Guppedantha Manasu Serial: 'గుప్పెడంత మనసు' టీంకి ఫెయిర్‌ వెల్‌ - జగతి మేడం కూడా వచ్చేసింది, అతిత్వరలోనే శుభం కార్డు!

Guppedantha Manasu Serial End Soon: బుల్లితెర ఆడయన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌. గుప్పెడంత మనసు సీరియల్‌కు త్వరలోనే శుభం కార్డు పడిపోతుంది. 

Continues below advertisement

Guppedantha Manasu Serial:  బుల్లితెరపై ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సీరియల్‌ 'గుప్పెడంత మనసు'. ఇందులో రిషి సార్‌కి స్టార్‌ హీరో రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ఇక చెప్పనవసరం లేదు. ముఖేష్‌ గౌడ, రిషి సార్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో ఫ్యాన్స్‌ పేజీలు ఉన్నాయి. అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్‌కి త్వరలోనే శుభం కార్డు పడిపోతుందనే విషయం తెలిసిందే. రీషి రీఎంట్రీతో సీరియల్‌ మరింత రసవత్తరంగా మారింది. రంగగా,  రిషిగా ఒక్కడే డ్యుయెల్‌ రోల్స్‌ చేస్తున్నాడు.

Continues below advertisement

ఇలా సీరియల్‌ రసవత్తరంగా సాగుతున్న సీరియల్‌కి త్వరలోనే ముగుస్తుందని తెలిసి ఫ్యాన్స్‌ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఎప్పుటికో అయ్యింటుందిలే, ప్రస్తుతం సీరియల్‌ ఫ్లో చూస్తుంటే ఇప్పట్లో శుభం పడేలా లేదని సీరియల్‌ లవర్స్ భావిస్తున్నారు. గుప్పెడంత మనసు శుభం కార్డుకు ఇంకా ఎక్కువ టైం లేదు. ఇక త్వరలోనే ఈ సీరియల్‌ ఎండ్‌ కార్డు పడబోతుంది. తాజాగా గుప్పెడంత మనసు టీం ఫెయిర్‌ వెల్‌ పార్టీ  కూడా చేసుకుంది. కాగా ప్రతి ఆదివారం స్టార్‌ మాలో శ్రీముఖి యాంకర్‌లో బుల్లితెర నటీనటులతో ఓ షో వస్తుందనే విషయం తెలిసిందే. 'ఆదివారం స్టార్‌ మా పరివారం' అంటూ సీరియల్‌ నటీనటులతో ఆటలు ఆడిస్తుంది.

తాజాగా ఈ షోకు గుప్పెడంత మనసు సీరియల్‌ టీం కూడా వచ్చేసింది. అయితే ఇది వారికి ఫెయిర్‌ వెల్‌ పార్టీ అంటూ యాంకర్‌ శ్రీముఖి అసలు విషయం చెప్పేసింది. గుప్పెడం మనసు టీం ఎంట్రీ ఇవ్వగానే "ఎంత మిస్‌ అవుతామో తెలుసా మిమ్మల్ని" అని శ్రీముఖి అనగానే వసూధార "నన్నా రిషినా?" అని ప్రశ్నిస్తుంది. ఆడవాళ్లు అయితే రిషిని, మగవాళ్లు అయితే నిన్ను అంటూ ఆటపట్టించింది. ఆ తర్వాత గుప్పెడంత మనసు టీంతో ఈసారి జగతి మేడమ్‌ అలియాస్‌ జ్యోతిరాయ్‌ కూడా వచ్చేసింది. జగతి మేడమ్‌ ఎంట్రీతో గుప్పెడంత మనసు టీంలో మరింత జోష్‌ వచ్చింది.  ఆ తర్వాత వారందని చాలా మిస్‌ అయ్యానని, వారందరి ఒక బాండింగ్‌ ఏర్పడిందని, మేమంతా ఒక ఫ్యామిలీ అని ఆమె మాట్లాడుతుండగానే ప్రొమో ముగిసింది. 

Also Read: షాకిస్తున్న బిగ్‌బాస్‌ 8 ఫైనల్‌ లిస్ట్‌! - హౌజ్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్‌, ఈసారి వాళ్లు కూడా...

సీక్వెల్

ప్రస్తుతం ఈ ప్రోమో చూసి ఈ సీరియల్‌ లవర్స్‌ అంతా డిసప్పాయింట్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే గుప్పుడంత మనసు సీరియల్‌కి సీక్వెల్‌ కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీక్వెల్‌లో రిషి-మను ప్రధాన పాత్రలుగా రానుందని సమాచారం. ఈ సీక్వెల్‌ అనపమ, మహేంద్రల మధ్య ఉన్న రిలేషన్‌ గురించి రివీల్‌ చేసి, రిషి-మను ప్రధాన పాత్రల్లో ఈ సీక్వెల్‌ సాగనుంది టాక్‌. మరి గుప్పుడంత మనసుకు సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: అసలైన రంగాను చూసిన శైలేంద్ర – జగతి లెటర్ గురించి ఆరా తీసిన మహేంద్ర

Continues below advertisement