Rangula Ratnam June 24th: రేఖ శంకర్ ప్రసాద్ పేరు మీద ఉన్న బోర్డు తీసేసి.. ఆఫీస్ కి తన పేరు పెట్టుకోవడంతో అది చూసిన నర్సింగ్ రేఖ పై అరుస్తాడు. కోపంగా తిడతాడు. దాంతో రేఖ నర్సింగ్ పై చేయి చేసుకుంటుంది. వెంటనే నర్సింగ్ శంకర్ ప్రసాద్ ఇంటికి వెళ్లి ఘోరం జరిగింది అంటూ.. దొంగ చేతులకు తాళాలు ఇచ్చినట్లు అయింది అంటూ ఆఫీస్ దగ్గర జరిగిన విషయం మొత్తం చెబుతాడు.


ఆ రేఖ మిమ్మల్ని నమ్మకం ద్రోహం చేసింది అని చెప్పటంతో వెంటనే శంకర్ ప్రసాద్ కోపంతో ఊగిపోయి ఆఫీస్ కి వెళ్లి చూస్తాడు. అక్కడ రేఖ పేరు మీద ఉన్న బోర్డు ని పక్కనే పడేసి ఉన్న తన పేరు మీద ఉన్న బోర్డ్ ను చూసి కోపంతో రగిలిపోయి.. నమ్మి మోసం చేశావు రేఖ నీ అంతు చూస్తాను అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లిన శంకర్ ప్రసాద్ మూర్తితో జరిగిన విషయాలన్ని ఎందుకు చెప్పట్లేవని ఫైర్ అవుతాడు.


వెంటనే సిద్ధుని నా క్యాబిన్ కు రమ్మని చెప్పు అని అతనికి చెబుతాడు. వెంటనే క్యాబిన్లోకి వెళ్లిన శంకర్ ప్రసాద్ రేఖ పై ఫైర్ అవుతాడు. నమ్మించినందుకు పెద్ద మోసం చేశావు అంటూ.. కోర్టులో నాకు సపోర్టుగా మాట్లాడినందుకు మారిపోయావు అనుకున్నాను కానీ.. ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు అని అంటాడు.


దాంతో రేఖ కూడా ఏమాత్రం భయపడకుండా.. తను ఈ ఆస్తి కోసమే ఇక్కడికి వచ్చాను అన్నట్లు జరిగిన విషయాలన్నీ చెబుతుంది. దాంతో ప్రసాద్ తనే ఇదంతా చేస్తుందని మొత్తం తెలుసుకుంటాడు. నిన్ను ఈ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళగొడతాను అని డాక్యుమెంట్స్ తీసుకుంటాను అని అనటంతో వెంటనే రేఖ నువ్వు ఇచ్చిన ఖాళీ బాండ్ పేపర్లో మీరు నాకు ఈ ఆస్తి ఇస్తున్నట్లుగా రాసుకున్నాను అని చెప్పి షాక్ ఇస్తుంది.


దాంతో శంకర్ ప్రసాద్ నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను అని గొంతు నులుముతుండగా వెంటనే సిద్దు వచ్చి ఆపుతాడు. సిద్దు కి నిజం చెప్పబోతుంటే మొత్తం చేసింది నువ్వే అంటూ తిరిగి శంకర్ ప్రసాద్ కు షాక్ ఇస్తాడు. ప్రతి విషయంలో రఘు ని చూసుకునేది.. అసలు నన్ను పట్టించుకునే వాడివా నువ్వు అంటూ అన్ని పాత విషయాలు తీస్తాడు. దాంతో శంకర్ ప్రసాద్ నువ్వు కూడా నన్ను నమ్మకం ద్రోహం చేశావు మీ ఇద్దరినీ అస్సలు వదలను అని అంటాడు.


వెంటనే ప్రసాద్ సెక్యూరిటీని పిలిచి వారిని వెళ్లగొట్టాలని చేయగా తిరిగి సెక్యూరిటీ వాళ్లు రేఖ, సిద్దు సపోర్టుతో ప్రసాద్ ను బయటికి లాక్కెళ్తారు. దాంతో శంకర్ ప్రసాద్ బాధపడుతూ కార్లో వెళ్తాడు. రేఖ చేసిన మోసాన్ని తలుచుకుంటాడు. పూర్ణ మాట్లాడిన మాటలు నిజమని తెలుసుకుంటాడు. దాంతో స్పృహ కోల్పోయి ఒక చెట్టుకి తగులుతాడు. తీవ్రంగా గాయాలు అవ్వటంతో వెంటనే అక్కడున్న వాళ్ళు హాస్పిటల్లో తరలిస్తారు.


ఇక నర్సింగ్ ఆఫీసులో జరిగిన విషయాన్ని మొత్తం పూర్ణ వాళ్లకు చెప్పటంతో రఘు కోపంతో రగిలిపోతాడు. రేఖ పని చేస్తాను అనడంతో పోలీసులను తీసుకెళ్తే బాగుంటుంది అని సీత వాళ్ళు సలహా ఇస్తారు. కానీ నేనొక్కడినే వెళ్తాను అని రఘు వెళ్తుండగా అప్పుడే తెలిసిన ఆవిడ హాస్పిటల్ నుండి ఫోన్ చేసి.. శంకర్ ప్రసాద్ కి యాక్సిడెంట్ అయిన విషయాన్ని చెబుతుంది. ఇక పూర్ణ కుమిలిపోతుంది.


తరువాయి భాగంలో హాస్పిటల్ కి వెళ్ళగా.. డాక్టరమ్మ అంతా బాగానే ఉంది కానీ కళ్ళు కోల్పోయాడు అని చెప్పటంతో పూర్ణ వాళ్లు షాక్ అవుతారు. ఇక జరిగిన విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్తున్న సిద్దు దంపతులను రేఖ ఆపుతుంది.


Also Read: Krishnamma kalipindi iddarini June 23th: భవాని మాటలకు షాకైన సౌదామిని, ఆదిత్య విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సునంద?