Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన లోపలికి వచ్చి మహాలక్ష్మీ వాళ్లతో రామ్ సీతకి ఏం అడిగితే అది ఇస్తాను అని మాట ఇచ్చాడని చెప్తుంది. రామ్ వచ్చి నేను సీతకి చేసిన అన్యాయానికి ఏం అడిగినా ఇస్తానని అంటాడు. చలపతి వెటకారం చేయడంతో ఈ రోజు సీత నన్ను చంపబోయింది మీకు అర్థమవుతుందా అని మహాలక్ష్మీ అడుగుతుంది. దానికి రామ్ సారీ పిన్ని మీరు నన్ను మిథునకు పెళ్లి చేయడంతో కోపంతో మీకు ఇలా చేసింది అంటాడు. దానికి మహాలక్ష్మీ నువ్వు చేసిన తప్పునకు సీత నన్ను చంపడం ఏంటి అని అడుగుతుంది. రామ్ తల దించుకుంటాడు.
సీత వెళ్లిపోయింది మళ్లీ వచ్చి ఏం చేయదు అని రామ్ అంటాడు. సీతకు ఎందుకు మాట ఇచ్చావ్ రామ్ తను రేపు వచ్చి కోరని కోరిక కోరితే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. తను రేపు మిథునను అడిగితే ఏం చేస్తావ్ అంటుంది. మిథునతో కాపురం చేస్తావా బ్రో అని గౌతమ్ అడుగుతాడు. దానికి రేఖ మిథునకు విడాకులు ఇస్తాడని అంటుంది. అందరూ షాక్ అవుతారు. మిథున ఒప్పుకోదని అర్చన అంటుంది. సీత ఊరుకోదని చలపతి అంటాడు. ఇద్దరితో మనకు ప్రమాదమే అని జనార్థన్ అంటాడు. దానికి రామ్ నాకేం తెలీదు డాడ్ సీత ఏం అడిగినా ఇస్తానని అంటాడు. ఏం చేస్తామని అందరూ తల పట్టుకుంటారు. సీత ఏం అడుగుతుందో తెలీడం లేదని మిథునని తీసుకెళ్లిన ముఖర్జీ నుంచి ఏం కబురు లేదని మహాలక్ష్మీ అంటుంది.
సీత ముఖర్జీ ఇంటికి వెళ్లి మహాలక్ష్మీని వణికించినది చెప్తుంది. ముగ్గురు నవ్వుకుంటారు. ఇంకా చాలా చేస్తానని మహాలక్ష్మీ చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్నీ కాదని సుమతి అత్తమ్మని దారుణంగా ఇబ్బంది పెట్టిందని మహాలక్ష్మీ గతంలో చేసిన విషయాలు అన్నీ చెప్తుంది. మిథునని రామ్ మామకి ఇచ్చి పెళ్లి చేసింది నన్ను సైడ్ చేయడానికే అని అంటుంది. అంతా బాగుంది కానీ మీ అత్తాకోడళ్ల మధ్య రామ్ నలిగిపోతున్నాడని అంటారు. మహాలక్ష్మీని రామ్ గుడ్డిగా నమ్ముతున్నాడని ఆ నమ్మకం నుంచి బయటకు తీసుకురావాలి అని అందుకే ఇదంతా చేస్తున్నానని అంటుంది. ముఖర్జీ తర్వాత ప్లాన్ ఏంటి అని అడిగితే మహాలక్ష్మీకి ఫోన్ చేసి ఏం చెప్పాలో అది చెప్పి సీత వెళ్లిపోతుంది.
