Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవినే సుమతి అని మహాలక్ష్మీకి తెలిసిపోతుంది. విద్యాదేవి సుమతి అని తనకు తప్ప ఇంకెవరికీ తెలీదని రూపం మారిన సుమతితో నేను ఓ ఆట ఆడుకుంటానని మహాలక్ష్మీ అనుకుంటుంది. తేరుకోలేని షాక్ ఇస్తానని ఇంటికి బయల్దేరుతుంది. మరోవైపు విద్యాదేవి ఇంటికి వచ్చి తానే సుమతి అని చెప్పాలని నిర్ణయించుకొని ఇంటికి వెళ్తుంది. కుడి కాలు లోపల పెట్టి ఇంటి లోపలికి వెళ్లి అందరినీ హాల్ లోకి పిలుస్తుంది.


విద్యాదేవి: సుమతి గురించి మీకు చెప్పబోతున్నాను. 
జనార్థన్: నా సుమతి గురించి మీరు ఏం చెప్తారు విద్యాదేవి గారు.
విద్యాదేవి: మీ అందరికీ తెలియని ఓ నిజం ఒకటి ఉంది. మీరు ఎంత గానో ఎదురు చూస్తున్న సుమతి మీ ఎదురుగానే ఉంది. రామ్, ప్రీతి మీ తల్లి సుమతిని నేనే. నేనే మీ అమ్మ సుమతిని. (అందరూ షాక్ అయిపోతారు.) నా రూపం మారిపోయింది ఏంటా అని చూస్తున్నారా.. నా అసలు రూపంతోనే ఓ సారి ఈ ఇంటికి వచ్చాను. మీ అందరూ సంతోషంగా ఉండటం చూసి సీతకి స్వీట్స్ ఇచ్చి వెళ్లిపోయాను. తర్వాత ఓ రోజు రామ్‌కి యాక్సిడెంట్ అయితే నేనే కాపాడాను అప్పుడే నా ముఖం కాలిపోయింది. రూపం మారిపోయింది. నేను ఎవరో చెప్పకుండా ఇన్నాళ్లు విద్యాదేవిగా మీ మధ్య తిరగాను కానీ ప్రీతి పెళ్లి నా చేతుల మీద జరగాలి అని బయట పడ్డాను. ( రామ్, ప్రీతిలు మా అమ్మ మీరేనా అని ఎమోషనల్ అవుతారు. )
జనార్థన్‌: మీరే మా సుమతినా నిజమేనా..
విద్యాదేవి: అవునండీ మీ మీద ఒట్టు వేసి చెప్తున్నా.
మహాలక్ష్మీ: అబద్ధం అంతా పచ్చి అబద్ధం.. కట్టు కథ.. 
సీత: మా టీచర్ గారికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి.
మహాలక్ష్మీ: డబ్బు కోసం ఆస్తి కోసం సుమతి పేరు మీద ఉన్న ఈ మొత్తం ఆస్తి మీద తను కన్ను వేసింది. 
విద్యాదేవి: మహాలక్ష్మీ ఈ ఆస్తి నాది నా కష్టార్జీతం. 
మహాలక్ష్మీ: ఇలా చెప్పి ఎందరి జీవితాలు నాశనం చేశావు. ఈ విద్యాదేవి ఓ మోసగత్తె. ఆస్తి కోసం తానే సుమతి అని నాటకం ఆడుతుంది. ప్రీతి పెళ్లి అడ్డుపెట్టుకొని నాటకం ఆడుతుంది.
విద్యాదేవి: నేను ఇంటి నుంచి వెళ్లిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఆశ్రమంలో ఉన్నాను కావాలంటే ఎంక్వైరీ చేయండి. నేనే సుమతిని ఎలా చెప్తే అర్థమవుతుంది. 
రామ్: ఈవిడ మా అమ్మ కాకపోతే మా అమ్మ ఏమైనట్లు పిన్ని.
మహాలక్ష్మీ: చనిపోయింది రామ్. ఈ హంతకురాలే చంపేసింది. నువ్వే సుమతిని చంపేశావ్. రామ్‌ని సుమతి కాపాడి ప్రమాదంలో పడింది అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమతిని చంపేసి ఆ స్థానంలోకి నువ్వు వచ్చావ్. 
జనార్థన్: ఈవిడ సుమతిని చంపేసిందా.
మహాలక్ష్మీ: నీకు ఇంకో ఆధారం కూడా చూపిస్తా జనా అర్చన ఈవిడ రూమ్‌కి వెళ్లి బ్యాగ్ తీసుకురా. అని విద్యాదేవి వేసుకున్న స్కెచ్ చూపిస్తుంది. ఈ మోసగత్తె రామ్, ప్రీతి జనార్థన్ల స్కెచ్ వేసుకొని తిరుగుతుంది. 
రామ్: ఈవిడ మా అమ్మని చంపారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. 
ప్రీతి: ఈవిడ చాలా సార్లు మా అమ్మలా నటించింది పిన్ని.
మహాలక్ష్మీ: అంతా నటన ఈవిడ మీ నాన్నని కూడా మోసం చేసింది సీత. 


విద్యాదేవి తానే సుమతిని అని మీ అమ్మని అని రామ్, ప్రీతిలను పట్టుకొని మరీ చెప్తుంది. జనార్థన్ దగ్గరకు కూడా వెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతిని అండీ అని చెప్పి ఎమోషల్ అవుతుంది. అందరూ అనుమానంలో ఉంటే గిరిధర్, అర్చనలు విద్యాదేవి మీద కోప్పడతారు. ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావ్ అని విద్యాదేవి మహాలక్ష్మీతో అంటుంది. ఇక కాసేపట్లో పోలీసులు వస్తున్నారని మహాలక్ష్మీ చెప్తుంది. ఇంతలో ఎప్‌ఐ త్రిలోక్ ఎంట్రీ ఇస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి బదులు నయనికి యాక్సిడెంట్.. విశాల్ కళ్లెదుటే ఘోరం.. బతకడం కష్టమే!