Ennenno Janmala Bandham August 24th: యష్ హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్ మాలతిని అడుగుతాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి మీ మిస్సెస్ వేద ప్రెగ్నెన్సీ రిపోర్టు పాజిటివ్ వచ్చింది అని.. కానీ తన గర్భసంచి వీక్ గా ఉంది కాబట్టి గర్భం నిలవకపోవచ్చు అని అంటుంది. ఇక ఈ విషయం నేరుగా వేదకు చెబితే తను తట్టుకోలేదు అని అంటుంది. తనకు మంచి ఫుడ్ తో పాటు రెస్ట్ అవసరం అని తనను జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది.


మరోవైపు వేద కడుపు మీద చెయ్యి పెట్టుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తరువాత యష్ కోసం ఫుడ్ ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే ఖుషి వచ్చి ఏదైనా స్పెషలా అని అడుగుతుంది. అవును అని.. పైగా మీ డాడీ కోసం ఇష్టమైనవన్నీ చేశాను అని అంటుంది. ఇక యష్ కు క్యారేజ్ పెడుతుంది. ఇక డాడీకి క్యారేజ్ పంపిస్తావా అని అనడంతో నేనే తీసుకెళ్తాను అని వేద అంటుంది. నేను కూడా వస్తాను అని అనడంత వేద సరే అంటుంది.


ఆఫీస్ లో ఉన్న యష్ డాక్టర్ మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వేద వాళ్ళు రావటంతో ఆశ్చర్యపోతాడు. ఇక వేద క్యారెట్ తీసుకొచ్చాము అని చెబుతుంది. ఇటువంటి అనవసరమైన రిస్క్ ఎందుకు అని యష్ అంటాడు. ఇది రిస్క్ కాదు లంచ్ అని వేద ఉంటుంది. చెప్తే అర్థం కాదా నీకు అని అనటంతో వేద సైలెంట్ అవుతుంది. ఇక ఖుషి ఆఫీస్ అంతా చూసి వస్తాను అని అంటుంది.


ఆ తర్వాత యష్ వేదను ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు..  డాక్టర్ ఏం చెప్పారో తెలుసా అని విషయం చెప్పక ఆపటంతో వెంటనే వేద గర్భసంచి వీక్ గా ఉందని అబార్షన్ అవుతుందని తనకు కూడా తెలుసు అని చెబుతుంది. నీకెలా తెలుసు అనడంతో రిపోర్ట్స్ తనకు కూడా పంపించారని.. నేను ఒక డాక్టర్ నే.. కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు నాకు తెలుసు అని అంటుంది.


ఇక అప్పుడే అక్కడికి ఖుషి వచ్చి డోర్ దగ్గర నిలబడి వీరి మాటలు వింటుంది. త్వరలో ఖుషి, ఆదిత్య లకు తమ్ముడిని ఇవ్వబోతున్నాను.. మిమ్మల్ని తండ్రిని చేస్తున్నాను.. నేను అమ్మను అవ్వబోతున్నాను అని చెప్పటంతో ఆ మాటలు విని సంతోషపడుతుంది ఖుషి. ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు ఇప్పుడే చెప్పకూడదు అని సమయం చూసి చెబుదాము అని అంటుంది.


సీన్ కట్ చేస్తే.. మాలిని, సులోచన మధ్య వంటల గురించి కాసేపు వాదనలు ఉపవాదములు చేసుకొని సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు అభి ఇంటికి రాగానే నీలాంబరి చాలా కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక అభి తన అక్క, కైలాష్ ఎక్కడ అని అడగటంతో మన మధ్య అడ్డు ఎందుకు అని వాళ్ళను పంపించేశాను అని అంటుంది. ఇప్పటికైనా అన్ని గొడవలు పక్కకు పెట్టేసి మంచిగా ఉందామని అంటుంది.


