Trinayani August 5th: సుమన వచ్చి అందులో నిలబడగానే ఆ గీతలు చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. నయని దంపతులు అక్కడికి రావడంతో అది చూసి షాక్ అవుతారు. ఏదో మ్యాజిక్ చేస్తుంది అని ఇంట్లో వాళ్ళు అనడంతో అది మ్యాజిక్ కాదు మోసం అని అంటుంది నయని. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


ఏదో తెలుసుకోవడం కోసమే ఇలా చేస్తున్నారు అని నయని అంటుంది. ఇక సుమనను బయటికి రమ్మని అంటుంది. లోపల ఉన్న పిల్లల్ని తీసుకొని రావడానికి ప్రయత్నించగా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఇక సుమనను తాకటంతో కూడా షాక్ వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు సుమనను బయటికి రమ్మని ఎంత బ్రతిమాలిన కూడా సుమన మాత్రం ఈరోజు తన బిడ్డను చూడాల్సిందే అని మొండిగా ప్రవర్తిస్తుంది.


దీంతో అక్కడి పిల్లలని ఎందుకు కూర్చోబెట్టావు అని తన అత్తపై ఫైర్ అవుతుంది. పిల్లలకు ఏమి జరగదులే అని అంటుంది తిలోత్తమా. ఎవరు చెప్పారు అని నయని అనడంతో.. వెంటనే గురువు ఇంట్లోకి వచ్చి అఖండ స్వామి అని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. స్వామి చెప్పే విపత్తులు చేయకూడదు అని చెబుతాడు. సుమన నిలబడి ఎంత సమయం పట్టింది అనటంతో ఐదు నిమిషాలు కావొస్తుంది  అని హాసిని అంటుంది.


మరో రెండు నిమిషాలల్లో సుమనకు నిజం తెలిసిపోతుంది అని గురువు చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. ఏడు నిమిషాలలో నిజం తెలిసిపోతుంది. మరో రెండు నిమిషాలు మాత్రమే ఉందని అంటాడు.  దాంతో ఇంట్లో వాళ్ళు సుమనను బయటికి రప్పించే ప్రయత్నం చేసినా కూడా సుమన మాత్రం రాదు. ఇక నయని ఏం చేయాలో అర్థం కాక విశాలాక్షిని తలుచుకుంటుంది.


ఇక సుమన గొంతు కూడా మారిపోతుంది తన బిడ్డను చూడబోతున్నాను అని మురిసిపోతుంది. ఇక వలయం అద్దం వరకు పోగా అక్కడ సుమన బిడ్డను చూడబోతున్న సమయంలో వెంటనే శివ వచ్చి సుమనను తగలడంతో సుమన గీత దాటి అవతల వైపు పడిపోతుంది. దాంతో అందరు వెళ్లి తనని పట్టుకుంటారు. పిల్లల్ని కూడా తీసుకుంటారు. ఇక సుమనకు స్పృహ రావడంతో తన బిడ్డను చూడలేకపోయాను అంటూ కోపంగా అరుస్తుంది.


ఆ తర్వాత సుమనను అక్కడి నుంచి లోపలికి తీసుకొని వెళ్ళగా.. అందరూ తిలోత్తమా పై ఫైర్ అవుతారు. ఇటువంటి పనులు చేస్తే ఏం జరుగుతుందో చూసావా అంటూ అరుస్తారు. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు అని తను అనడంతో మరొక నిమిషమైతే నిజం తెలిసిపోయేది కదా అని వల్లభ అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు వారిపై మరింత కోపాన్ని చూపించడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


ఇక సమయానికి శివ వచ్చి కాపాడినందుకు మంచి పని అయింది అని నయని విశాల్ తో అంటుంది. ఇక గదిలో ఉన్న సుమన తనకు గాయం అవ్వడంతో ఆయింట్మెంట్ పెట్టుకుంటుంది. అక్కడికి విక్రాంత్ వచ్చి పెద్దలు మాటలు వినాలి అని లేదంటే ఇటువంటివే జరుగుతాయని చెబుతాడు. హాసిని కూడా వచ్చి ఇటువంటి వాటి జోలికి వెళ్లొద్దు అని సలహాలు ఇస్తుంది. నువ్వు నీ బిడ్డను చూస్తే నీకే ప్రమాదం అని అంటుంది.


అయితే ఆగస్టు 21 వరకు బిడ్డని చూసే ప్రయత్నం నేను చేయకూడదు అని సుమన వారితో అంటుంది. ఇక ఆరోజు డెలివరీ కాబట్టి ఆ రోజున బిడ్డని చూసుకుంటాను.. పైగా ఆరోజు నాగు పంచమి అని ఏవేవో మాట్లాడేస్తూ ఉంటుంది. ఇక హాసిని మాత్రం డెలివరీ కావటానికి మరో 15 రోజులు మాత్రమే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.


 


also read it : Krishnamma kalipindi iddarini August 4th: గౌరీపై అరిచిన సునంద.. సౌదామినికి పెద్ద షాకిచ్చిన ఈశ్వర్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial