Seethe Ramudi Katnam Serial Today Episode రాకేశ్‌తో ప్రీతి పెళ్లి చేసేయాలని మహాలక్ష్మీ, అర్చన అనుకుంటారు. ప్రీతి ఫోన్‌లో గేమ్‌ ఆడుతుంటే రాకేశ్ ఫోన్ చేస్తాడు. నిన్ను చూడాలి.. మాట్లాడాలి అని ఉందని నిన్ను చాలా ప్రేమిస్తున్నానని ఎప్పుడెప్పుడు పెళ్లి అవుతుందా అని ఎదురు చూస్తున్నానని చెప్తాడు. ప్రీతి హ్యాపీగా ఫీలవుతుంది. పెళ్లి తర్వాత నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా ఏ కష్టం రానివ్వను  అని ప్రామిస్ చేస్తాడు. ప్రీతి ముసిముసిగా నవ్వు కోవడం అటుగా వెళ్తున్న విద్యాదేవి చూస్తుంది. 


రాకేశ్: ఎంగేజ్మెంట్ రోజు మీ వదిన అలా నా గురించి బ్యాడ్‌గా అనడం నాకు నచ్చలేదు.
ప్రీతి: మా వదిన చాలా మంచిదండి తన గురించి తప్పుగా అనుకోవద్దు. 
రాకేశ్: అవును నువ్వు ఆ రూమర్స్ అన్నీ నమ్మొద్దు పెళ్లి తర్వాత నేను ఏంటో నీకు తెలుస్తుంది.
ప్రీతి: తర్వాత కాల్ చేస్తా బాయ్ బాయ్
విద్యాదేవి: ఫోన్‌లో ఎవరితో మాట్టాడుతున్నావ్ ఆ పెళ్లి కొడుకుతోనా అతని గురించి రకరకాలుగా వింటున్నావ్ కదా అప్పుడే మాట్లాడటం ఎందుకు ప్రీతి.
మహాలక్ష్మీ: అయ్యిందా మీ ఉపన్యాసం. కాబోయే దంపతులు మాట్లాడుకుంటే తప్పేముంది. అయినా మీ ప్రాబ్లమ్ ఏంటి . ప్రీతి ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఒప్పుకోరు కాబోయే భర్తతో మాట్లాడినా ఒప్పుకోవడం లేదు మీరు ఏమైనా హాస్టల‌ వార్డెనా. అసలు మీరు మా ఇంట్లో ఉన్నారా లేక మేం మీ ఇంట్లో ఉన్నామా. చూడండి నేను అన్నీ ఎంక్వైరీలు చేసిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరిపించాను. రెండు మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అనసరమైన అనుమానాలు ప్రీతికి పెట్టొద్దు.
సీత: మా టీచర్ చెప్పినదాంట్లో తప్పేముంది. పంతం పట్టిన వారికి మంచి మాటలు ఎక్కవు టీచర్ రండి వెళ్దాం. చివరకు ఏమవుతుందో చూద్దాం.


సీత బిజినెస్‌లో బాగా లాభాలు వస్తున్నాయని రామ్‌తో చెప్తుంది. ఇక రామ్‌ అలిగాను అని  అంటే రామ్కి ముద్దులు పెడుతుంది. ఇక విద్యాదేవి సీతతో పెళ్లి కొడుకు గురించి టెన్షన్‌గా ఉందని నువ్వేం చేయలేవా సీత అని అడుగుతుంది. దానికి సీత చివరి నిమిషం వరకు ఆగి చూడండని అంటారు. ఇంతలో రాకేశ్ వాళ్లు వస్తారు. రాకేశ్‌ని చూసి మహాలక్ష్మీ కాస్త భయపడుతుంది. మొదటి శుభలేక ఇవ్వడానికి వచ్చామని చెప్తారు. వ్యవహారం శుభలేకల వరకు వచ్చిందని విద్యాదేవి సీతతో అంటుంది. ఇక రాకేశ్ ప్రీతి కోసం వెతుకుతాడు. రాకేశ్ తల్లి ప్రీతితో మంచి కాఫీ పెట్టించమని అంటుంది. రామ్, ప్రీతిలు వచ్చి అందరికీ విష్ చేస్తారు. ఇక అర్చన ప్రీతికి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. ప్రీతి వెళ్లి సీతకి కాఫీలు అడిగితే విద్యాదేవి కోపంగా వాళ్లు నీకు పనికి రెడీ చేస్తుంటే నువ్వు కాఫీ రెడీ చేయాలని అంటారు.


