Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతిని పెళ్లి చూపులకు సీత రెడీ చేస్తుంటుంది. విద్యాదేవి దూరం నుంచి చూసి నా కూతురు పెళ్లీడుకు వచ్చింది నా చేతుల మీద నేను చూసిన సంబంధం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది. సీత విద్యాదేవి కన్నీళ్లు చూసి ఏమైందని అడుగుతుంది. దానికి విద్యాదేవి ప్రీతికి మంచి సంబంధమో కాదో అని భయంగా ఉంది.
సీత: నాకు ఆ టెన్షన్ ఉండేది టీచర్ కానీ ప్రీతి అబ్బాయితో మాట్లాడి మంచి వాడు అని చెప్పడంతో కుదుట పడ్డాను.
విద్యాదేవి: ఒక్క ఫోన్ కాల్‌తో ఎలా చెప్పగలం సీత కలిసి ఉంటేనే చాలా మంది మోసం చేస్తుంటారు. అలాంటిది ఏం తెలీకుండా మంచి వాడు అని చెప్పలేం కదా.
ప్రీతి: ఈ సంబంధం మంచిది అని మా పిన్ని పదే పదే చెప్తుంది టీచర్.
విద్యాదేవి: మనసులో నన్ను మోసం చేసింది మీ పిన్నే అందుకే నా భయం.
సీత: ఇవి పెళ్లి చూపులే కదా టీచర్ అబ్బాయి నచ్చి అన్నీ తెలుసుకున్నాకే పెళ్లి కదా టీచర్.
విద్యాదేవి: అదే చెప్తున్నా పెళ్లి కొడుకు మంచి వాడు అయితేనే ఈ పెళ్లి జరగాలి.
సీత: టీచర్ చెప్పేది నీ గురించే ప్రీతి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి.
ప్రీతి: మీరు ఇద్దరూ నా గురించే ఆలోచిస్తున్నారు. మా అమ్మ ఉన్నా ఇంతలా ఆలోచించదేమో.
రాకేశ్ వాళ్లు పెళ్లి చూపులకు వస్తుంటారు. ఇంతలలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నటి లక్ష్మీ ఆపిల్స్ కొంటుంటే అక్కడికి రాకేశ్ వస్తాడు. లక్ష్మీ చేతిలో చేయి వేసి పట్టుకోవడంతో లక్ష్మీ రాకేశ్‌ని కొడుతుంది. దాంతో రాకేశ్ తల్లిదండ్రులు కూడా వచ్చి తన కొడుకుని ఎందుకు కొట్టావని అడుగుతారు. దానికి లక్ష్మీ ఈ ఆంబోతుని కన్న తల్లి మీరేనా అని తిడుగుతుంది. రాకేశ్ మారిపోయాడని తన తల్లి చెప్తే ఈ మృగం మారిపోయాడని మీరు అంటున్నారా నిన్నే నాకు ఇబ్బంది పెట్టాడని అంటుంది లక్ష్మీ. ఇక పెళ్లి చూపులకు వెళ్లున్నామ్ అంటే ఈ పశువుకి పెళ్లి ఎందుకు అని అంటుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని పెళ్లి జరగకుండా చేస్తానని లక్ష్మీ అంటుంది. దాంతో రాకేశ్ తండ్రి నువ్వు ఆ పని చేస్తే నేను నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తా అంటాడు. ఇక లక్ష్మీ వాళ్లని అడ్డుకుంటే రాకేశ్ తల్లి లక్ష్మీని తోసేసి వెళ్లిపోతుంది. ఇక లక్ష్మీ కారు వెనక ఫాలో అవ్వాలి అనుకుంటుంది.'
మరోవైపు మహాలక్ష్మీ నిశ్చితార్థానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. మహాలక్ష్మీ తెగ కంగారు పడుతుంది. ప్రీతి తప్పు అందరూ కిందకి వచ్చేస్తారు. సీత వచ్చి పెళ్లి చూపులు కదా ఇంత హడావుడి ఎందుకు అంటుంది. దానికి మహాలక్ష్మీ పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం అని అంటుంది. అన్నీ మాట్లాడేశాను మీరు కామ్‌గా ఉండండని మహాలక్ష్మీ ఇంట్లో వాళ్లకి చెప్తుంది. రాకేశ్ వాళ్ల కారుని లక్ష్మీ ఫాలో అవుతుంది. ఓ చోట కారుని మిస్ అయిపోతుంది. దాంతో లక్ష్మీ ఎలా అయినా పెళ్లి ఆపాలి అనుకుంటుంది. ఇంతలో రాకేశ్ వాళ్లు మహాలక్ష్మీ ఇంటికి వచ్చేస్తారు. మహాలక్ష్మీ, జనార్థన్, గిరిధర్ వాళ్లు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. అందరికీ మహాలక్ష్మీ రాకేశ్‌ని పరిచయం చేస్తుంది. విద్యాదేవి సీత దగ్గరకు వచ్చి అబ్బాయి పద్ధతిగా ఉన్నాడని అంటుంది. సీత మాత్రం తేడాగా ఉందని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అంటుంది.
ఇక విద్యాదేవి మనసులో అబ్బాయి బాగున్నాడు ప్రీతిని మంచిగా చూసుకుంటే బాగున్నని అనుకుంటుంది. విద్యాదేవి ప్రీతిని తీసుకొస్తా అంటే మహాలక్ష్మీ ఆపి సీత, అర్చన తీసుకొస్తారని అంటుంది. దానికి రామ్ టీచర్ తెస్తే ఏం అవుతుందని అడుగుతాడు. ఇక పెళ్లి వాళ్లు విద్యాదేవి గురించి అడిగితే మహాలక్ష్మీ మా కోడలికి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చి మా ఇంట్లోనే ఉందని అంటుంది. ఇక రామ్ తన ప్రాణాలు కాపాడారని చెప్తాడు. ఇక అన్ని పనులు చేసే ఆయా అని రాకేశ్ తల్లి అంటుంది. ఇక పెళ్లి తర్వాత మేం తీసుకెళ్లిపోతాం అంటుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు వద్దని జనార్థన్ అంటాడు. దానికి రామ్ మీరు తీసుకెళ్లడానికి ఆవిడ పని మనిషి కాదు మా మనిషి అంటాడు. ఇక సీత, అర్చనలు ప్రీతిని తీసుకొస్తారు. రాకేశ్ ప్రీతి అందానికి ఫిదా అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ సూసైడ్.. పెళ్లికి ఓకే చెప్పిన ప్రీతి.. సీతకు మొదలైన అనుమానం!