Trinayani Today Episode వల్లభ కలిసిన గంటలమ్మ విశాల్ ఇంటికి వస్తుంది. వస్తూ వస్తూనే పెద్దపెద్దగా వాసన చూస్తూ గంట కొడతూ ఉంటుంది. గాయత్రీ దేవిని కాల్చింది ఇక్కడేనా అని అడుగుతుంది. అవును అని వల్లభ చెప్తాడు.


గంటలమ్మ: చితి వాసన ఇంకా పోలేదు. పోదు కూడా. ఎందుకంటే పూర్వ జన్మ వాసనలు ఇక్కడే ఉన్నాయి. 


వల్లభ: అమ్మో వివరాలు చెప్పకుండానే అన్నీ చెప్పేస్తుంది ఈ గంటలమ్మ. లోపలికి వెళ్తే పెద్దమ్మ జాడని కనిపెట్టేస్తుంది. ఇక వల్లభ ఇంటి లోపలికి వెళ్లి అమ్మ వచ్చిందని అంటాడు. అందరూ తిలోత్తమ వచ్చిందని అనుకుంటారు. గంటలమ్మ రావడంతో ఇంట్లో పెద్ద గాలులు వీస్తాయి. అందరూ వింతగా గంటలమ్మని చూస్తారు. షాక్ అవుతారు. హాసిని అత్తయ్య అనుకుంటూ వెటకారంగా ఆమె దగ్గరకు వెళ్లి గంట పట్టుకుంటుంది. దీంతో షాక్ కొడుతుంది. 


విక్రాంత్: నిజంగా ఈవిడ మన అమ్మేనా బ్రో.


గంటలమ్మ: ఒట్టి అమ్మకాదు గంటలమ్మ. 


దురంధర: ఎవరు అల్లుడు ఈవిడ.


వల్లభ: మాంత్రికురాలు గంటలమ్మ. ఆత్మల్ని, పునర్జన్మ ఎత్తిన వారిని పసిగట్టేయగలదు అంటే పట్టుకొచ్చాను. 


విక్రాంత్: బ్రో మన అమ్మ వస్తుంది అనుకుంటే ఈవిడని తీసుకొచ్చావు.


వల్లభ: మూడు రోజులుగా మన అమ్మ కనిపించకపోయే సరికి నేను ఎంత నరకం అనుభవించానో నాకు అర్థమైంది. ఏడాదిన్నర అయిన పెద్దమ్మ కనిపించకపోవడంతో పెద్ద మరదలు విశాల్ లోలోపల ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకొనే గంటలమ్మని తీసుకొని వచ్చాను. 


గంటలమ్మ: ఇక్కడే ఉందిరా మీ పెద్దమ్మ. అనగానే గోడ మీద గాయత్రీ దేవి ఫొటో కింద పడిపోతుంది. ఇక హాసిని మెల్లగా జరుకొని విశాల్‌కి విషయం చెప్పడానికి పరుగులు తీస్తుంది. విశాల్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. విశాల్ షాక్ అయిపోతాడు. 


గంటలమ్మ: గాయత్రీ దేవి ఫొటో తీసి పట్టుకొని.. నువ్వు చిత్రంలో లేవు విచిత్రంగా ఈ ఇంట్లోనే ఉన్నావు. 


సుమన: బావగారు ఈవిడని చూస్తుంటే భయం వేస్తుంది.


వల్లభ: కానీ పెద్దమ్మ జాడ చూపిస్తుంది. 


నయని: గాయత్రీ అమ్మగారు నా కడుపున పుట్టి కనిపించకుండా పోయారు. ఎక్కడుందో తెలీకుండా పోయింది.


గంటలమ్మ: గట్టిగా అరుస్తూ.. ఇక్కడే ఉంది అని చెప్పాను కదా.


విక్రాంత్: చంటి పిల్లలు గాయత్రీ, గానవి, ఉలూచి, పుండరీనాథం తప్ప ఈ ఇంట్లో ఇంకెవరూ లేరు. 


గంటలమ్మ: రప్పిస్తాను కదా. ప్రాణాలతో ఉంటే రప్పించడం ఒక పద్ధతి.. లేకపోతే ఆత్మను ఇక్కడికి రప్పించడం ఇంకో పద్ధతి. కానీ ఎక్కడ నుంచో వాసన రావడం లేదు. ఈ చుట్టు పక్కల నుంచే గాయత్రీ దేవి పునర్జన్మ వాసన వస్తుంది.  



మరోవైపు విశాల్ పాపను ఈ గదిలోనే లాక్ చేసి మేం వెళ్తామని చెప్పి ఆకలి వేసినా తలుపు కొట్టదని చెప్పి కిందకి వెళ్తారు. ఇక గంటలమ్మ హాల్‌లో ముగ్గు వేసి మంత్రాలు చదువుతుంది. విశాల్ వచ్చి ఇలా చేయొద్దని అంటాడు. అందరూ భయపడతారు. నయని కూడా ఇలా వద్దు అని అంటుంది. కానీ వల్లభ, సుమనలు వినిపించుకోరు. గంటలమ్మ మాత్రం గాయత్రీదేవి ఆత్మను చూపిస్తా అని అరుస్తుంది. విశాల్ తన తల్లి ప్రాణాలతో ఉందని అలా ఎలా ఆత్మ అంటావ్ అని అంటాడు. చిన్న పిల్లగా ఉన్న గాయత్రీ దేవిని ఎవరు తీసుకొని వస్తారు అని అడుగుతాడు పావనా మూర్తి. దీంతో గంటలమ్మ చిన్న పిల్లని మూర్ఛపోయేలా చేసి అందులోని ఆత్మని రప్పిస్తాను అని అంటాడు. విశాల్ వద్దు అన్నా గంటలమ్మ మంత్రాలు చదువుతుంది. ఇంతలో పెద్ద గాలి వీచి పసుపు కుంకుమలతో వేసిన ముగ్గు చెదిరి గాయత్రీ పాప పడుకుండి పోతుంది. దాని నుంచి గాయత్రీ దేవి ఆత్మ బయటకు వచ్చి పాపను చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణని ఇంటికి తీసుకొస్తున్న ముకుంద.. ఆడదాని చేతిలో మోసపోయానని తల్లి దగ్గర కుమిలిపోయిన ఆదర్శ్‌!