రాకేశ్ తల్లిదండ్రులు మహాలక్ష్మీ వాళ్లకి శుభలేక ఇస్తారు. ఆరు నూరు అయినా అనుకున్న ముహూర్తానికే పెళ్లి అవుతుందని మహాలక్ష్మీ అంటే జనార్థన్‌ తుమ్ముతాడు. అందరూ అపశకునంలా ఫీలవుతారు. సీత ప్రీతితో కాఫీ పంపిస్తుంది. విద్యాదేవి సీతతో ఏదో ఒకటి చేయు సీత అని బలిమాలితే మీరు ఊహించని ట్విస్ట్ ఇప్పుడు రాబోతుందని సీత అంటుంది. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సీత తండ్రి శివకృష్ణ యూనీఫాంలో అక్కడికి వచ్చి ఆపండని మీ పెళ్లి ముచ్చట్లు ఆపమని అంటాడు. అన్నయ్య వచ్చాడేంటి అనుకొని విద్యాదేవి హాల్‌లోకి వెళ్తుంది.


శివకృష్ణ: ఈ పెళ్లి జరగదు.
మహాలక్ష్మీ: ఎందుకు జరగదు.
శివకృష్ణ: జరగకూడదు. ప్రీతి మేనమామగానే కాదు బాధ్యత గల పోలీస్ అధికారిగా చెప్తున్నా ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదు. పెళ్లి కొడుకు గురించి అంతా ఎంక్వైరీ చేసే వచ్చా. వాడో క్రిమినల్‌ చాలా సార్లు జైలుకి వెళ్లి వచ్చాడు. వాడికి అన్నీ బ్యాడ్ హ్యాబిట్సే ఉన్నాయి. సాక్ష్యాధారలతో వచ్చా ఈ ఫైల్స్ చూడండి ఎన్ని స్టేషన్లలో ఎన్ని శిక్షలు అనుభవించి వచ్చాడో చూడండి.  
రాకేశ్: ఎవరో తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చారు అవి నమ్మొద్దు నేను మంచి వాడిని.
శివకృష్ణ: నువ్వే తప్పోడివి ఎన్ని జైళ్లలో శిక్షలు అనుభవించావో జైలర్లని పిలిచి చెప్పమంటావా. బావగారు వీడి క్రిమినల్ హిస్టరీ చాలా పెద్దది ఈ పెళ్లి ఆపండి.
చలపతి: వాళ్లకి వాళ్ల పంతమే ముఖ్యం ప్రీతి ఏమైపోతే ఏంటి
రామ్: ఇంత తెలిశాక ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. నా చెల్లిని ఒక క్రిమినల్‌కి ఇచ్చి పెళ్లి చేయను.
విద్యాదేవి: ఇప్పటికైనా కళ్లు తెరవండి ఈ నీచుడితో సంబంధం తెంచుకోండి.
రాకేశ్‌: మర్యాదగా మాట్లాడండి.
మహాలక్ష్మీ: ఆపరా. నువ్వు క్రిమినల్ అని తెలియక నా కూతురి గొంతు కోయబోయాను. నా కోడలు చెప్పినా నమ్మలేదు. మీరు మర్యాదస్తులు అనుకున్నా ఇంత దుర్మార్గులు అనుకోలేదు. 
రాకేశ్‌: పెళ్లి ఆపితే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రామ్ కోసంతో రాకేశ్‌ కాలర్ పట్టుకొని ఏం చేస్తావ్‌రా అని కొట్టబోతాడు. మహాలక్ష్మీ రామ్‌ని ఆపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఛైర్మన్ పదవిని వదులుకున్న మిత్ర.. భర్త కోసం లక్ష్మీ పోరాటం!