Seethe Ramudi Katnam Today Episode సీత పందెం గురించి శివకృష్ణ, లలితలు చాలా బాధపడతారు. తాళి కట్టిన భర్తతో ఎలా విడిపోతావు అని అత్తారింటి నుంచి ఎలా వచ్చేస్తావని అడుగుతారు. దానికి ఇదంతా జరగాలి అంటే తాను ఓడిపోవాలి అని కానీ తానే గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎలా గెలుస్తావు నిన్ను గెలిపించడానికి ఎవరు ఉన్నారని లలిత ఏడుస్తుంది.
సీత: ఉన్నారమ్మా.. నా బాధని అర్థం చేసుకొని నాకు మంచి చేయడానికి నన్ను గెలిపించడానికి ఒకరు వచ్చారు నాతో రండి చూపిస్తాను.
రేవతి: సీత వాళ్ల అమ్మానాన్నలను పిలిపించినా ప్రయోజనం లేకుండా పోయింది చలపతి గారు.
చలపతి: మన చేతిలో ఏమీ లేదు అండీ ఇక అంతా ఆ విద్యాదేవి టీచరే చేయాలి.
సీత తన తల్లిదండ్రులను విద్యాదేవి(సుమతి) దగ్గరకు తీసుకెళ్తుంది. సుమతి అన్నయ్య అనుకొని ఎమోషనల్ అయి కళ్లలో నీళ్లు తిప్పుకుంటుంది. అన్నయ్య అని పిలవాలి అని ఉన్నా పిలవలేకపోతున్నాను అని బాధపడుతుంది. ఇక సీత తల్లిదండ్రులు ఇద్దరూ సీతని గెలిపించమని విద్యాదేవిని కోరుతారు.
విద్యాదేవి: మీరేం కంగారు పడకండి సీతని పోటీలో గెలిపించి తన కాపురం సరిదిద్దుతాను. అంతే కాదు మీ ఇంకో కూతురిని కూడా మీ ఇంటికి పంపుతాను.
శివకృష్ణ: సీతకు డ్యాన్స్ రాదు. ఉష, ప్రీతిలకు బాగా వచ్చు.
లలిత: మా సీత గెలుస్తుందా..
శివకృష్ణ: నువ్వు ఎవరో కానీ మాకు ధైర్యం వస్తుంది.
విద్యాదేవి: ఎవరో ఎందుకు చెల్లి అనుకోండి. మిమల్ని చూస్తే నాకు మా అన్నయ్య వదినా గుర్తొస్తున్నారు.
శివకృష్ణ: నా చెల్లెలు ఎక్కడున్నా నా మనసుకి దగ్గరగానే ఉంటుంది.
విద్యాదేవి: త్వరలోనే కలుస్తాను.. అదే త్వరలోనే కలుస్తారు.
శివకృష్ణ: చాలా థ్యాంక్స్ అమ్మా నీ నోటి మాట నిజమై నా చెల్లి నా దగ్గరకు వస్తే చాలు. అంతకు ముందు సీత గెలిస్తే చాలు.
విద్యాదేవి: గెలుస్తుంది. సీతని నేను గెలిపిస్తాను. అంతేకాదు మీ ఇద్దరు కూతుళ్లని మీ దగ్గరకు చేర్చుతాను.
శివకృష్ణ, లలితలు ఇంటికి వెళ్లిపోతుంటే ఎదురుగా రామ్ వస్తాడు. రామ్‌కి పందెం గురించి ఇద్దరూ చెప్తారు. రామ్ నమ్మడు. నిన్నూ సీతని విడదీయడానికి మీ పిన్ని ఇలాంటి పందెం చేసిందని మధు కోసం సీత చేయకూడని సాహసం చేస్తుందని అంటారు. సీతని వదులుకోవద్దని చెప్తారు. రామ్ కోపంగా సీత దగ్గరకు వెళ్తాడు.