మహాలక్ష్మీ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటారు. గౌతమ్‌తో పెళ్లి కాకుండా డ్యూటీ ఎక్కేశావ్ కదా అమ్మ అని చలపతి రేఖని అంటే ఒక్క పెళ్లి తప్ప అన్నీ అయిపోయావి కదా అంటుంది రేఖ. దానికి మహాలక్ష్మీ పెద్దలి ముందు ఏం మాట్లాడాలో తెలీదా అంటే మీరు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా అందుకే అలా అన్నాను అంటుంది. మొత్తానికి భలే కోడళ్లు వచ్చారు చెల్లాయ్ సీత కంచు మిథున ఏమో రెంచు ఏమైదా బెండ్ చేస్తుంది. ఇక ఈ రేఖ ఏమో పంచ్ బాగా మాటలు చెప్తుంది అని చలపతి అంటాడు. దానికి గిరి ఆ లిస్ట్‌లో సీతని తీసేయ్ అని అంటాడు.
మహాలక్ష్మీకి ముఖర్జీ కాల్ చేస్తారు. మహాలక్ష్మీ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. పెళ్లి సింపుల్‌గా జరిగింది రిసెప్షన్ గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాం అంటుంది. దాంతో సుశీల అన్నీంటికంటే ముందు వ్రతం చేద్దామని రేపు ఉదయం వస్తామని అంటారు. వ్రతం అయిన తర్వాత మా అమ్మాయిని మీ కోడల్ని చేసి మేం వెళ్లిపోతాం అని అంటారు. ఇప్పుడు ఈ వ్రతాలు ఎందుకు పిన్ని అని రామ్ అంటాడు. మిథునతో పీటల మీద కూర్చొడానికి ఇబ్బందిగా ఉందని రామ్ అంటే మిథునని పెళ్లి చేసుకున్నప్పుడు తప్పు చేసినప్పుడు లేని ఇబ్బంది పీటల మీద కూర్చొంటే ఇబ్బందా రామ్ అని చలపతి అడుగుతాడు. సీతని రాకుండా ఆపాల్సిన బాధ్యత నీదే రామ్ అని మహాలక్ష్మీ చెప్తుంది. నా వల్ల కాదు అని రామ్ అంటే మాట ఇచ్చావ్ కదా నువ్వే ఏదో ఒకలా నచ్చచెప్పు అని అంటారు. రామ్ సరే అంటాడు. రేపు మిథునకు ఇంటి వారసత్వంగా వస్తున్న నగలు అన్నీ మిథునకే ఇస్తాను అని మహాలక్ష్మీ అంటుంది. రేఖ దానికి అన్నీ తనకే ఇచ్చేస్తారా అని అంటే చలపతి రేఖతో నువ్వు ఇంకా ఇంటి కోడలు కాలేదు కదా అంటాడు. గౌతమ్ రేఖని కామ్గా ఉండమని అంటాడు.
రామ్ సీతని కలుస్తాడు. సీతని ఎగాదిగా చూస్తాడు. ఈ శారీలో చాలా బాగున్నావ్ అని అంటాడు. ఏంటి మామ ఆ మిథున కంటే అందంగా ఉన్నానా అంటుంది. మన మధ్య తను ఎందుకు అంటాడు. మన ఇద్దరి మధ్యలోకి తనే వచ్చింది కదా అని సీత అంటుంది. పొగత్తలు కాకాపట్టడాలు ఆపి విషయం చెప్పు అని అంటాడు. నాకు మిథునకు సింపుల్‌గా పెళ్లి జరిగిపోయింది కదా అని రామ్ అంటాడు. దానికి సీత అయితే గ్రాండ్‌గా చేసుకొని ఉరంతా చెప్తారా అని అంటుంది. అది కాదు సీత వ్రతం అంట అని రామ్ అంటే సీత దానికి ఏంటీ వ్రతమా మనం చేసుకున్నామా మరి మీరు చేసుకుంటారేంటి అని అంటుంది. నువ్వు ఆ వ్రతానికి రావొద్దు అని చెప్పడానికి వచ్చాను సీత అంటాడు. సీత బుంగమూతి పెట్టుకొని ఎవరు ఏమన్నా నేను వ్రతానికి వస్తాను గొడవ చేస్తాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!