Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, సహస్రల నిశ్చితార్థం డేట్‌ని పెట్టించడానికి యమున పంతుల్ని పిలుస్తుంది. కాదాంబరి ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతుంది. దానికి భక్తవత్సలం ఏం అనొద్దని తానే కదా పెళ్లికి తొందరపడుతుందని అంటాడు. దానికి సహస్ర పరిస్థితులు బట్టి అందరూ అలా అంటున్నారు కానీ కరెక్ట్‌గా రింగులు మార్చుకునే టైంకి ఎందుకు అత్తయ్యకి అలా అయిందని అంటుంది. 


యమున: సహస్ర నీకు ఒట్టు పెట్టి చెప్పాను కదా ఇక ఎలాంటి పరిస్థితుల్లో నిశ్చితార్థం జరుగుతుంది ఆరు నూరు అయినా జరిపిస్తాను.
వసుధ: అదీ యమున వదిన అంటే.
పద్మాక్షి: వసుధ ఇక్కడ ఎవరూ ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. 


ఇంతలో పంతులు వస్తారు. ఇంతలో విహారి వస్తాడు.ఏమైంది అని అడిగితే నిశ్చితార్థం ముహూర్తం పెడుతున్నారని చెప్తుంది. నిశ్చితార్థం ఇష్టం లేదా అని సహస్ర బావని అడుగుతుంది. నిశ్చితార్థం విహారికి ఇష్టం లేదు అనుకుంటున్నావా అని చారుకేశవ అడుగుతాడు. ఎందుకు అలా మాట్లాడుతావ్ మామయ్య అని అడుగుతాడు విహారి. ఇక విహారి కూడా ఈ నిశ్చితార్థం ఆగడు అని చెప్తాడు. ఇంతలో పంతులు రేపే ముహూర్తం అని చెప్తాడు. 


పండు: ఏంటో లక్ష్మీమ్మ హఠాత్తుగా నిశ్చితార్థం ఆగిపోయింది నీ మీద దేవుడికి దయ కలిగింది నిన్ను విహారి బాబుకి ఏదో విధంగా దేవుడు కలుపుతాడు అనుకున్నా కానీ ఇంతలోనే మళ్లీ నిశ్చితార్థం అంటుంటే బాధగా ఉందమ్మా.
లక్ష్మీ: విహారి గారి జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలని అని కానీ ఆయనతో కలకాలం ఉండాలి అని కానీ నేను కోరుకోవడం లేదు. ఈ పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు కలవాలి అని కోరుకుంటున్నారు. ఆయన కోరుకున్నట్లే నిశ్చితార్థం జరగాలి తర్వాత ఏ ఆటంకం లేకుండా పెళ్లి కూడా జరిగిపోవాలి. 
యమున: సహస్ర ముహూర్తం కుదిరిపోయింది సంతోషమేనా
సహస్ర: ముహూర్తం కదిరితే కాదు అత్తయ్య నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలి.
యమున: మాటిచ్చా కదమ్మా ఆగదు.


ఇక కాదాంబరి ఈ రోజు ఇంట్లో గాజుల పండగ అని చెప్తుంది. ఊరి నుంచి ఒకతను గాజులు తీసుకొస్తారని పెద్దాయన గాజులు కొనిస్తారని కాదాంబరి అంటుంది. ఇక సత్యం అనే వ్యక్తి గాజులు తీసుకొని వస్తాడు. ఇంట్లో ఆడవాళ్లు అంతా వస్తారు. అందరూ తమకు నచ్చిన మట్టి గాజులు తీసుకుంటారు. సందడి సందడి చేస్తారు. సహస్రతో తన అమ్మమ్మ నీకు నచ్చిన గాజులు కొనుక్కొని మీ బావతో తొడిగించుకో అని అంటుంది. ఇక సహస్ర నీలం రంగు గాజులు తీసి తల్లికి  ఇస్తుంది. వాటిని కాదాంబరి తీసుకొని ఎమోషనల్ అయి కూతురికి ఇస్తుంది. నా పుట్టింటి గాజులు పట్టుకోవడానికి నాకు ఇరవై సంవత్సరాలు పట్టిందని పద్మాక్షి  ఏడుస్తుంది.


పద్మాక్షి ఏడుస్తూ అందర్ని ఏడిపిస్తుంది. ఇక పద్మాక్షి తల్లితోనే గాజులు తొడిగించుకుంటుంది. తల్లీకూతుళ్లు ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడుస్తారు. కాదాంబరి కూతురిని పట్టుకొని నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. వసుధ తన భర్తతో గాజులు వేయించుకుంటుంది. దూరం నుంచి చూసి సంతోషించిన లక్ష్మీ ఫీలై పండుకి చెప్పి వెళ్లిపోతుంది. అంబిక  గాజులు పట్టుకొని సుభాష్ ఉండి ఉంటే బాగున్ను అనుకుంటుంది. ఇక సహస్ర విహారికి గాజులు వేయమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ సూసైడ్.. పెళ్లికి ఓకే చెప్పిన ప్రీతి.. సీతకు మొదలైన అనుమానం!