రామ్: మీ అమ్మా నాన్న నాతో అంతా చెప్పారు. నువ్వు నా దగ్గర దాచింది నాకు చెప్పనిది.
సీత: ఏంటి మామా.
రామ్: ఇంకా నా దగ్గర దాయాలి అని చూస్తున్నావా. బుద్ధి ఉందా నీకు. నాతో చెప్పకుండా అంత పెద్ద పందెం కాస్తావా నువ్వు.
సీత: సమయం చూసి చెప్పాలి అనుకున్నా.
రామ్: ఎప్పుడు నువ్వు ఓడిపోయి ఇళ్లు వదిలి వెళ్లేటప్పుడా. నువ్వు గెలవలేవు. వాళ్లతో పోటీ పడి నువ్వు ఎలా గెలుస్తావు. నాతో ఒక్క మాట చెప్పకుండా మా పిన్నితో పందెం కాస్తావా. అంటే నన్ను వదులుకోవడానికి సిద్ధ పడ్డావా.
సీత: మామ పొరపాటున కూడా ఆ మాట అనకు.
రామ్: డ్యాన్స్ రాని నువ్వు అంత పెద్ద పందెం కాసావు అంటే అర్థం అదే కదా. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వగానే మీ అక్క వెళ్లిపోతుంది అని నీకు చాలా సార్లు చెప్పాను. అయినా సరే నువ్వు ఇలాంటి పందెం కాసావు అంటే నిన్ను ఏమనాలి.
సీత: మా అక్క ఇక్కడ ఉంటే సమస్య పెద్దది అవుతుంది.
రామ్: ఒకే నువ్వు గెలిస్తే మీ అక్క వెళ్లిపోతుంది. కానీ ఏదైనా జరిగి నువ్వు ఓడిపోతే నన్ను వదిలి వెళ్లిపోవాలి కదా అది ఆలోచించలేదా నువ్వు.
విద్యాదేవి: మీరు విడిపోరు బాబు మీకు సీత దూరమయ్యే పరిస్థితే రాదు.
రామ్: ప్లీజ్ ఇందులో మీరు కలుగజేసుకోకండి. ఇది మా భార్యాభర్తల విషయం.
విద్యాదేవి: సీతని నేను గెలిపిస్తాను బాబు.
రామ్: ఒకవేళ ఓడిపోతే. సీత నన్ను వదిలి వెళ్లిపోయినా సీతని వదిలి నేను ఉండలేను. మనల్ని ప్రేమించిన వారు మనం ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు. ఎప్పుడైనా మిమల్ని ప్రేమించిన వారు మీకు దూరమయ్యారా మీకు. ఆ బాధ అనుభవిస్తే తెలుస్తుంది. సీత పెద్ద తప్పే చేసింది. నాకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుని నేను సమర్ధించలేను. తన వైపు ఉండలేను సపోర్ట్ చేయలేను.
రామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీతని విద్యాదేవి ఓదార్చుతుంది. ఇక రామ్ సీత గెలవాలి అని ఎలా గెలిపించాలా అని ఆలోచిస్తాడు. మరోవైపు మహాలక్ష్మి ఉష, ప్రీతిలకు రేపు పోటీలో ఎలా అయినా గెలవాలి అని చెప్తుంది. పోటీ చాలా కష్టంగా ఉంటుందని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సీత విషయంలో జాగ్రత్తగా ఉండాలని అది ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో తెలీదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మధు చెప్తుంది. జనార్థన్ కూడా మధుకి సపోర్ట్ చేస్తాడు. ఇక డ్యాన్స్ పోటీల్లో పసుపు కంకుమ పెడతారు కదా సీత గెలిచే అవకాశాలు ఉంటే కంకుమ ప్లేస్‌లో కారం పెట్టి సీత కళ్లలో కొట్టమని మహా చెప్తుంది. జనార్థన్ మాత్రం కంట్లో కారం కొట్టడం తప్పు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.