Seethe Ramudi Katnam Today Episode : రామ్ సీత ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారని మహాలక్ష్మి అడుగుతుంది. దీంతో సూర్యని కలవడానికి జైలుకి వెళ్లామని చెప్తారు. అందరూ షాక్ అవుతారు. మహాలక్ష్మి మాత్రం లోపల రగిలిపోయిన బయటకు మాత్రం మంచి పని చేశారని అంటుంది. ఇక తర్వాత తన పుట్టింటికి వెళ్లామని మధ్యలో గుడికి వెళ్లామని రామ్ చెప్తాడు.
రామ్: రేపు ఆ టెంపుల్ సీతారాముల కల్యాణం అంట.
సీత: అంతేకాదు అత్తయ్య ఆ కల్యాణం కొత్తగా పెళ్లి అయిన దంపతులు జరిపిస్తారు అంట. నేను మామ రేపు అక్కడ కల్యాణం జరిపించడానికి టికెట్ తీసుకొని వచ్చాం.
రేవతి: అంటే రేపు ఆ సీతారాముల కల్యాణం మీ చేతుల మీదుగా జరగబోతుందన్నమాట.
చలపతి: చాలా మంచి పని చేశారు సీత. ఆ కల్యాణం మీ చేతుల మీదుగా జరిగితే మీకు అంతా మంచే జరుగుతుంది.
జనార్థన్: ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా.
గిరిధర్: అంతా మీ ఇష్టమేనా అలాంటప్పుడు ఈ ఇంట్లో మేం ఎందుకు.
అర్చన: చెప్పకుండా వెళ్లడం చేయకూడని పనులు చేయడం. మహా పరువు ఏం కావాలి.
సీత: ఇది పరువు తక్కువ పనో.. చేయకూడని పనో కాదు కదా అత్తయ్య.
రామ్: ఇది మా సొంత నిర్ణయం కాదు మీ అందరూ ఒకే అంటేనే రేపు మేం కల్యాణం జరిపిస్తాం.
సీత: ఒప్పుకోండి అత్తయ్య మీరు మా పెళ్లి చూడలేదు కదా.
మహాలక్ష్మి: రేపు అందరం ఆ గుడికి వెళ్తున్నాం. కల్యాణం చూడబోతున్నాం.
రామ్: మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ పిన్ని.
మహాలక్ష్మి: నీ సంతోషమే నా సంతోషం. వెళ్లి ఏర్పాట్లు చేసుకోండి.
గిరిధర్: మనం వాళ్లని దంపతులుగా చూడం అలాంటిది వాళ్లతో పూజ ఏంటి వదినా.
మహాలక్ష్మి: రేపు అందరం ఆ గుడికి వెళ్లి తీరాలి. రేపు ఆ గుడిలో సీతారాముల కల్యాణం జరిపించేది రామ్, సీతలు కాదు. రామ్, మధుమితలు.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం కల్యాణం జరిపిస్తా. రామ్, మధుమితలు కల్యాణం చేయడం చూసిన వాళ్లు వాళ్లే దంపతులు అనుకుంటారు.
మరోవైపు సుమతి పరధ్యానంలో ఉంటుంది. ఇంతలో శివకృష్ణ వచ్చి అందర్ని పిలుస్తాడు. సుమతి చిన్నప్పటి జ్ఞాపకాలను చుట్టుపక్కల ఊర్లు తిప్పి తర్వాత కౌసల్యాపురం తీసుకెళ్తనని అంటాడు.
సుమతి: మా అన్నయ్య ఎప్పుడూ ఇంతే లీల. నేను అడగడమే ఆలస్యం వెంటనే నా ముందు తెచ్చిపెట్టేవాడు. కానీ జీవితంలో ఒకే ఒక్కసారి నేను అడగంది ఇచ్చాడు. అది తీసుకోలేకపోయాను. నాకు నచ్చినవాడితో వెళ్లిపోయాను.
శివకృష్ణ: జరిగింది మర్చిపో సుమతి. మనం మళ్లీ కలిశాం కదా.
సుమతి: తనతో తాను... నా కొడుకుకు పెళ్లి అయిందో లేదో అయ్యుంటే కౌసల్యా పురంలో కల్యాణం జరిపిస్తే మంచిది కదా..
గుడి దగ్గర కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతాయి. పంతులు కల్యాణానికి వచ్చిన వారి టికెట్లు ఒక చెంబులో వేయిస్తారు. ఎవరి పేరు వస్తే వాళ్లే కల్యాణం చేస్తారని అంటారు. మరోవైపు దగ్గర వేస్తే సుమతి వాళ్లు అక్కడికి వస్తారు. ఆ గుడిని చూసి తన పెళ్లి ఆ గుడిలోనే జరిగిందని గుర్తు చేసుకుంటుంది.
సుమతి: మనసులో.. గుడికి ప్రతీ సంవత్సరం ముత్యాల తలంబ్రాల కోసం నేను ప్రతీ సంవత్సరం డబ్బులు పంపేదాన్ని. యాక్సిడెంట్ తర్వాత ఆయన పంపిస్తున్నారో లేదో..
లలిత: ఏంటి వదినా నువ్వు ఇంతకుముందు ఈ గుడికి వచ్చావా.
సుమతి: మనసులో.. అప్పుడు వచ్చాను. మళ్లీ ఇప్పుడే వస్తున్నా..
మహావాళ్లు గుడికి వస్తారు. ఆ గుడిని చూసి జనార్థన్ కూడా తన పెళ్లిని గుర్తు చేసుకుంటాడు. మరోవైపు సీత తన చిట్టీలను వేస్తుంది. అది మహాలక్ష్మి వాళ్లు చూస్తారు. మహా మాత్రం రామ్, మధుమితలే కల్యాణంలో పాల్గొంటారు అని చివరి నిమిషం వరకు ఈ విషయం సీతకు తెలీకూడదని అంటుంది. ఆ మాటలు చలపతి, రేవతి విని సీతకు చెప్పడానికి వెళ్తారు.
మరోవైపు సుమతి ఆ గుడి చాలా బాగుంది అని తనకు చాలా ప్రశాంతత ఉందని అంటుంది. దీంతో లీల వదిన ఈ గుడిలో నీకు కావాల్సిన వారు ఎవరో ఉండే ఉంటారు అంటుంది. మరోవైపు రేవతి, చలపతిలు హడావుడిగా సీతని చాటుగా తీసుకెళ్తారు. మహా ప్లాన్ సీతకు చెప్తారు. అది విని సీత షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్ రాయ్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కండంటే