Nuvvunte Naa Jathaga Serial Today Episode భాను బేబీ బామ్మతో దేవా, మిథున పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది. మిథునని తరిమేసి నాకు దేవాకి పెళ్లి చేస్తా అని మాట ఇచ్చావ్ కదా మాకు పెళ్లి చేయ్ అని అంటుంది. బేబీ మిథునని పిలిచి సీరియస్‌గా చూస్తూ పాన్ ఇవ్వమని అంటుంది. పాన్ నోట్లో పెట్టుకొని నములుతూ మిథునని బయల్దేరమని నెట్టేస్తుంది. దేవాని లవ్ చేసిన నువ్వు వీళ్ల పెళ్లిని తట్టుకోలేక ఇలా అంటున్నావ్ వాళ్ల మధ్య అన్యోన్యత చూసి వాళ్లది లవ్ మ్యారేజ్ అని నాకు అర్థమైందని అంటుంది.
భానుని ఇంకెప్పుడు ఇంటికి రావొద్దని నువ్వు మంచి దానివే అయినా నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇక్కడికి రాకు దేవా వైపు చూడకు మంచి కుర్రాడిని చూసుకొని పెళ్లి చేసుకొ అని పంపేస్తుంది. భాను ఏడుస్తూ వెళ్లిపోతుంది. భాను ఏడుస్తుంది అంత కఠినంగా చెప్పకుండా ఉండాల్సింది అని శారద బేబీతో అంటే కఠినంగా చెప్తేనే తను దేవాని మర్చిపోయి తన జీవితం తాను చూసుకుంటుందని అంటుంది. సూర్యకాంతం, శ్రీరంగం డిసప్పాయింట్ అయిపోతారు.
లలిత మిథునతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని సంతోషపడుతుంది. భర్తకి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. మిథున గురించి మాట్లాడుతుంది. మిథున అత్తారింట్లో సంతోషంగా ఉందని మిథున ఇక్కడికి తీసుకురావడానికి తనని బాధ పెట్టొద్దని వాళ్లని అంగీకరించి సంతోషంగా ఉందామని అంటుంది. బుద్ధి లేకుండా మాట్లాడకు ఆ రౌడీని అల్లుడిగా అంగీకరించాలా అని లలిత మీద అరుస్తారు. నా కూతురి జీవితంతో పాటు నా పరువు తీసుకోమంటావా అని అరుస్తాడు. ఆ రౌడీ గురించి నువ్వు మాట్లాడటం ఇదే చివరి సారి అవ్వాలని నా కూతురు నా ఇంటికి వస్తుంది చూస్తూ ఉండు అని సీరియస్‌గా చెప్పి వెళ్లిపోతారు.
రాత్రి కాంతం అందరి కోసం గోరింటాకు నూరుతుంది. ముసలి వచ్చి గరుడ పురాణంలో ఉన్న శిక్షలు అన్నీ కొత్తగా నా చేతి చేయిస్తుందని తిట్టుకుంటుంది. ఇంతలో కాంతం గోరింట పూసింది అని పాట పెడతాడు. కాంతం కోపంతో భర్త ముఖం మీద గోరింటతో కొడుతుంది. నూరి నూరి చచ్చేలా ఉన్నానని అంటుంది. ఇంతలో బేబీ గోరింట ఆకు నూరడం అయిందా అని అడుగుతుంది. అయింది అని తీసుకెళ్లి ఇస్తుంది. ఇక బేబీ ముద్దుల మనవరాలిని, దేవాని పిలుస్తుంది. ఇద్దరినీ చెరో పక్కన కూర్చొపెట్టుకుంటుంది. కాంతం కోపంతో రగిలిపోతుంది. మిథునతో బంగారు తల్లి మీ అమ్మానాన్న గురించి నాకు ఎవరూ చెప్పలేదు ఏంటి నీ పుట్టింటి గురించి చెప్పు బంగారు తల్లి అంటుంది. చెప్పొద్దు అని దేవా తలూపుతాడు. మా నాన్న జడ్జి అని చెప్తుంది.
మిథున తన తండ్రి జడ్జి అనగానే బేబీ నోరెళ్లబెడతుంది. షాక్ అయి టెన్షన్ పడుతుంది. ఏమైందని అని మిథున అడిగితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీ నాన్నకి కోపం ఉంటుంది. వీడేమో దిక్కుమాలిన రౌడీయిజం మానడం లేదు. మీ నాన్న వీడి మీద ఏమైనా కేసు పెడితే ఏంటమ్మా పరిస్థితి అని అంటుంది. అలాంటి పరిస్థితి వస్తే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా బేబీ అంటుంది. దేవా అంతే కదా చెప్పు అని మిథున అంటుంది. దానికి బేబీ అలా పేరు పెట్టి పిలిస్తే తప్పమ్మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. నేను మీ తాతయ్యని బావ బావ అని పిలిచేదాన్ని అని అంటుంది. నువ్వు కూడా ముద్దు పేరు పెట్టుకొని పిలు అని అంటుంది. మా శ్రీవారిని ఏమని పిలవాలి అని మిథున అంటుంది. నాకు పెళ్లి అయిన తర్వాత మా ఆయన్ని డార్లింగ్ అని పిలవాలని తెలిసీ తెలియని వయసులో అనుకున్నా అంటుంది. ఒకసారి పిలు అని బేబీ అంటుంది. మిథున దేవాని డార్లింగ్ అని పిలుస్తుంది. అలా పిలిస్తే గుద్దుగా అని దేవా వార్నింగ్ ఇస్తాడు. ఓవర్ చేయకు అని అంటాడు. బామ్మ తెగ సిగ్గు పడిపోతుంది. ఇక మిథునకు గోరింటాకు పెట్టమని దేవాకి చెప్తుంది. నేను పెట్టను అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!