Seethe Ramudi Katnam Today Episode : సీత, రామ్‌లు సంతోషంగా ఉన్నారని మధు సంతోషంగా లేదు అని సీత తాళి తీసి ఇచ్చేయదు కదా అని విద్యాదేవి మహాలక్ష్మిని ప్రశ్నిస్తుంది. వేదమంత్రాల సాక్షిగా మెడలో కట్టిన తాళి అయినా దైవసాక్షిగా పడినా ముత్యాల హారం అయినా ఒకటే అని అంటుంది. తాళికి ఉన్న పవిత్రతే హారానికి ఉంటుందని హారం సీత దగ్గర ఉండటమే కరెక్ట్ అని పైగా అది సీత సెంటిమెంట్ అంటుంది కాబట్టి సీతకి దక్కాలని విద్యాదేవి అంటుంది. 


రామ్: మీరు చెప్పింది నిజమే హారం సీత దగ్గరే ఉండాలి. సారీ మధు గారు ఈ హారం మీద సీతకు అంత సెంటిమెంట్ ఉంటుంది అని నేను అనుకోలేదు. టీచర్ చెప్పినట్లు సీత మెడలో నేను కట్టిన తాళి అయినా మా ఇద్దరి మెడలో పడిన హారం అయినా ఒకటే. దయచేసి ఆ హారం తిరిగి ఇవ్వండి. 


అర్చన: ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడం తప్పు కదా రామ్.


విద్యాదేవి: మధు జీవితం బాగుండాలి అని రామ్ ఆ హారాన్ని మధుకి ఇచ్చాడు. సీత, రామ్‌లు మధు జీవితం బాగుపడాలని ప్రయత్నిస్తున్నారు. పైగా మధుకి ఆ హారం మీద ఎలాంటి సెంటిమెంట్ లేదు. అప్పుడు హారం మధు దగ్గర లేకున్నా ఏం కాదు కదా. నువ్వు ఇచ్చిన హారం తిరిగి తీసుకోవడంలో తప్పు  ఏం లేదు రామ్. ఆ హారం తీసుకొని సీత మెడలో వెయ్ రామ్.


రామ్ సీత మెడలో వేస్తుండగా విద్యాదేవి ఆపి తాను హారం తీసుకొని సీత, రామ్‌ల మెడలో విద్యాదేవి వేస్తుంది. ఇద్దరూ విద్యాదేవి కాళ్లకు మొక్కుతారు. ఇక మీ ఇద్దరికీ సంబంధించిన ఏదైనా మరొకరితో పంచుకోకూడదు అని రామ్‌కి చెప్తుంది. మీ మధ్యలోకి వేరే మనుషులు కాదు కదా వేరే ఆలోచనలు కూడా రానివ్వకండి అని చెప్తుంది. 


అర్చన: ఆవిడ సామాన్యురాలిగా అనిపించడం లేదు. నిప్పునకు గాలిలా ఆవిడ సీతకు తోడైంది.  


మహాలక్ష్మి: ఎన్నాళ్లు తోడుంటుంది. ఈ డ్యాన్స్ పోటీ వరకే కదా. పోటీలో సీతని ఓడించి గురు శిష్యులను ఇద్దరినీ బయటకు పంపేయాలి. ఆ తర్వాత రామ్, మధులను ఒకటి చేయాలి. 


సుమతి(విద్యాదేవి) మధు దగ్గరకు వస్తుంది. సీత తన గురించి అంతా చెప్పిందని మాట్లాడుతుంది. మధుని అక్కడ ఉండొద్దని చెప్తుంది. పుట్టింటిలోనో లేదంటే అత్తింట్లోనో ఉండమని అవేవీ చేయకుండా ఇక్కడ ఉండటం ఏంటని అంటుంది. దాంతో మధు ఆపమని విద్యాదేవి మీద అరుస్తుంది. తన పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అసలు మీరు ఎవరు అని ప్రశ్నిస్తుంది. ఇంతలో సీత అక్కడికి వస్తుంది. సీతతో ఈవిడతో రాయభారం ఎందుకు పంపించావని అంటుంది. విద్యాదేవి, సీత ఇద్దరి మీద మధు సీరియస్ అవుతుంది. విద్యాదేవి మనసులో తన ఇద్దరు మేనకోడళ్లలో ఎవరూ బాధ పడకూడదు అనుకుంటుంది. మరోవైపు శివకృష్ణ, లలిత మహాలక్ష్మి ఇంటికి వస్తారు. 


