బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి.. నటిగా కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సుమ హోస్ట్ చేస్తోన్న 'క్యాష్' షోలో సందడి చేసింది. ఈ షోకి తనతో పాటు తన 'జాతిరత్నాలు' టీమ్ ని కూడా తీసుకొచ్చింది. ఈ షోలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది శ్రీముఖి. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఇందులో శ్రీముఖి.. తను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినప్పటికీ.. ఎంతోమంది అందమైన హీరోలు, కో యాక్టర్స్ తో కలిసి వర్క్ చేసినప్పటికీ.. ఎవరికీ మనసివ్వకుండా, ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణమైన వ్యక్తి ఎవరో కాదు అంటూ చెప్పబోయింది. ప్రోమోలో శ్రీముఖి మాట్లాడుతుంటే లవ్ సింబల్స్ ను చూపించారు. తనకు కాబోయే భర్తను ఆమె పరిచయం చేస్తున్నట్లుగా ప్రోమోను కట్ చేశారు. 


మరి నిజంగానే శ్రీముఖి తను ప్రేమించే వ్యక్తిని పరిచయం చేస్తుందా..? లేక ప్రోమో కోసం ఇచ్చిన బిల్డప్ మాత్రమేనా అనే విషయం పూర్తి షోని చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా.. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన బ్రేకప్ స్టోరీని పంచుకుంది. తనొక పాపులర్ వ్యక్తితో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించానని.. ఆ తరువాత బ్రేకప్ అయిందని చెప్పింది. ఆ సమయంలో డిప్రెషన్ కి గురయ్యానని తెలిపింది. అతడు అందరికీ తెలిసిన వ్యక్తే అంటూ చెప్పుకొచ్చింది.  


Also Read: అకిరా నందన్ ప‌వ‌ర్‌ఫుల్‌ పంచ్ - హీరో మాత్రం అవ్వడంటున్న రేణుదేశాయ్