Vyshnavi Gade House Warming Video: ఈరోజుల్లో చాలావరకు సీరియల్స్ ఆర్టిస్ట్స్‌కు యూట్యూబ్ ఛానెల్స్ ఉండడం కామన్ అయిపోయింది. అందులో వారి ప్రొఫెషనల్ లైఫ్ విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. కొందరు అయితే యూట్యూబ్ ఛానెల్‌తోనే రెండు చేతులా సంపాదిస్తుండడంతో సీరియల్స్‌లో నటించడం కూడా మానేస్తున్నారు. అందులో ఒకరు ‘దేవత’ సీరియల్ ఫేమ్ వైష్ణవి రామిరెడ్డి. ‘దేవత’ మాత్రమే కాదు.. మరెన్నో తెలుగు సీరియల్స్‌తో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి. తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది.


యాక్టింగ్ మానేసింది..


స్టార్ మాలో ప్రసారమయ్యే ‘దేవత’ సీరియల్‌లో సెకండ్ హీరోయిన్‌గా బిజీగా గడిపేస్తున్న సమయంలోనే సురేశ్‌ను పెళ్లి చేసుకుంది వైష్ణవి. పెళ్లి కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్ కొన్నాళ్లే అని, పెళ్లి తర్వాత యాక్టింగ్ మళ్లీ కంటిన్యూ చేస్తుందని బుల్లితెర ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో తను పూర్తిగా యాక్టింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసిందని ప్రేక్షకులకు అర్థమయ్యింది. సీరియల్స్‌లో యాక్టింగ్ మానేసినా.. సోషల్ మీడియా, తన యూట్యూబ్ ఛానెల్‌లో మాత్రం యాక్టివ్‌గానే ఉంటూ వస్తోంది వైష్ణవి రామిరెడ్డి. అందుకే తాజాగా తన గృహ ప్రవేశ వీడియోను కూడా తన ఛానెల్ అయిన ‘వాహ్ వైష్ణవి’లో అప్లోడ్ చేసింది.



ప్రతీ అప్డేట్..


సీరియల్స్‌లో ఉన్నప్పుడు కూడా వైష్ణవి రామిరెడ్డి.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తుండేది. కానీ యాక్టింగ్ ఆపేసిన తర్వాత యూట్యూబ్‌లో మరింత యాక్టివ్ అయ్యింది. తాజాగా గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన వైష్ణవి.. అంతకంటే ముందు నుండే ఇల్లు చూస్తున్నామని, ఇక ఇల్లు కొనాలి అనుకుంటున్నామని తన కొత్త ఇంటికి సంబంధించిన ప్రతీ అప్డేట్ ఇస్తూ వచ్చింది వైష్ణవి. గృహ ప్రవేశానికి సంబంధించిన షాపింగ్, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చెప్తూ కూడా ఒక వీడియో చేసింది. తను చేసే ప్రతీ యూట్యూబ్ వీడియోకు వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి.


ట్రెండింగ్‌లో వీడియో..


వైష్ణవి రామిరెడ్డికి సంబంధించిన ‘వాహ్ వైష్ణవి’ యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 6.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అందుకే తను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే చూడడానికి ఇష్టపడతారు బుల్లితెర ప్రేక్షకులు. అందుకే తాజాగా తను అప్లోడ్ చేసిన గృహ ప్రవేశం వీడియో కూడా దాదాపు 3 లక్షల వ్యూస్‌ను సంపాదించుకొని ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరింది. ఈ వీడియోలో తన గృహ ప్రవేశం మొదలయినప్పటి నుండి పాలు పొంగించడం, సత్యానారాయణ కథ, హోమం లాంటి అన్నింటిని కవర్ చేస్తూ సబ్‌స్క్రైబర్లకు చూపించింది వైష్ణవి. వారి పద్ధతిలో అన్ని పూజలను పూర్తి చేస్తూ అన్నింటిలో ఈ వీడియోలో స్పష్టంగా చూపించింది ఈ బుల్లితెర నటి.



Also Read: చేవెళ్ల ఎంపీ బరిలో ‘పొలిమేర’ బ్యూటీకి గాజు గ్లాస్ - ‘జనసేన’ కాదు గానీ మెగా ఫ్యాన్స్ మద్దతిస్తారా?