Prema Entha Madhuram June 16th: ఆర్య ఎస్సై తో ఫోన్లో మాట్లాడి ప్రాబ్లం మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. అదే విషయాన్ని అంజలికి చెప్పటంతో అంజలి థాంక్స్ చెబుతుంది. తర్వాత అంజలి మదన్ కి ఫోన్ చేసి ఇప్పటికైనా ఆర్య గొప్పతనం తెలుసుకో అంటూ ఆర్య గురించి గొప్పగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అను తన పిల్లలను తయారు చేస్తూ ఆర్యని తలుచుకుంటూ ఉంటుంది. అందరం కలిసి ఉంటే సంతోషంగా ఉండేవాళ్లం అంటూ పిల్లలకు చెబుతూ బాధపడుతూ కనిపిస్తుంది.


ఇక ఆర్య తన దగ్గరికి వచ్చినట్లు ఊహించుకుంటుంది. ఇక ఈ జన్మలో ఆ ప్రేమ పొందగలనో లేదో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆర్య బైటికి వెళుతుండగా అక్కడికి మదన్ వచ్చి నిలబడటంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక అంజలి ఇంట్లోకి రమ్మని పిలవడంతో ఆర్య సార్ క్షమించాను అంటేనే వస్తాను అని అంటాడు. దాంతో ఆర్య ఎవరికైనా హెల్ప్ చేశాను అంటే వాళ్ళు నా వాళ్ళు అర్థం అనటంతో మదన్ ఆర్య కాలు పట్టుకొని ఎమోషనల్ అవుతాడు.


మీకు చెడు చేయాలని చూసినా కూడా మీరు నాకు పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించారు అంటూ మాట్లాడుతాడు. వెంటనే జెండే మళ్లీ ఇటువంటి తప్పులు చేస్తే ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతావు అని అంటాడు. ఇక అలా జరగదు అని అందరికీ క్షమాపణలు చెబుతాడు. అంతేకాకుండా అందరికీ ఒక రిక్వెస్ట్ కూడా చేస్తాడు. రెండు రోజుల్లో తమ పిన్ని వస్తుంది అని.. అంజలి నీరజ్ కి రెండో భార్య తో అని తెలియదని.. అందుకే తను వచ్చేటప్పటికి నీరజ్ భార్యగా కనిపించాలి కానీ మాన్సీ కి సవితిగా కాదు అని అనటంతో ఆర్య ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్తాడు.


దాంతో శారదమ్మ మేమందరం సపోర్ట్ చేస్తాము అంటూ ధైర్యం ఇస్తుంది. ఆ మాటలు విన్న మాన్సీ వీరిద్దరు ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు అని... ఎలాగైనా అంజలిని బయటికి పంపించాలి అని అనుకుంటుంది.. ఆ తర్వాత మదన్ బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ తనను అందరూ పూర్తిగా మారిపోయారని నమ్ముతున్నారు అని చెప్పటంతో అవతలో ఉన్న ఆవిడ నవ్వుతూ ఇక ఆర్యకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది అని మాట్లాడుతుంది.


మరో వైపు మాన్సీ తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల అను ఇంటికి తిరిగి రావద్దు అని అనటంతో ఆ మాటలు అంజలి వింటుంది. వెంటనే మాన్సీ ని కిందికి లాక్కొని వెళ్లి అందరి ముందు అను ఇంట్లో నుంచి వెళ్లిపోవటానికి కారణం మాన్సీ అంటూ తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పటంతో అందరి షాక్ అవుతారు.


 


Also Read: Madhuranagarilo June 16th: ‘మధురానగరిలో’ సీరియల్: షాక్ ల మీద షాకిచ్చిన శ్యామ్, పెళ్లి కార్డు చూసి కంగుతిన్న రాధ?