Seethe Ramudi Katnam Serial Today Episode హాల్‌లో సుమతి ఫొటో స్థానంలో విద్యాదేవి ఫొటో చూశానని మహాలక్ష్మీ చెప్పడం అందరూ వచ్చి చూసే సరికి సుమతి ఫొటో ఉండటంతో అందరూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావ్ అని మహాలక్ష్మీని అంటారు. మహాలక్ష్మీ ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. మహాలక్ష్మీ అత్తయ్యని ఈ ఫొటో పిచ్చిదాన్ని చేసిందని సీత అని విషయం వదిలేయండి అని ఫొటో తీసుకెళ్లి మళ్లీ అక్కడే పెట్టేస్తుంది.


ఇక మహాలక్ష్మీ తాను చూసింది నిజమా కాదా అని ఆలోచిస్తుంది. ఇంతలో సీత వచ్చి ఫొటో ఎలా మారిపోయిందని కంగారు పడుతున్నారా అత్తయ్య అదంతా నిజమే ముందు మరీ చూసింది విద్యాదేవి టీచర్నే అని ఆ ఫొటో మీరు విసిరేయగానే సుమతి అత్తమ్మ ఫొటో మార్చేశానని అంతా నేనే చేశానని అంటుంది. గతంలో మీరు నన్ను పిచ్చిదాన్ని చేస్తే ఇప్పుడు నేను చేశానని అంటుంది. అత్తయ్య అంటే మీకు భయం వచ్చి ఏదో ఒక రోజు మీరు నిజం చెప్పే వరకు వదలని అత్తకి వార్నింగ్ ఇస్తుంది. సీత మామూలుది కాదని సీతతో జాగ్రత్తగా ఉండాలని మహాలక్ష్మీ అనుకుంటుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!


ఇక అందరూ హాల్‌లో ఉంటే మహాలక్ష్మీ చూసి సీత చేసిన పనికి నా ఇమేజ్ డ్యామేజ్ అయిందని అందర్ని మళ్లీ నా వైపు తిప్పుకోవాలని కిందకి వెళ్తుంది. మహాలక్ష్మీని చూసి అందరూ ఒంటరిగా పైన ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు.  ఒంటరిగా ఆలోచిస్తూ బాధ పడుతున్నానని నాకు జీవితం సుమతి ఇచ్చిందని అంతా సుమతి వల్లే అని పొడుగుతూ ఇన్ డైరెక్ట్‌గా రేపు తన పెళ్లి రోజు అని గుర్తు చేస్తుంది. ప్రతీ ఏడాదిలా ఈ ఏడాది కూడా గ్రాండ్‌గా జరుపుదామని రామ్ అంటే మహాలక్ష్మీ వద్దని అంటుంది. అందరూ సెలబ్రేట్ చేద్దామని అంటే వద్దని అంటుంది. దాంతో రామ్‌తో పాటు అందరూ మహాలక్ష్మీని ఒప్పిస్తారు. జనార్థన్ కూడా సెలబ్రేషన్స్ చేసుకుందామని అంటాడు. ఇక సీత మనసులో పెళ్లి రోజు చేసుకుంటావా చూద్దాం అని అనుకుంటుంది. 



సీత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సుమతిని కలుస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందని విద్యాదేవి అంటే సీత మహాలక్ష్మీ పదే పదే మీరు హంతకురాలని చెప్తుందని చెప్తుంది. ఈ రోజు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక కానిస్టేబుల్‌ని విద్యాదేవి చూపించి నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్తుంది. నా ఇంట్లో తప్ప ప్రతీ చోట నాకు గౌరవం దక్కుతుందని విద్యాదేవి అంటుంది. ఇక సీత మహాలక్ష్మీ పెళ్లి రోజు గురించి చెప్తుంది. మనద్దరం కలిసి మహాలక్ష్మీకి పిచ్చెక్కించాలని విద్యాదేవి చేయాల్సిన పని సీత తనకు చెప్తుంది. మహాలక్ష్మీ సీతని కలుస్తుంది. సుమతి రూపం మారి జైల్లో పడిందని మీ అత్త జైలులో చిప్పకూడు తింటే నేను పెళ్లి రోజు కేక్ తింటానని అంటుంది. దానికి సీత ఈరోజు మీరు బంగారు పళ్లెంలో తినొచ్చు రేపు చిప్పకూడు తినొచ్చని అంటుంది. దానికి మహాలక్ష్మీ రేపు నా పెళ్లి రోజు పనులు చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. దానికి సీత రేపు నేను మా అత్తమ్మ ఇచ్చే జలక్‌కి నువ్వు అల్లాడిపోతావ్ దానికి రెడీగా ఉండు అంటుంది. 


ఉదయం మహాలక్ష్మీ, జనార్థన్‌లు చక్కగా రెడీ అవుతారు. అందరూ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తారు. మహాలక్ష్మీని అర్చన చాటుగా తీసుకెళ్లి సీత ఇంట్లో లేదు ఏదో ప్లాన్ చేస్తుందని చెప్తుంది. జాగ్రత్తగా ఉండమని అర్చన మహాలక్ష్మీకి చెప్తుంది. సీత ఏం చేయడానికి అయినా ఛాన్స్ ఇవ్వనని మహాలక్ష్మీ అంటుంది. ఇక సీత బయట ఉంటుంది. ఇంతలో విద్యాదేవి ఆటోలో అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!