Producers Clarity On 'Rakt Bramhand' Web Series: సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్'. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. తాజాగా తాము నిర్మిస్తున్న సిరీస్ ఆగిపోయింది అంటూ వస్తున్న రూమర్లపై స్పందించారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సిరీస్‌ని నెట్ ఫ్లిక్స్ ఆపేసిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా రాజ్ అండ్ డీకే ఆ పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టారు. 

రూమర్స్‌పై స్పందించిన రాజ్, డీకే రాజ్ అండ్ డీకే  భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్'. ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దాదాపు రూ.3 కోట్లు దొంగిలించాడని, విషయం తెలిసిన నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్‌ని ఆపేసి, విచారణకు ఆదేశించిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా స్క్రిప్ట్ పరంగా కూడా ఈ సిరీస్ లేట్ అవుతుందని అన్నారు. అంతేకాదు రాజ్ అండ్ డీకే కథలో ఇన్వాల్వ్ అవ్వడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోతో దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ప్రకటించిన 'గుల్కండ టేల్స్' సిరీస్ ఆగిపోయిందని టాక్ నడిచింది. ఈ వార్తలు అన్నింటిపై ఒకేసారి రాజ్ అండ్ డీకే రియాక్ట్ అయ్యారు. 

Read also : హీరోయిన్‌తో డేటింగ్ వల్లే భార్యకు విడాకులు ఇచ్చాడా? క్లారిటీ ఇచ్చిన ‌హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్

ఆ మూడు సిరీస్‌లు రిలీజ్ అవుతాయి 

ఇన్ డైరెక్ట్‌గా తమ వెబ్ సిరీస్‌ల విషయంలో వచ్చిన రూమర్స్‌పై స్పందిస్తూ, సెట్స్‌లో దిగిన వాళ్ల ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయంలో రెండు ఆప్షన్స్ ఉంటాయని, అందులో ఒకటి వాటిని పట్టించుకోకుండా సైలెంట్‌గా పని చేసుకుంటూ వెళ్లడమని అన్నారు. తాము అదే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నామని పేర్కొంటూ, తమ ప్రాజెక్టులు ఏవీ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్', అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లు గుల్కండ టేల్స్, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కచ్చితంగా రిలీజ్ అవుతాయని రాజ్ అండ్ డీకే హామీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ దర్శక ద్వయం రియాక్ట్ అవుతూ చేసిన వరుస ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. 

కాగా 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, సమంతా, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌కి 'తుంబాద్' ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ అండ్ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఈ సిరీస్ సెట్స్ పైకి వెళ్లింది. మరోవైపు 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది.  

Also Read: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్స్... టాప్ 10 లిస్ట్ అంతా షారుఖ్‌తో సినిమాలు చేసినోళ్లే, ఫస్ట్ ముగ్గురూ వెరీ స్పెషల్