Krishna Mukunda Murari Today Episode : కృష్ణ తనని ప్రేమగా చూసుకొని ఇద్దరూ అమ్మలు లాంటి అత్తల్ని మోసం చేస్తున్నాను అని లేని గర్భం ఉన్నట్లు నటించడం చాలా కష్టమని ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు అని ఏడుస్తుంది. ఇక ప్రభాకర్, శకుంతలలు కృష్ణ గురించి వెతుకుతూ ఉంటారు. భవాని కూడా అందర్ని వెతుకుతూ ఉంటుంది. 


 కృష్ణ: ఏసీపీ సార్ కూడా ఫోన్ చేయడం లేదు. పెద్దత్తయ్య ఏవేవో చెప్తుంది కానీ కచ్చితంగా కారణం చెప్పడం లేదు. ఏసీపీ సార్‌కి ఏమైంది. స్వామి ఇంక ఈ టెన్షన్ భరించడం నా వల్ల కావడం లేదు. ఎవరితో మాట్లాడాలి అన్నా భయం వేస్తుంది. ఏ క్షణం ఎవరి దగ్గర బయట పడతానో నిజం తెలిస్తే అత్తయ్యలు, చిన్నాన్న పిన్ని అందరూ ఏమవుతారా అని భయంగా ఉంది. అటు చూస్తే ముకుంద మీరాలా మారి ఇంకా మాతో ఆటలు ఆడుతూనే ఉంది. ఆవిడ నుంచి మాకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది. ఈ చిక్కుల నుంచి మేం ఎప్పుడు బయట పడేది. నాకు ఏ దిక్కు తోచడం లేదు. స్వామి ఇక నువ్వే దిక్కు. నువ్వే రక్ష.


శకుంతల, ప్రభాకర్ కృష్ణని చూసి పరుగన వస్తారు. ఇక భవాని కూడా అక్కడికి వస్తుంది. ఇక పల్లకి సేవ ఉంది అని కృష్ణను భవానికి పల్లకి మోయమని ప్రభాకర్ చెప్తాడు. 


భవాని: మనసులో.. ఏ కల్మషం లేని వాళ్లే పల్లకి మోయాలి కదా. మురారి అంత పని చేశాడు అని చెప్పని నేను కల్మషం లేని దాన్ని ఎలా అవుతాను. 


కృష్ణ: మనసులో.. లేని బిడ్డను మోస్తున్నట్లు అందరినీ నమ్మిస్తున్న నేను కల్మషం లేనిదాన్ని ఎలా అవుతాను. దేవుడి పల్లకి మోసే అర్హత నాకు ఉందా అసలు.


ప్రభాకర్: ఏంటి ఆలోచిస్తున్నారు పల్లకి సేవకి టైం అవుతుంది రండి.


రేవతి మీరా కోసం పాలు తీసుకొని గదికి వస్తుంది. అక్కడ మీరా కనిపించదు. రేవతి రజినిని మీరాని చూశావా అని అడుగుతుంది. ఇప్పుడు అది ఎందుకు ప్రశాంతంగా ఉందాం కాసేపు అయినా అని రజిని అంటే మీరాకి పాలు ఇద్దామని చూస్తున్నా అని రేవతి అంటుంది. పాలు ఎందుకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీ కొడుకే తండ్రి అని నమ్ముతున్నావా... అప్పుడే సపర్యలు మొదలు పెట్టేశావా అని రజిని అడుగుతుంది. 


రేవతి: వదినా పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. మీరా చెప్పేది నిజం కావొచ్చు అబద్ధం కావొచ్చు. కానీ తను తల్లి కాబోతున్న నిజం కాదా. తల్లి బుద్ధి బాలేకపోతే ఆ బిడ్డ ఏం చేస్తుంది. బిడ్డ కోసం అయినా టైంకి పాలు, భోజనం ఇవ్వాలి కదా. ఇంతకీ నువ్వు మీరాని చూశావా లేదా. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు ఎక్కడికి వెళ్లింది ఈ పిల్ల. అని అందర్ని అడుగుతుంది. 


ఆదర్శ్‌: పోతే దరిద్రం పోయింది అని వదిలేయక దాని కోసం వెతుకుతారు ఎందుకు. 