సీతకు భరతనాట్యం పోటీ గురించి అడుగుతారు. మీకు పోటీ గురించి ఎవరు చెప్పారు అని సీత ప్రశ్నిస్తే రేవతి వాళ్లు వచ్చి తామే చెప్పామని అంటారు. సీత షాక్ అవుతుంది. 


లలిత: ఇలాంటి పందెం ఎవరైనా కాస్తారా జీవితాలు తలకిందులైపోతాయి కదే. నువ్వు ఇబ్బందుల్లో పడితే మేం తట్టుకోగలమా. ఎందుకు ఇలా చేశావే.


సీత: అక్క కోసం అమ్మా. అక్క సమస్యకు నాకు ఇంతకన్నా మంచి ఆలోచన తట్టలేదు.


శివకృష్ణ: ఇది మంచి మార్గం అని ఎలా చెప్తావు సీత. మధు కోసం నువ్వు సమస్యల్లో పడతావా. పోటీలో నువ్వు ఓడిపోతే నీ బతుకు ఏం కావాలి.   
సీత: ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను. 


లలిత: ఏంటే నీ మొండితనం. నీకు నాట్యం రాదు కదే. నీకు రాని పని ఎలా ఒప్పుకున్నావ్. 


సీత: అన్నీ ఆలోచించాకే ఒప్పుకున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. 


శివకృష్ణ: తలకు మించిన భారం ఎత్తుకోవద్దు సీత. మా మాట విను.


సీత: నేను మాట ఇచ్చాను తప్పలేదు. నేను గెలుస్తానో ఓడిపోతానో తెలీదు. కానీ గెలుస్తాను. గెలిస్తే మంచి జరుగుతుంది. అంత వరకే ఆలోచించాను. 


శివకృష్ణ: నువ్వు పోటీ విరమించుకోవే. మధుని ఎలాగోలా మేం తీసుకెళ్లిపోతాం.


మహాలక్ష్మి: ఎలా తీసుకెళ్లిపోతారు. సీత పోటీలో గెలవాలి. అప్పుడు మధుని తీసుకెళ్లండి.


లలిత: ఏమమ్మా మహాలక్ష్మి నీకు ఇది బాగుందా పందెంలో సీతని ఓడించి మధుని ఉంచేస్తావా.


శివకృష్ణ: సీత తెలీక ఏదో చేస్తే మీరు ఎలా ఒప్పుకున్నారు.


మహాలక్ష్మి: సీతని బలవంతం చేశామా.. ఒప్పుకోమని బెదిరించామా. లేదే. సీత ఒప్పుకుంది సై అంటే సై అంది. తనకే అంత పొగరు ఉంటే నాకు ఎంత ఉండాలి.


లలిత: మీకు దండం పెడతా మహాలక్ష్మి గారు జీవితాలను నాశనం చేసే ఇలాంటి పోటీలు పందాలు వద్దు.


సీత: అమ్మా నువ్వు ఎవరికి దండం పెటొద్దు. పోటీ విరమించడానికి ఆమె ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. 


అర్చన: చూశారా సీత పొగరు.


సీత: గెలిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడటం తప్పు కాదు కదా. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. 


లలిత: మధు ఇదంతా నీ వల్లే. నువ్వు ఇక్కడ ఉండటం వల్లే. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా సీత జీవితం నాశనం చేయాలని చూస్తున్నావ్.


మధు: సీతకి అలాంటి పందెనికి ఒప్పుకోమని నేను చెప్పానా. అహంకారంతో కళ్లు నెత్తికెక్కి అది చేస్తే నన్ను అంటారేంటి. నా పరిస్థితికి మీరు కారణం కానీ, సీత పరిస్థితికి నేను కారణం కాదు. 


మహాలక్ష్మి: ఇంత దాకా వచ్చాక పందెం ఆపే ప్రసక్తే లేదు. పోటీ జరుగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బాలయ్య బర్త్ డేకి మరో గ్లింప్స్ - ఈసారి వేటకు డబుల్ పూనకాలు వచ్చేస్తాయ్!