Brahmamudi Serial Today Episode : బాబు ఏడుస్తుంటే వాడిని ఆడించలేక మాయ, రుద్రాణి నానా తంటాలు పడతారు. అయినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. దీంతో స్వప్న వస్తుంది. నువ్వసలు తల్లివేనా అంటూ ప్రశ్నిస్తుంది. బాబు అలా ఏడుస్తుంటే ఏ తల్లైనా పాలు పడుతుంది. నువ్వేంటి పాలు పట్టడం లేదు అని అడుగుతుంది. దీంతో మాయ పాలు నాకెలా వస్తాయి అంటుంది. వెంటనే తేరుకుని నాకు పాలు రావడం లేదని బాబుకు డబ్బా పాలు పడుతున్నామని చెప్తుంది. దీంతో స్వప్న వెళ్లిపోతుంది. తర్వాత హాల్లో అందరూ ఉంటారు.
అనామిక: ఛా.. రోజు బెల్లు కొడితే స్టూడెంట్స్ అంతా ప్రేయర్ కు వచ్చినట్టు ఈ మధ్య తెల్లారితే చాలు అందరూ ఒక చోటికి వస్తున్నారు.
స్వప్న: నిన్నమొన్నటి దాకా నీ పనికిమాలిన పంచాయతీల కోసమే నీ అత్త నా అత్త కలిసి రాదాంతం చేసేవాళ్లు.. ఇప్పుడు వాళ్ల అత్త మా కావ్య మీద పడింది.
రుద్రాణి: వదినా అందర్ని ఒకచోటకు చేర్చారు. ఏం చెప్తావో.. ఎవరికి చెప్తావో ఏ నిర్ణయం తీసుకున్నావో అందరికీ చెప్పాలి కదా?
సుభాష్: మీ వదిన చెప్పాల్సింది చెప్పింది. కావ్య, రాజ్ చెప్పాల్సింది చెప్పారు. ఇంకా ఏముంది చెప్పడానికి?
రుద్రాణి: అందరూ చెప్పారు కానీ మాయ కూడా చెప్పాలి కదా? ఆమె ఏ నిర్ణయం తీసుకుందో చెప్పాలి కదా?
స్వప్న: ఆ విషయంలో మాయ కన్నా మా అత్తకే ఎక్కువ అరాటం ఉన్నట్లుంది. మాయను రాణిని చేస్తే మా అత్తను మంత్రిగా పెట్టుకుంటానని ఏమైనా ఆశ చూపించిందా?
అపర్ణ: ఇందులో ఏవరి ప్రోద్భలం లేదు. న్యాయం గురించి ఆలోచించి అందర్ని రమ్మన్నాను.
సుభాష్: చెప్పు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావో?
అని సుభాష్ చెప్పగానే రాజ్ నుంచి విడాకులు వద్దన్న కావ్య.. రాజ్, మాయను పెళ్లి చేసుకోవడానిక ఒప్పుకుంటున్నట్లు నో ఆబ్జక్షన్ పేపర్స్ పై సంతకం చేయాలని అడుగుతుంది అపర్ణ. దీంతో సుభాష్, అపర్ణ మీద కోప్పడతాడు. ఇంతలో స్వప్న వస్తుంది.
స్వప్న: ఒక్క నిమిషం నేను సంతకం చేస్తాను ఎక్కడ చేయాలి ఆంటీ?
రుద్రాణి: ఏటీ? నీకేం సంబంధం ఉందని సంతకం చేస్తావ్..
స్వప్న: మరి మా కావ్యకు ఏం సంబంధం ఉందని సంతకం పెట్టాలి. నువ్వు మధ్యలో మాట్లాడకు అత్తా నేను ఎదురు మాట్లాడితే నిన్ను కరివేపాకు నమిలినట్లు ఉంటుంది. ఇప్పుడు నా చెల్లికి అన్యాయం జరుగుతుంది. అందులో తన తప్పేం ఉందని అందర్ని ప్రశ్నిస్తున్నాను. రాజ్ తప్పు చేస్తే కావ్యకు ఎలా శిక్ష వేస్తారు?
అంటూ స్వప్న ప్రశ్నిస్తుంటే ఇంతలో కావ్య కలగజేసుకుని నేను సంతకం చేస్తానని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మాయ, రుద్రాణి, రాహుల్ మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. రాజ్, సుభాష్, స్వప్న వద్దని వారిస్తారు. అయినా కావ్య ఆగదు. వెళ్లి పేపర్స్ మీద సంతకం చేస్తుంది.
అపర్ణ: నువ్వు ఈ సంతకం చేయగానే నువ్వు నా దృష్టిలో ఆకాశం అంతా ఎదిగిపోయావని.. నిన్ను నా ఇంటి ఇలవేల్పులా చూస్తానని నువ్వు అనుకుంటున్నావేమో? ఇప్పుడు నువ్వు నా దృష్టిలో పాతాళంలో నిలబడ్డావు. నీకు ఎవరు పోతే ఏంటి నీకు కావాల్సింది ఆస్థి, దుగ్గిరాల ఇంటి కోడలన్న హోదా.
అంటూ అపర్ణ, కావ్యను తిడుతుంటే ఇంతలో అక్కడకు ఇందిరాదేవి వస్తుంది. బాగా చెప్పావు అంటూ అపర్ణను మెచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.