రేవతి: ఆదర్శ్‌ ఈ ఆవేశమే వద్దు అనేది. నవ్వు చేపిన పనికి భయపడి ఏ అఘాయిత్యం చేసుకుంటే ఏంటి పరిస్థితి. అందరూ మీరా ఎక్కడ ఉందో వెతకండి. 


ఇక కృష్ణ, భవానిలు పల్లకి మోయడానికి వస్తారు. పంతులు భవానిని పొగుడుతారు. భవాని మాత్రం తన ఇంటి పరిస్థితులు తలచుకొని బాధపడుతూ తనకు పల్లకి మోసే అర్హత ఉందా అని అనుకుంటుంది.  ఇక భవాని, కృష్ణ ఇద్దరూ పల్లకి మోస్తారు. అయితే మధ్యలో పల్లకిలోని అమ్మవారి విగ్రహం పడిపోబోతే పంతులు పట్టుకుంటారు.ఇలా జరగడం అపచారం అని ఎవరో మనసులో ఏదో పెట్టుకొని పైకి మంచి వారిలా నటిస్తూ ఇక్కడ ఉన్నారని అందుకే ఇలా జరిగిందని అంటాడు. అందుకే అమ్మవారు పల్లకీ సేవ పూర్తి కానివ్వలేదని అంటుంది. 


శకుంతల: అమ్మవారి మీద విశ్వాసం లేని వారు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్న వారు అసలు గుడికి ఎందుకు వచ్చారు. 


ప్రభాకర్: లోకంలో పాపం ఎక్కువైపోంది. అందరూ నటిస్తున్నారు. 


కృష్ణ: మనసులో.. లేని గర్భం ఉన్నట్లు నటిస్తున్నా కదా నా వల్లే ఇలా జరిగింది. 


భవాని: మనసులో.. మురారి గురించి లోపల ఒకటి బయట ఒకటి చెప్తున్నా కదా నా వల్లే ఇలా అయింది. 


ప్రభాకర్: పూజారి గారు ఈ పల్లకీని నా బిడ్డ, చెల్లి మోసారు కదా వాళ్లకి ఏం కీడు జరగదు కదా.


పంతులు: భగవంతుడు ఎవరికీ ఎప్పుడూ కీడు చేయడు. మంచి వాళ్లకి మంచి చేస్తాడు. తప్పు చేసిన వాళ్లని సరైన దారిలో పెడతాడు. 


ఇంట్లో అందరూ మీరా గురించి టెన్షన్ పడతారు. మురారి కనిపించడం లేదు అని మీరా కూడా కనిపించడం లేదు అని ఇద్దరూ కలిసి అని రేవతి అంటుంది. దాంతో సంగీత బావని అనుమానిస్తున్నావా అత్తయ్య అని అంటుంది. ఇంతలో రజిని ఇంకో రెండు రోజులు ఆగితే అందరికీ అదే డౌట్ వస్తుందని అంటుంది. మురారి, మీరా కలిసి నాటకం ఆడుతున్నారేమో అని అంటుంది. మధు రజినిని సీరియస్ అవుతాడు. మురారి గురించి తప్పుగా మాట్లాడొద్దని అంటాడు. 


భవాని మురారి గురించి వెంటనే ఎంక్వైరీ చేయాలని బయల్దేరుతాను అని అంటుంది. కృష్ణ కూడా వచ్చేస్తా అని అంటే భవాని వద్దు అనేస్తుంది. మురారిని దగ్గరుండి చూసుకోవాలి అని వస్తాను అని కృష్ణ అంటుంది. దీంతో భవాని కృష్ణని ఉండమని రావొద్దని చెప్తుంది. భవాని బయల్దేరి వెళ్లిపోతుంది. తన అత్తయ్య తీరు అనుమానంగా ఉందని కృష్ణ అనుకుంటుంది. మరోవైపు ప్రభాకర్ కృష్ణ, భవానిల తీరు అనుమానంగా ఉందని ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్లు ఉందా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'టిల్లు 3’లో రాధిక ఉంటుందా? - నేహా శెట్టి సమాధానం ఇదే!