Trinayani June 16th: బువ్వమ్మ నయనితో పాపకు వేపాకు రసం రాయమని చెబుతుంది. ఇక నయిని పాపకు వేపాకు రసం రాస్తూ గాయత్రిని తలుచుకుంటుంది. ఇక అదే విషయాన్ని వాళ్లకు చెబుతూ.. బిడ్డ రూపంలో పుట్టి దూరమైంది అని బాధపడుతుంది. కానీ బువ్వమ్మ ఎవరో ఒకరు.. ఒకరికి ఒకరు ఒకరే కదా అనటంతో వెంటనే హాసిని లాగా బువ్వమ్మ కూడా అర్థంపర్థం లేకుండా వాగేస్తుంది అని అంటుంది సుమన పిన్ని.


దాంతో అక్కడున్న వాళ్లంతా బాధపడుతూ కనిపిస్తారు. మరోవైపు కుటుంబ సభ్యులు వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ అర్థం ఉంటుంది అర్థం చేసుకుంటే అని అంటుంది. వాళ్లకు అర్థమయ్యేలా ఉంటే మా దగ్గర ఎందుకు ఉంటారు.. ఈపాటికి లండన్ సగం కొనేసి ఉంటారు అని అంటుంది హాసిని. మరోవైపు విక్రాంత్ వంట చేస్తూ అన్ని కుదిరినట్లేనా అని తన మామయ్యతో అడుగుతాడు.


ఆ తర్వాత బువ్వమ్మ త్రినయనని, హాసినిని, సుమనను అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం దండం పెట్టుకోమని అంటుంది. సుమన నేను వెళ్ళను కడుపుతో ఉన్న దాన్ని వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఏమైనా అవుతే ఎవరు బాధ్యులు అని అనటంతో త్రినయని, హాసిని బాధపడతారు. వెంటనే విక్రాంత్ సుమనను ఏం కాదు వెళ్ళమని అంటాడు. ఇక విశాల్ బలవంతం చేయకు అని అంటాడు తన తమ్ముడితో అంటాడు. ఆ తర్వాత నయని మేమిద్దరం 


ఆటలమ్మ వారిని వేడుకుంటాము అని అమ్మవారికి దండం పెట్టుకుంటారు. బిడ్డని చల్లగా చూడమని కోరుకుంటారు. మరోవైపు అక్కడ బువ్వమ్మ వాళ్ళు.. అమ్మ మిమ్మల్ని కరుణించింది అని.. నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి అని అంటారు.


తిలోత్తమా బువ్వమ్మతో నువ్వే నయం బువ్వమ్మ అంటూ.. మా సుమన అయితే గాయత్రి దగ్గరికి వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు అని చెబుతుంది. ఎందుకని బువ్వమ్మ అడగడంతో.. వెంటనే హాసిని అంటి వ్యాధి తనకు కూడా సోకితే తన గ్లామర్ పోతుంది అని అంటుంది. వెంటనే బువ్వమ్మ అందం ఆప్యాయతలో ఉంటుంది అని సుమనతో చెప్పటం.. సంతోషం అని వెటకారంగా మాట్లాడి మీ పని అయిపోతే మీ దారి మీరు చూసుకోవచ్చు అని అంటుంది.


వెంటనే నయని తన నోరు మూయిస్తుంది. బువ్వమ్మతో మీరు వచ్చి పాపను కాపాడారు అని చెబుతుంది. మీకు ఏమైనా కావాలా అని నయని బువ్వమ్మ వాళ్ళని అడగటంతో.. ఏదైనా ఇస్తావా అని బువ్వమ్మ అనడంతో వెంటనే తిలోత్తమా నయనికి ఆస్తులు ఎక్కువ మీరు అడిగేసేయండి అని అంటుంది. దాంతో వల్లభ వీళ్ళు ఎంత అంటే అంతే అడుగుతారు అని అనటంతో విశాల్ అలా కాదు అని అంటాడు.


ఇక బువ్వమ్మ తన పక్కన అమ్మవారలను కూడా అడుగుతుంది. ఇక తాము అడిగేది శక్తివంతమైనది అని బువ్వమ్మ అంటుంది. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మాట తప్పుతామేమో అని విక్రాంత్ అంటాడు. ఇక ఏం కావాలి అని నయని అడగటంతో మా ముగ్గురికి కడుపునిండా అన్నం పెట్టమని అంటుంది. దాంతో అందరూ ఇదా మీరు అడిగింది అని ఆశ్చర్యపోతారు.


వెంటనే వారికి భోజనం ఏర్పాటు చేస్తారు. ఇంకా వాళ్ళు భోజనం తింటూ ఉంటారు. వాళ్ళు భోజనం పూర్తి చేసిన వెంటనే మళ్ళీ పెడుతూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న భోజనం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక భోజనం దగ్గర పడటంతో మళ్లీ వండడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నయని ముత్తైదులు చాలా ఆకలితో వచ్చారు అని బాధపడుతుంది.


అప్పుడే హాసిని బియ్యం నిండుకున్నాయని వచ్చి చెప్పటంతో మరింత బాధపడుతుంది. తాము ఎంతో మందికి భోజనం పెడతాము అని గొప్పగా చెప్పి తప్పు చేసాము అని బాధపడుతుంది. వెంటనే నయని పిడికెడు బియ్యం తీసుకొని గాయత్రి చే ముట్టించి వెళ్లి వండుకొని తీసుకువచ్చి వడ్డిస్తుంది.


సుమన ఆ కొంచెం దాన్ని వెంటనే తినేస్తారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక బువ్వమ్మ వాళ్ళు చాలు అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. తృప్తిగా తిన్నాము అనడంతో ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే గాయత్రి అమ్మగారు చెప్పినట్టు మంచితనం ఉన్న ఒక్కోసారి అహంతో ప్రవర్తించి ఇబ్బందులు తెచ్చుకుంటాం అని మనసులో అనుకుంటుంది.


Also Read: Prema Entha Madhuram June 16th: ఆర్యను నమ్మించి మోసం చేస్తున్న మదన్, మాన్సీ అసలు రూపాన్ని బయటపెట్టిన అంజలి?