది. నువ్వు పిలిస్తే నాగయ్య ఎందుకు రాలేదు నయని అని అనటంతో..  వెంటనే అవును తన కోరిక తీర్చాలేక పోయాను అని అంటుంది. ఇక హాసిని.. మన ఇంట్లో వాళ్లే ఎవరు నాగయ్యను రానివ్వకుండా చేశారేమో అని అంటుంది.  ఇక నాగయ్య రాకపోయేసరికి ఇద్దరి మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది.


also read : Ennenno Janmala Bandham August 24th: అభి ఆస్తులను తన పేరు మీద రాయించుకున్న నీలాంబరి, కాళ్లు కింద పెట్టకుండా వేదపై ప్రేమ చూపిస్తున్న యష్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial