Jagadhatri  Serial Today Episode:     కౌషికి వాళ్లు బంగారు విగ్రహం ఇచ్చి వెళ్లాక దాన్ని ఓపెన్‌ చేయాలని ట్రై చేస్తారు. ఇద్దరూ ఎంత ప్రయత్నించినా ఓపెన్‌ కాదు. మరోవైపు ఇంట్లోకి వెళ్లిన యువరాజ్‌ మాత్రం అనుమానంగా ఆ విగ్రహంలో పెద్దనాన్న ఏదైనా దాచారేమో అంటాడు. ఇప్పుడు అవన్నీ మనకెందుకు చెప్పండి ఆ విషయాలు పోలీసులు చూసుకుంటారు. మనం మాధురి పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటూ విగ్రహం జగధాత్రి వాళ్లకు ఇచ్చామని పోలీసులకు చెప్పాలిని జేడీకి ఫోన్‌ చేస్తుంది.


ధాత్రి: కౌషికి వదిన ఫోన్‌ చేస్తున్నారు.


కేదార్‌: అయితే మాట్లాడు. ఫోన్‌ లిఫ్ట్ చేయకపోతే డౌట్‌ వస్తుంది.


ధాత్రి: ఫోన్‌ చేస్తుంది నా నెంబర్‌ కు కాదు. జేడీ నెంబర్‌కు


కేదార్‌: అయితే మాట్లాడు ధాత్రి, విషయం ఏంటో తెలుస్తుంది.


ధాత్రి: చెప్పండి కౌషికి గారు. విగ్రహం ధాత్రి వాళ్ళకు హ్యాండోవర్‌ చేశారా..?


కౌషికి: చేశాను జేడీ ఆ విషయం చెప్పడానికే మీకు కాల్ చేశాను.


ధాత్రి: మీ నిజాయితీ మాకు తెలుసు కౌషికి గారు కానీ మీ చుట్టు ఉన్నవాళ్లను చూస్తుంటేనే మాకు అనుమానం వస్తుంది.


కౌషికి: ఒకసారి జగధాత్రి తోనూ మాట్లాడిస్తాను.


అని కౌషికి వెళ్తుంది. ధాత్రి ఏమీ వద్దులే అని చెప్పేలోపే కౌషికి అవుట్‌ హౌస్‌ కు వస్తుంది. దీంతో కేదార్‌ ధాత్రి ఫోన్‌ తీసుకుని నేను మేనేజ్‌ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెనక్కి వెళ్తాడు. కౌషికి వచ్చి ధాత్రికి ఫోన్‌ ఇస్తున్నాను అని చెప్పడంతో కేదార్‌ సారీ మేడం జేడీ ఒక ఇంపార్టెంట్‌ కాల్‌ లో ఉన్నారని నన్ను మాట్లాడమన్నారని చెప్తాడు. సరేనని ధాత్రికి ఫోన్‌ ఇస్తుంది కౌషికి దీంతో ఇద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత కౌషికి ఫోన్‌ తీసుకుని వెళ్లబోతుంటే ధాత్రి జాగ్రత్తలు చెప్తుంది. టైంకి ట్యా్‌బ్లెట్స్‌ వేసుకోండని ఫుడ్‌ తీసుకోండని చెప్తుంది. మరోవైపు వైజయంతి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.


వైజయంతి: అసలు ఏం జరుగుతుందిరా అబ్బోడా..? మీ పెద్దనాయన బంగారు విగ్రహం దాయడం ఏంటి..? ఎంక్వైరీ పేరుతో పోలీసులు మన ఇంటికి రావడం ఏంటి..? నాకేం అర్థం కావడం లేదురా..?


నిషిక: అర్థం కాకపోవడానికేం లేదు అత్తయ్యా పెద్దమామయ్య ఆ విగ్రహాన్ని రహస్యంగా ఉంచాడు అంటే అందులో ఏదైనా రహస్యం దాచాడేమో.


యువరాజ్‌: ఆ రహస్యం ఏదైనా మనకు వచ్చే నష్టం ఏదీ లేదు. కానీ ఆ సూరి చెప్పినట్టు కేదార్‌ గాడికి వాళ్ల అమ్మకు సంబంధించింది అయితే మన కొంప కూలిపోవడం ఖాయం.



   అని ముగ్గరు మాట్లాడకుంటూ ఆ విగ్రహాన్ని మనం ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఈ రాత్రికే ఆ విగ్రహాన్ని కొట్టేయాలని రెడీ అవుతారు. మరోవైపు విగ్రహాన్ని ఓపెన్‌ చేయడానికి కేదార్‌ కుస్తీ పడుతుంటాడు. ఎంత ప్రయత్నించినా విగ్రహం ఓపెన్‌ కాదు. ధాత్రి కూడా ప్రయత్నించి అలిసిపోతుంది. తర్వాత విగ్రహం కొట్టేయడానికి యువరాజ్‌, కాచి, బూచి బయటకు వస్తారు. యువరాజ్‌ వెళ్లి కరెంట్‌ ఆఫ్‌ చేస్తాడు. సడెన్‌ గా కరెంట్ పోయిందేంటి అని ధాత్రి బయటకు వచ్చి చూస్తే ఇంట్లో కరెంట్‌ ఉంటుంది. అనుమానంగా ధాత్రి మళ్లీ లోపలికి వెళ్లి కేదార్‌ ను తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడే విగ్రహం కొట్టేయడానికి యువరాజ్‌, బూచి ప్లాన్‌ చేస్తారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!