Seethe Ramudi Katnam Today Episode: మహాలక్ష్మి మధుని ఇంటికి తీసుకొస్తుంది. ఇంట్లో అందరితో పాటు రామ్‌ని కూడా పిలిచి మధు కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. అక్కడ ఉంటే మధు మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతుంది అని అందరూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని అంటుంది. సూర్యని బయటకు తీసుకురావడాని కొంచెం టైం పడుతుంది అని అప్పటి వరకు మధు మన ఇంట్లోనే ఉంటుందని.. ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతుంది.
అర్చన: మాకు అభ్యంతరం ఏముంటుంది మహా. మంచి పని చేశావ్.
ప్రీతి: మధుమిత వదినను మేం పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం పిన్ని.
మహాలక్ష్మి: నువ్వేంమంటావ్ రామ్.
రామ్: మధుమిత గారు ఇక్కడ ఉండటంలో నాకు ఏ ఇబ్బంది లేదు పిన్ని. కానీ సీత వాళ్ల నాన్నగారు ఏమంటారో.
జనార్థన్: ఆయన మధుమితకు ఏ సాయం చేయలేకపోయారు రామ్. కనీసం ఇంట్లో కూడా ఉండనివ్వలేదు. అందుకే మీ పిన్ని మధుమిత బాధ్యత తీసుకుంది.
రేవతి: మధుమిత మీద వదినకు అంత ప్రేమ ఏంటి అన్నయ్య.
మహాలక్ష్మి: మధుమితని ఒకప్పుడు రామ్ ఇష్టపడ్డాడు. మనం కూడా రామ్ ఇష్టాన్ని గౌరవించాం. కానీ విధి మరోలా ఉంది. మధు ఈ ఇంటి కోడలు కాలేదు. మధు నా ఇంటి కోడలు చేసుకుందామని అనుకున్నప్పటి నుంచి తనకు వచ్చే కష్టాలు నావి అని అనుకుంటున్నాను. మధు నా కోడలు కాలేకపోయినా తన మీద నాకు ఆ ఆభిమానం ఇంకా ఉంది. అందుకే మధుకి ఏ కష్టం రాకుండా చూసుకుంటా. మీరు కూడా మధుమితని అంతే అభిమానంతో చూడాలని కోరుకుంటున్నాను.
అర్చన: నువ్వు అంతగా చెప్పాలా మహా మేం మధున హ్యాపీగా చూసుకుంటాం.
మహాలక్ష్మి: నువ్వేం అనవేంటి రామ్.. నీ నిర్ణయం ఏంటో చెప్పు.
రామ్: మీ నిర్ణయమే నా నిర్ణయం పిన్ని. అవును సీత కూడా వాళ్ల ఊరు వచ్చింది కదా మీకు కలవలేదా పిన్ని.
మహాలక్ష్మి: సీత వచ్చింది మేం మధుమితకి మంచి చేస్తామా లేదా అన్న అనుమానంతో.. మధు మాతో రావడం సీతకి ఇష్టంలేదు. కానీ సీత అక్కడ చేయడానికి కూడా ఏంలేదు.
జనార్థన్: అంటే మధు వాళ్ల నాన్న కూడా ఏ సాయం చేయలేదు. సీతేం చేయగలదు.
రామ్: సీత మీతో రాలేదా పిన్ని.
జనార్థన్: లేదు వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లింది. ఈపాటికే వచ్చేయాలి.
మహాలక్ష్మి: రామ్ మధుకి రూం చూపించు.. ఇక నుంచి తన బాధ్యత మనందరిది.
రామ్: సరే పిన్ని.. రండి పిన్ని చెప్పింది కదా ఇక నుంచి మీ బాధ్యత మాది.
మరోవైపు సీత, తన తల్లిదండ్రులతో కలిసి తన అత్తారింటికి బయల్దేరుతుంది. ఇక శివకృష్ణ మధుని తిడతాడు. సీత, సీత తల్లి మధుది తప్పులేదు అంటారు. అందరూ కలిసి సీతని పిచ్చిదాన్ని చేసి అన్యాయం చేస్తున్నారని అంటాడు. దీంతో సీత ఎవరు చేసినా నా మామ నాకు అన్యాయం చేయడు అని అంటుంది. ఇక రామ్ మధుమితకి రూమ్ చూపిస్తాడు. అక్కడ మధు పడిపోతుంటే పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఆ సీన్ రేవతి, చలపతి చూస్తారు. షాక్ అవుతారు.
