Rangula Ratnam June 26th: రఘుకు నూకాలు ఫోన్ చేసి శంకర ప్రసాద్ కి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పడంతో రఘు షాక్ అయ్యి ఆ విషయాన్ని తన తల్లికి, భార్యకు చెప్పటంతో వెంటనే పూర్ణ కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఆ తర్వాత తనను లేపి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మరోవైపు శంకర్ ప్రసాద్ కు హాస్పిటల్ లో డాక్టరమ్మ వైద్యం చేస్తూ ఉంటుంది.


ఇక నూకాలమ్మ అక్కడే ఉండి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హాస్పిటల్ కి పూర్ణ తో పాటు రఘు దంపతులు చేరుకుంటారు. ఇక లోపల బెడ్ మీద ఉన్న శంకర్ ప్రసాద్ ని చూసి బాగా ఎమోషనల్ అవుతారు. ఇక పూర్ణ తట్టుకోలేక పోతుంది. ఇక పక్కనే ఉన్న సీత ధైర్యం ఇస్తూ ఉంటుంది. డాక్టరమ్మ బయటికి వచ్చి ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతుంది.


కానీ కళ్ళకు కారు అద్దాలు కుచ్చుకోవడం వల్ల చూపు కోల్పోయాడు అని చెప్పటంతో షాక్ అవుతారు. దాంతో డాక్టరమ్మ పూర్ణకు ధైర్యంగా ఉండమని చెబుతుంది. ప్రాణాలు దక్కాయని సంతోషపడమని చెబుతుంది. మరోవైపు సిద్దుకి తన తండ్రి కి యాక్సిడెంట్ అయిన విషయం తెలియటంతో వెంటనే స్వప్నని పిలిచి చెబుతాడు.


అక్కడే ఉన్న రేఖ ఆ మాటలు వింటూ తనను కొట్టినందుకు తగిన శాస్త్రీ జరిగిందని అనుకుంటుంది. ఇక సిద్దు వాళ్ళు బయలుదేరుతుండగా వారిని ఆపుతుంది. కానీ వాళ్ళు మాత్రం మేము వెళ్ళాలి లేదంటే మాపైన అనుమానం పడతారు అని స్వప్న అంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ రఘు, పూర్ణ ఉంటారు.


వాళ్లు కూడా తిరిగి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మీ నాన్నకు అలా జరిగినందుకు సేవలు చేయటానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. అంతేకాకుండా మీ నాన్న రఘుకు ఆఫీస్ బాధ్యతలు కూడా ఇస్తాడు అని మాయ మాటలు చెప్పటంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక హాస్పిటల్లో శంకర్ ప్రసాద్ ని చూడటానికి పూర్ణ వాళ్లు లోపలికి వెళ్తారు.


ఇక రఘు, పూర్ణ పలకరించడంతో శంకర్ ప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శంకర్ ప్రసాద్ కు చూపు పోయిందని చెప్పి స్ట్రెస్ తీసుకోవద్దని అంటాడు. కానీ శంకర్ ప్రసాద్ మాత్రం పూర్ణ వాళ్ళు ఉండటాన్ని అసలు జీర్ణించుకోలేకపోతాడు. దాంతో రఘు అక్కడి నుంచి తల్లిని, భార్యను బయటికి తీసుకెళ్తాడు. ఏమి చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంది పూర్ణ. తరువాయి భాగంలో వర్షకు తన తండ్రికి యాక్సిడెంట్ అయిన విషయం తెలియటంతో బాధతో గట్టిగా అరుస్తుంది.


Also Read: Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్?