Just In





Yevandoi Sreemathigaru Serial: ఫ్లాప్ సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేసిన జెమినీ టీవీ - టైమ్ స్లాట్ కాస్త మార్చి కొత్త షో రెడీ
Bhamalu Satya Bhamalu Show on Gemini TV: జెమినీ టీవీలో ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త షో ప్రారంభం కానుంది. ఆ షో కోసం కేటాయించిన టైంలో వచ్చే ఫ్లాప్ సీరియల్‌కు ఎండ్ కార్డు వేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

టీఆర్పీ రేటింగ్స్ పరంగా మిగతా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు స్టార్ మా, జీ తెలుగుతో కంపేర్ చేస్తే... ఈటీవీ, జెమినీ టీవీ (Gemini TV) ఎప్పుడూ వెనకబడి ఉంటాయి. మొదటి రెండూ కొత్త కొత్త సీరియళ్లతో దూసుకు వెళుతుంటే... ఈ రెండిటిలో సీరియల్స్ అప్డేట్ అవ్వలేక రేటింగుల్లో వెనకబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త అప్డేట్ కావడానికి అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా తమ ఛానల్ ఫ్లాప్ సీరియల్ (Gemini TV Serials Telugu)కు ఎండ్ కార్డు వేసి కొత్త షో స్టార్ట్ చేస్తోంది జెమినీ టీవీ. ఆ వివరాల్లోకి వెళితే...
ఏవండోయ్ శ్రీమతి గారు... ఈ వారంతో ఆఖరు!
కన్నడ భామ, సీరియళ్లతో తెలుగు ప్రజలకు దగ్గరైన నటి పల్లవి గౌడ ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరియల్ 'ఏవండోయ్ శ్రీమతి గారు' (Yevandoi Sreemathigaru). జెమినీ టీవీలో కొన్ని రోజులుగా ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. అయితే, దీని టీఆర్పీ రేటింగ్ అంతంత మాత్రమే.
Also Read పల్లవి గౌడ డబుల్ ధమాకా... జీ తెలుగు సీరియల్ 'నిండు నూరేళ్ళ సావాసం'లో ట్విస్ట్ తెలిసిందా?
లాస్ట్ వీక్ 'ఏవండోయ్ శ్రీమతి గారు'కు 0.18 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీని కంటే కింద ఉన్న జెమినీ టీవీ సీరియళ్లు 'స్నేహం కోసం' (0.18), 'రాధ' (0.15) మాత్రమే. అంతకు ముందు వారం 'ఏవండోయ్ శ్రీమతి గారు'కు 0.18 రేటింగ్ వచ్చింది. ఆపై వారం 0.17. ఎప్పుడూ కింద నుంచి మూడో స్థానంలో ఉంటున్న ఈ ధారావాహికకు శుభం కార్డు వేయాలని 'జెమినీ టీవీ' డిసైడ్ అయ్యింది. ఇటీవల క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేసింది. అది ఈ శనివారం (ఫిబ్రవరి 22న) టెలికాస్ట్ కానుంది.
ఏవండోయ్... కొత్త షో 'భామలు సత్యభామలు'
'ఏవండోయ్ శ్రీమతి గారు' ప్లేసులో, అంటే ఆ టైం స్లాట్‌లో కొత్త సీరియల్ బదులు షో తీసుకు రావడనికి 'జెమినీ టీవీ' ప్లాన్ చేసింది. 'భామలు సత్యభామలు' (Bhamalu Satya Bhamalu Show) పేరుతో కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఫిబ్రవరి 24 (అంటే వచ్చే సోమవారం) ఆ షో మొదలు పెడుతోంది.
Also Read: జీ తెలుగులో కొత్త సీరియల్... 'లక్ష్మీ నివాసం' కథ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న 'భామలు సత్యభామలు' షో సోమ నుంచి శని వారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానుంది. 'ఏవండోయ్ శ్రీమతి గారు' ప్రతి రోజూ మధ్యాహ్నం 2.30 గంటలకు టెలికాస్ట్ అయ్యేది. అయితే, 'భామలు సత్యభామలు' కోసం టైమ్ స్లాట్స్ అడ్జస్ట్ చేశారు. వేరే సీరియల్స్ టైమింగ్ మార్చడంతో మధ్యాహ్నం 12 గంటల స్లాట్ కొత్త షోకి కేటాయించడానికి వీలు పడింది. ఈ షోకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఆల్రెడీ ప్రోమో విడుదల చేశారు. అది చూస్తే యాంకర్ భార్గవ్ హోస్ట్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. మరి, 'జెమినీ టీవీ'కి 'భామలు సత్యభామలు' అయినా మంచి టీఆర్పీ రేటింగ్ తీసుకు వస్తుందో లేదో చూడాలి.