Brahmamudi Serial Today Episode: పూజ పూర్తి అయిన తర్వాత వర్కర్స్ కు చెక్స్ ఇవ్వడానికి ప్రకాష్ అంతా రెడీ చేస్తాడు. సీతారామయ్య, కావ్యను ఇక చెక్కులు పంపిణీ చేయమని చెప్తాడు. దీంతో తాను చేయనని మీరు మామయ్యలు, ఆయన ఉండగా నేను ఎలా పంపిణీ చేయగలను అంటుంది కావ్య. రుద్రాణి కూడా కావ్యను బోనస్ లు ఇప్పించడం ఏంటని ప్రశ్నిస్తుంది. అవును మామయ్యగారు కంపెనీ చైర్మన్ గా మీరున్నారు. బావగారు ఉన్నారు. మా ఆయన ఉన్నారు. మీరందరూ కాకుండా కావ్యతో ఇప్పించడం ఏంటని అడుగుతుంది.
అపర్ణ: రుద్రాణి నిన్ను బాగా ప్రబావితం చేస్తుంది ధాన్యలక్ష్మీ. నేను కోడలిగా అడుగుపెట్టినప్పుడు, నువ్వు కోడలిగా అడుగుపెట్టినప్పుడు దీపావళికి బోనస్ లు నీతోనే ఇప్పించారు కదా..? అప్పుడు నాకు అర్హత లేదని నేను అనలేదు. నీకు అర్హత లేదని నువ్వు అనలేదు. నా కొడలు దాకా వచ్చే సరికి ఆపడానికి నువ్వెవరు..? ఆ ధాన్యలక్ష్మీ ఎవరు..?
ఇందిర: రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇది ఇంటి సమస్య. బోనస్ లు ఇవ్వడం సీఈవో బాధ్యత. దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. చైర్మన్ గా నా భర్త చెప్పినట్టు చేయాల్సిందే.
రాహుల్: రాజ్ హర్ట్ అవుతాడేమో ఒకసారి ఆలోచించండి అమ్మమ్మా..?
రాజ్: లేదు. కంపెనీ వర్కర్స్ కు బోనస్ ఇవ్వడం అనేది మన బాధ్యత. ఎవరి చేత ఇప్పించాము అనడం కన్నా స్టాఫ్ అందరూ దీపావళి సంతోషంగా జరుపుకోవడం ముఖ్యం.
సీతారామయ్య: మంచి మాట చెప్పావు రాజ్ ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు. అమ్మ కావ్య ఇక నీ సంశయాలు తీరినట్టేగా వెళ్లి బోనస్ లు ఇవ్వు అమ్మ
అని చెప్పగానే సరేనని కావ్య వెళ్లి బోనస్ లు ఇస్తుంది. వర్కర్స్ ఒక్కొక్కరుగా వచ్చి బోనస్ లు తీసుకుని సీతారామయ్య, రాజ్ లకు పండుగ విషెస్ చెప్పి వెళ్లిపోతుంటారు. చివరిలో చెక్ మీద రాజ్ మేనేజర్ అని ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఆ కవర్ ఎవరిదో వాళ్లకు ఇవ్వు కావ్య అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య రాజ్ దగ్గరకు వెళ్తుంది. ఎవరిది ఆ కవర్ అని అడుగుతాడు. దీని మీద రాజ్ మేనేజర్ అని ఉంది అంటుంది కావ్య. రాజ్ కోపంతో అందరిని చూస్తాడు. తర్వాత బోనస్ తీసుకున్న రాజ్. సీఈవో గారికి చైర్మన్ గారి మనవడిగా నేను బోనస్ ఇస్తాను అని తనకు ఇచ్చిన బోనస్ తిరిగి కావ్యకు ఇచ్చి వెళ్లిపోతాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత రుద్రాణి ఇరిటేటింగ్ గా అనామికకు ఫోన్ చేసి ఇంకా బాంబు పేలలేదేంటి? అని అడుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి అని చెప్తుంది అనామిక. అపర్ణ, ఇందిరాదేవి కలిసి రాజ్‌ను ఇరిటేషన్‌కు గురి చేస్తుంటారు.
అపర్ణ: కావ్యతో పెట్టుకుని ఇప్పుడు మేనేజర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది.
ఇందిర: అందుకే కదా అపర్ణ మన పెద్దవాళ్లు అనేది ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని.
రాజ్: కడుపు నిండా తిన్నారు కదా… అది అరిగే వరకు నా గురించే మాట్లాడుకోవాలా..? వెళ్లండి ఇక్కడి నుంచి.. ఎక్కడికి వెళ్లింది కనిపించడం లేదు.
కావ్య: ఏవండి నేనేమైనా హీరోనా..? మీ నడుము పట్టుకుని ఇలా ఉండటానికి. లేవండి.
రాజ్: అయినా వెళ్లిపోయావు కదా? మళ్లీ ఎందుకు వచ్చావు.
కావ్య: నన్ను పిలిచింది అమ్మమ్మ తాతయ్య వాళ్లకు చెప్పే వెళ్లిపోతా..?
రాజ్: అయితే చెప్పే వెళ్లు
అని రాజ్ చెప్పగానే సరేనని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య వచ్చి ఇందిరాదేవికి తాను వెళ్లిపోతున్నానని చెప్తుంది. రాజ్ త్వరగా వెళ్లమ్మ అంటాడు దీంతో అందరూ కలిసి రాజ్ మీద సెటైర్లు వేస్తారు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇందిరాదేవి ముగ్గురు కోడళ్లకు మేము దీపావళి కానుక ఇవ్వాలనుకున్నాం కదా? అది ఇవ్వకుండా ఎలా పంపిస్తాము అంటుంది. ఇంతలో అపర్ణ వెళ్లి గిఫ్టులు తీసుకొచ్చి ఇస్తుంది. అవి హారాలు ఎవరి భార్య మెడలో వాళ్లు వేయాలి అని చెప్తుంది ఇందిరాదేవి. నేను వేయనని రాజ్ వెళ్లిపోతుంటే కావ్య, రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!