బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ ను కూడా మొదలుపెట్టారు. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయింది. బిందు మాధవి ఈ సీజన్ విన్నర్ గా నిలిచింది. ప్రతి సీజన్ కనీసం వంద రోజులకు పైగా సాగుతుంది. అయితే ఈ వంద రోజుల ఫన్ ని ఒక్క రోజులో చూపించడానికి రెడీ అయింది స్టార్ మా ఛానెల్. 


ఈ క్రమంలో వారి ఛానెల్ లో పాపులర్ సీరియల్స్ లో నటిస్తోన్న కొందరు తారలను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. 'గృహలక్ష్మి' ఫేమ్ కస్తూరి, 'దేవత' సీరియల్ నటి సుహాసిని, 'కలిసి ఉంటే కలదు సుఖం' సీరియల్ హీరో.. ఇలా దాదాపు 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి హోస్ట్ గా యాంకర్ సుమ వ్యవహరించింది. 


బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్క్ లైతే ఇస్తారో ఈ పదహారు మందితో అలాంటి టాస్క్ లే ఆడించారు. హారర్ హౌస్ టాస్క్ కూడా ఇచ్చారు. హౌస్ మేట్స్ అందరూ ఒక్కరోజు మాత్రమే హౌస్ లో ఉండనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. హౌస్ మేట్స్ అంతా తమ పెర్ఫార్మన్స్ తో బాగా నవ్వించారు. ఇక హోస్ట్ గా సుమ ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోమో అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. 'బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్' అంటూ ఈ ప్రోమోను వదిలారు. మరికొద్దిరోజుల్లోనే ఈ షో టెలికాస్ట్ కానుంది!


Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో


Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?