ఇక వాళ్ళు నువ్వు జైలు కి వెళ్ళాక నీ ఆస్తిని ఎక్కడ కాజేస్తారో అని నా పేరు మీద రాయించుకున్నాను అని అంటుంది. దాంతో అభి ఎవరి పేరు మీద అయితే ఏంటి మనకే కదా అని అంటాడు. ఇక నీలాంబరి ఎవరి జోలికి వెళ్ళకూడదు అనటంతో.. అభి తన మనసులో నేను వేటాడే పులిని ఎవరి జోలికి వెళ్లకుండా ఉండను అని అనుకొని బయటికి సరే అంటాడు. నీలాంబరి కూడా తన మనసులో ఇలా ఉంటేనే నా పని సులువు అవుతుంది అని అనుకుంటుంది. ఇక అభిని ఫ్రెష్ అయ్యి రమ్మని మంచి వంటలు చేసి పెడతాను అని అంటుంది. ఇక మీ ముగ్గురిని విడదీసి నిన్ను ఏకాకిని చేశాను ఇక చేయవలసింది చేస్తాను అని పొగరుగా అనుకుంటుంది.


చీకటి పడటంతో వేద తన అత్తయ్యకు, పిల్లలకు భోజనం వడ్డిస్తుంది. అప్పుడే యష్ అక్కడికి వచ్చి.. వేద నువ్వేంటి నువ్వు వడ్డించడం ఏంటి అని అడుగుతాడు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఏ పని కూడా చేయకూడదు అని అంటాడు. ఇక వేద నిజం బయటపడకూడదు అని ఏవండీ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక మాలిని ఏంటి ఇలా మారిపోయావు అని అడుగుతుంది.


ఎప్పుడు వేదపై గొడవ పడుతుంటావు కదా ఇప్పుడేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని అడుగుతుంది.  వెంటనే యష్ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా.. వేద అసలే వట్టి మనిషి కూడా కాదు అని అంటాడు. దాంతో ఏంటి అని మాలిని అనుమానంతో అడుగుతుంది. వెంటనే నోరు జారిపోయాను అని గమనించిన యష్ మాట మారుస్తాడు. హాస్పిటల్లో ఎక్కువ వర్క్ చేసింది అని అంటాడు.


దాంతో మాలిని.. నీ వాళ్ళకం చూస్తుంటే వేదను హాస్పిటల్ కి కూడా పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టేలాగా ఉన్నావే అని అనడంతో తప్పదు కదా అమ్మ ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే అని మరోసారి నోరు జారుతాడు. వెంటనే వేద కంగారుపడుతూ మళ్లీ ఏవండి అని అనటంతో యష్ కవర్ చేస్తాడు. ఇక మాలిని వారి మాటలకు.. నాకంత అయోమయంగా ఉంది అని అంటుంది.


వెంటనే ఖుషి నాకు అర్థం అయింది అంటూ వేదమ్మ బొజ్జల్లో చిన్న బాబు ఉన్నాడు అని అంటుంది. దాంతో మాలిని సంతోషంలో.. వేద నిజమా అని అడగటంతో అలాంటింది ఏం లేదు అని యష్ అంటాడు. కానీ మాలిని మాత్రం వారి మాటలు అస్సలు నమ్మదు. అలాంటప్పుడు ఖుషి బొజ్జలో బేబీ ఎందుకు ఉన్నాడు అని అంటుంది అని అడుగుతుంది.. ఇక యష్ బేబీ కాదు బేబీ వైరస్ అంటూ కొత్త కథలు అల్లి చెబుతాడు. తరువాయి భాగంలో వేద బట్టలు సర్దుతూ ఉండటంతో నువ్వు అసలే వట్టి మనిషివి కాదు అని తనను కూర్చోబెట్టి తను బట్టలు మడత పెడుతూ ఉంటాడు. అది చూసి వేద సంతోషపడుతుంది.


also read it Trinayani August 23rd: పాముని బంధించిన కుండలోనే పాలు కావాలంటూ సుమన అంతరాత్మ రచ్చ - నయని మాంగల్యానికి ముప్పు?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial