Star Maa Serials TRP Ratings: స్టార్ మాలో రేటింగ్స్ మారలేదు... 'జీ తెలుగు'లో టాప్‌ ప్లేస్ మారింది - ఈ వీక్ టాప్ 10 లిస్ట్ చూడండి

Telugu Serials TRP Ratings Latest: లాస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 'స్టార్ మా'లో రేటింగ్స్ మారలేదు. కానీ, 'జీ తెలుగు'లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ వారం టాప్ 10 లిస్ట్ చూడండి.

Continues below advertisement

Telugu TV serials TRP ratings this week - Check out list of top 10: 'గుండె నిండా గుడి గంటలు' జైత్రయాత్ర ఈ వారం కూడా కంటిన్యూ అయింది. స్టార్ మా ఛానల్ వరకు మాత్రమే కాదు... ఈ వారం టాప్ టెన్ సీరియల్ లిస్టులో ఆ సీరియల్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ వారం కూడా 'కార్తీకదీపం నవ వసంతం' రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి రెండో వారం... ఈ ఏడాది (2025) ఆరో వారం టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... టాప్ 10 లిస్టులో ఏయే సీరియల్స్ ఉన్నాయో చూడండి.

Continues below advertisement

గుండె నిండా గుడిగంటలే టాప్... టాప్ 3లో మళ్లీ అవే!
'గుండె నిండా గుడి గంటలు'కు లాస్ట్ వీక్ 11.34 టీఆర్పీ వచ్చింది. ఈ వీక్ కాస్త టీఆర్పీ తగ్గింది. కానీ, టాప్ ప్లేస్ మాత్రం వదులుకోలేదు. ఆ తర్వాత 'కార్తీక దీపం 2', 'ఇంటింటి రామాయణం' నిలిచాయి. 

స్టార్ మా ఛానల్ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'గుండె నిండా గుడి గంటలు'కు 10.28 టీఆర్పీ రేటింగ్ రాగా... 'కార్తీక దీపం 2 నవ వసంతం'కు 10.12 వచ్చింది. 'ఇంటింటి రామాయణం' 9.63 టీఆర్పీ నమోదు చేసింది. మిగతా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (8.91), 'నువ్వుంటే నా జతగా' (7.64), 'చిన్ని' (7.46), 'బ్రహ్మముడి' (5.99),  'మగువా ఓ మగువా' (5.79), 'పలుకే బంగారమాయేనా' (5.46), 'నిన్ను కోరి' (4.37), 'గీత ఎల్.ఎల్.బి' (4.28), 'మామగారు' (4.28) సాధించాయి. 

జీ తెలుగులో మళ్ళీ 'జగద్ధాత్రి' టాప్!
స్టార్ మా తర్వాత సీరియల్స్ పరంగా బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంటున్న ఛానల్ 'జీ తెలుగు'. లాస్ట్ వీక్ 'పడమటి సంధ్యారాగం' టాప్ ప్లేసులో ఉండగా... ఈ వారం 'జగధ్దాత్రి' నంబర్ వన్ పొజిషన్‌కు వచ్చింది.

Also Readజీ తెలుగులో కొత్త సీరియల్... 'లక్ష్మీ నివాసం' కథ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?

ఫిబ్రవరి రెండో వారంలో... 2025లో ఆరో వారంలో 'జగధ్దాత్రి'కి 7.33 టీఆర్పీ వచ్చింది. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'చామంతి' (7.07), 'మేఘ సందేశం' (6.99), 'పడమటి సంధ్యారాగం' (6.77), 'అమ్మాయి గారు' (6.33), 'నిండు నూరేళ్ల సావాసం' (6.28), 'ప్రేమ ఎంత మధురం' (4.82), 'మా అన్నయ్య' (4.21) టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి.

జెమిని టీవీలో 'భైరవి' సీరియల్ 1.08 టీఆర్పీ రేటింగ్ సాధించింది. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... ఒక్కటి కూడా ఒకటి కంటే ఎక్కువ టీఆర్పీ రాబట్టడంలో సక్సెస్ కాలేదు. ఈటీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే... 'రంగుల రాట్నం' (2.18), 'మనసంతా నువ్వే' (2.10), 'ఝాన్సీ' (1.64), 'శతమానం భవతి' (1.47), 'బొమ్మరిల్లు' (1.50) సాధించాయి.

Also Read: ఫ్లాప్ సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేసిన జెమినీ టీవీ - టైమ్‌ స్లాట్‌ కాస్త మార్చి కొత్త షో రెడీ

Continues below advertisement