Jagadhatri  Serial Today Episode:  ఎవరికి పుట్టాడో తెలియని వాణ్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఊరుకోను అని యువరాజ్‌ అనగానే సుధాకర్‌ కోపంగా యువరాజ్‌ను కొడతాడు. వైజయంతి అడ్డు వెళ్లబోతుంటే.. ఆమెను తిడతాడు సుధాకర్‌. కేదార్‌ కిడ్నీ దానం చేస్తానంటే జగధాత్రి ఆపలేదు. మధ్యలో వీడికెందుకు అంటూ ప్రశ్నిస్తాడు.  చూశావా యువరాజ్‌ కొడుకు అంటే అలా ఉండాలి. కోడలు అంటే ఇలా ఉండాలి అని చెప్తాడు.


ధాత్రి: యువరాజ్‌ ఇప్పుడు నీ సమస్య కేదార్‌ మామయ్యగారి కొడుకా..? కాదా అన్నది కాదు. మామయ్యగారిని ఎలా కాపాడుకోవాలి అనేది. మామయ్యగారికి నీ కిడ్నీ సరిపోదు అని డాక్టర్‌ చేత చెప్పించారు. అదే డాక్టర్‌ గారు అలా చెప్పారు అంటున్నాను. కేదార్‌ కిడ్నీ సరిపోతుంది అన్నప్పుడు కేదారే ఇస్తాడు.


నిషిక: అదేం కుదరదు. కిడ్నీ దానం చేసి ఈ ఇంటికి వారసుడు అయిపోదామనుకుంటున్నారు.


సుధాకర్‌: కిడ్నీ దానం చేసినా చేయకపోయినా వాడు ఈ ఇంటి వారసుడు. వాడు నా కొడుకు.


వైజయంతి: చూడు బావ ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్య అంటున్నావు. ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్యే ఉండాలి లేదంటే నా ప్రాణం వదిలేయాల్సి వస్తుంది.


కౌషికి: పిన్ని కేదారు బాబాయే తన తండ్రి అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు తప్పా.. ఈ ఇంటి పరువు తీయాలనో ఇంకోటో కాదు.


కేదార్‌: ఇన్నాళ్లకు అందరి ముందు నేను నీ కొడుకు అని చెప్పారు అది చాలు నాన్నా..


ధాత్రి: ఇన్నేళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది కేదార్‌. అందరిలో ఉన్న ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది.


కౌషికి: అవును ఇంతకాలం రహస్యంగా ఉన్న నిజం బయటపడింది. ఇక మీదట ఎవరూ నటించాల్సిన అవసరం లేదు.


కేదార్: నాన్నా మీ ఆరోగ్యం గురించి మీరేమీ ఆలోచించకండి. మీరు నాకు ప్రాణం పోశారు. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది.


ధాత్రి: అవును మామయ్య గారు మీరు ఇంక నిశ్చింతగా ఉండండి. వదిన తీసుకెళ్లండి.


కౌషికి: పదండి బాబాయ్‌ రెస్ట్‌ తీసుకుందురు గాని రండి.


 అని అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కేదార్‌, ధాత్రి మాత్రం ఎమోషనల్‌ గా ఫీలవుతుంటారు. ఇదే నా ఐడెంటిటీ అంటూ ఆనందంతో ఏడుస్తుంటాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను అంటాడు. ఈ క్షణం నిజం మాట్లాడిన వాళ్లు దీనికి ఒప్పుకోకపోవచ్చు అంటూ ధాత్రి బాంబు పేలుస్తుంది. మామయ్యగారి మనసు మార్చడానికి అందరూ ట్రై చేస్తారు. అందుకే నిజం బయటి ప్రపంచానికి తెలియాలి అని ధాత్రి చెప్పగానే కౌషికి వచ్చి అలా జరగడానికి వీల్లేదు అంటుంది. ఇప్పటి వరకు నువ్వు నా సొంత తమ్ముడివే అయినా అలా చూడలేకపోయాను సారీ తమ్ముడు అంటుంది కౌషికి. మరోవైపు సుధాకర్‌ కొట్టిందే గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు యువరాజ్‌.


నిషిక: ఏంటి యువరాజ్‌ భోజనం చేయకుండా వచ్చేశావు. కనీసం ఈ చపాతీ అయినా తిను. జరిగిందేదో జరిగిపోయింది. అలా అని అన్నం తినకుండా ఉంటావా?


యువరాజ్‌: అసలు ఇదంతా నీ వల్లే జరిగింది.


నిషిక: నావల్లనా.. ఏంమంటున్నావు యువరాజ్‌.


యువరాజ్‌: అవును నువ్వు నాకు అడ్డు పడకుండా ఉండి ఉంటే కిడ్నీ ఇచ్చే అవకాశం ఆ కేదార్‌ కు వచ్చేదే కాదు. నీ ఇంట్లో నా వాళ్ల ముందే వాడు హీరో అయ్యాడు.


నిషిక: అబ్బా అలా అని ఎందుకు అనుకుంటున్నావు యువరాజ్‌. మామయ్య ఏమైనా కేదార్‌ను తన కన్న కొడుకు అనలేదు కదా? అవన్నీ జరగవులే కానీ ముందు ఇది తిను.


అనగానే చపాతిని పక్కకు తోస్తాడు యువరాజ్‌. నిషికను తిడతాడు. నీకు ముద్ద ఎలా దిగుతుంది అని ప్రశ్నిస్తాడు. ఇంతోల వైజయంతి వస్తుంది. యువరాజ్‌ను కొట్టి.. ఆయన కేదారే నా కొడుకు అని చెప్పేదాకా తీసుకొచ్చారంటే హాస్పిటల్‌ లో మీరేం చేశారో నాకు తెలియదు అనుకోవద్దు. మీరేం చేసినా ఆ కేదార్‌ కంటే ముందే చేయాల్సింది అంటుంది. నిషికను కూడా తిడుతూ నువ్వు ఆ ధాత్రిని చూసి నేర్చుకో అంటుంది. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!