Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ వాళ్లు మాట్లాడుకుంటుంటే సీత కిచెన్ నుంచి వచ్చి చాటుగా వింటుంది. సీత వల్ల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయని ముఖర్జీ ఎదురుగా అతని వల్ల నిశ్చితార్థం చేయాల్సి వచ్చిందని మహాలక్ష్మి జనార్థన్‌తో చెప్తుంది. సీత ముఖర్జీని ఇంటికి రప్పిస్తుందని అనుకోలేదని అర్చన అంటుంది. మీటింగ్ విషయం ఇంట్లో చెప్పకుండా వెళ్లాల్సింది చెప్పడం వల్లే ఇలా జరిగిందని జనార్థన్ అంటాడు. 


మహాలక్ష్మి: చెప్పకుండా వెళ్లినా ఎందుకు ఎక్కడి వెళ్లారని అనుకునే వాళ్లు కదా మన టైం బాలేదు అనుకోవాలి అంతే. సీత నవ్వుకుంటుంది. ఇంతలో ఇద్దరు వచ్చి తన అబ్బాయి పెళ్లి అని పిలవడానికి వచ్చాం అని అంటుంది. ఇక గోడ మీద సీత ఫొటో చూసి ఆ అమ్మాయి ఎవరు మీ అబ్బాయి పక్కన ఉందని అంటారు. 
సీత: ఆ ఫొటోలో అమ్మాయిని నేనే నేను సీత రామ్ భార్యని ఈ ఇంటి కోడలిని. ఇక వాళ్ల సీతని పొగిడి పెళ్లి కార్డు ఇస్తారు. తమ కోడలు బాగా చదివిందని పెళ్లి తర్వాత బిజినెస్ చూసుకుంటుందని అంటారు. ఇక మహాలక్ష్మీ సీతకి చదువు రాదని సీతని చేసుకోవడం మా దురదృష్టం అని అంటారు. ఇక వాళ్లు కూడ సీతని బాగా అవమానిస్తారు. సీత బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీతకి మంచి అవమానం జరిగిందని నవ్వుకుంటారు. 
జనార్థన్: సీతని మనం కోడలిగా అంగీకరించి తనని అవమానిస్తే మనకే కదా అవమానం అది కూడా బయటి వాళ్ల ముందు.
మహాలక్ష్మి: నాకు సంబంధించిన వరకు సీత ఈ ఇంటి మనిషి కాదు జనా ఇంకా పరాయిదే. అర్చన దాన్ని ఇంకా బాధ పెట్టాలి పద.
అర్చన: సీత కుమిలి కుమిలి ఏడుస్తున్నట్లుంది మహా.
మహాలక్ష్మి: అదే మనకి కావాలి దాన్ని ఇంకా ఏడిపించాలి. ఏంటి సీత అటు తెరిగి వెక్కి వెక్కి ఏడుస్తున్నావా.
అర్చన: ఓసారి ఇటు తిరిగి నీ ముఖ చిత్రం చూపించమ్మా.
సీత: ఏంటి అత్తలు నేను బాధ పడుతున్నాను అనుకున్నారా అంత ఖర్మ నాకు ఎందుకు. నేను అక్కడుంటే మీ పరువు పోతుందని నేను వచ్చాను. ఇంకాసేపు నేను అక్కడుంటే మీ పరువే పోయేది. నాకు చదువు రాదు బిజినెస్ చూసుకోలేను అన్నారు. మరి మీకు ఏ అర్హత ఉందని కంపెనీలు చూస్తున్నారు. 
అర్చన: మహా అర్హత కోసం నువ్వు అడుగుతున్నావా.
సీత: అదంతా మా సుమతి అత్త పెట్టిన భిక్ష. ఆవిడ లేదు కాబట్టే ఈవిడ పెత్తనం చేస్తుంది. ఈ విషయం నేను చెప్తే మీ పరువు ఏమయ్యేది. అసలు మీరు ఏంటి చిన్నత్తయ్య ఈవిడ చెప్పే దానికి తల ఊపడం తప్ప ఇంకేం చేస్తున్నారు. మా సుమతి అత్తయ్య లేకపోతే మీకు కనీసం ఇదే కంపెనీలో ఉద్యోగం వచ్చేదా. ఇదంతా చెప్పి మీ పరువు తీయకూడదని ఇక్కడికి వచ్చాను. ఇదంతా చెప్పి ఉంటే మీ పరువు పోయేది కదా. నాకు ఏం రాదు చేతకాదు అన్నారు కదా ఇక నుంచి నేను ఆ పని లోనే ఉంటా మీకు మతిపోయేలా చేయకపోతే నేను సీతే కాదు.
అర్చన: ఏంటి సీత దీని ధైర్యం దీన్ని ఏడిపించాలి అనుకున్న ప్రతీ సారి రివర్స్ అయిపోతుంది
మహాలక్ష్మి: దాన్ని నేను తొక్కేస్తాను. అలా చేయకపోతే నేను మహాలక్ష్మీనే కాదు.


మధు జలజ మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. సూర్య ఆపరేషన్ కోసం సీత డబ్బు రెడీ చేస్తానని చెప్పిందని ఎంత వరకు ఆ పని వచ్చిందని తెలుసుకోవాలని ఫోన్ చేస్తుంది. అవకాశం ఉంటే తొందరగా డబ్బు ఏర్పాటు చేయమని మధు చెప్తుంది. సీత సరే అంటుంది. పదే పదే అడుగుతున్నానని ఏం అనుకోవద్దని మధు అంటుంది. దానికి సీత అలా అనుకోవద్దని చెప్తుంది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత రామ్ వస్తాడు. ఆపరేషన్ గురించి పది లక్షలు పిన్నిని అడిగితే వెంటనే ఇస్తుందని రామ్ అంటాడు. దానికి సీత వద్దు అనేస్తుంది. ఇంతలో రామ్‌కి ఫోన్ వచ్చి వెళ్లిపోతాడు. మళ్లీ టైలరింగ్ మొదలు పెట్టి బట్టలు కుట్టి తానేంటో ఇద్దరు అత్తలకు చూపిస్తాను అని సీత అనుకొని బయటకు వెళ్లి అందరినీ అడుగుతుంది. వాళ్లు నువ్వు మహాలక్ష్మీ కోడలివి కాబట్టి నీకు ఇలాంటి పని ఇచ్చి అవమానించలేమని ఎవరూ ఇవ్వరు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: నిద్రపోతున్న క్రిష్‌తో మనసులో మాటలు చెప్పి కంగుతిన్న సత్య.. విడాకులు ఇచ్చేదేలేదట..!