రామ్: కేర్‌ఫుల్ మధుమిత గారు కాస్త చూసుకొని నడవండి..
మధు: సారీ అండీ కాలు స్లిప్ అయింది.
రామ్: ఇట్స్ ఓకే.. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మీరు ఈ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. త్వరలోనే మా పిన్ని సూర్యని బయటకు తీసుకొస్తుంది. మా పిన్ని చాలా మంచిది అండి. తనకు నచ్చితే ఎంతైనా హెల్ప్ చేస్తుంది. ఆ విషయం సీతకు అర్థం కావడం లేదు. మా పిన్ని మీద రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి నాతో చెప్తుంది. కాస్త మీరు అయినా సీతకి చెప్పండి.
మధు: చెప్తాను అండీ. రామ్ గారు మిమల్ని ఒక విషయం అడగాలి అనిపిస్తుంది. మమల్ని చూస్తే మీకు కోపం రావడం లేదా.. నేను మిమల్ని కాదు అని సూర్యని పెళ్లి చేసుకున్నాను. మిమల్ని అవమానించాను. కానీ మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను గౌరవంగా చూసుకున్నారు.
రామ్: మీరు మమల్ని అవమానించలేదు అండీ మీ ప్రేమను మీరు దక్కించుకున్నారు. అది మీ గౌరవం. ఇక మన పెళ్లి అంటారా మన చేతుల్లో ఏం లేదు దేవుడు ఎలా రాస్తే అలా అవుతుంది. మీకు అవసరం అయినవి ఏవైనా కావాలి అంటే చెప్పండి నేను తీసుకొస్తా.. మీరు మా మనిషి అని పిన్ని చెప్పింది మా మనిషి లానే ఉండండి..
మహాలక్ష్మి: మొత్తానికి మధుమితని ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇక సీతని బయటకు గెంటేయాలి.
చలపతి: నువ్వు చేసింది ఏం బాలేదు చెల్లి.
మహాలక్ష్మి: ఏం చేశాను..
రేవతి: మధుమితని ఈ ఇంటికి తీసుకురావడం.
మహాలక్ష్మి: సడెన్‌గా మీరిద్దరూ తప్పొప్పలు మాట్లాడుతున్నారేంటి. మీరు నా ముందు మాట్లాడటం మంచిదికాదు.
రేవతి: నీ మనసులో మధు కోడలిగా రావాలి అని ఉంది. అది దారుణమైన కోరిక. మధుకి పెళ్లి అయింది. రామ్ సీతలకు పెళ్లి అయింది. ఆ రెండు జంటల్ని విడదీస్తావా..
చలపతి: అయినా భర్త స్టేషన్‌లో ఉంటే భార్యని ఇక్కడికి తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ చెల్లాయ్.. అది తప్పు కదా..
మహాలక్ష్మి: ఆపు అన్నయ్య.. ఏది తప్పొ ఒప్పొ నాకు తెలుసు. మీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను.
చలపతి: నువ్వేంటో రామ్‌కి తెలిసిన రోజున నీ కలలన్నీ కూలిపోతాయి. ఇప్పుడు మేం అనుభవిస్తున్న ఒంటరి తనం అప్పుడు నువ్వు అనుభవిస్తావ్.
మహాలక్ష్మి: ఆపండి ఇప్పటికే మీరు ఇద్దరూ చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు..నాకే ఎదురు తిరుగుతున్నారు. ఆ సీత వల్ల వీళ్ల నోర్లు పెరిగాయి. మధుమితని నా కోడల్ని చేసుకొని సీతని ఇంటి నుంచి గెంటేస్తా అని అనుకుంటుంది. ఇక శివకృష్ణ, సీత వాళ్లు మహాలక్ష్మి ఇంటికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: గుప్పెడంత మనసు మార్చి 7 ఎపిసోడ్: కొత్త జంట పోస్టర్స్ రచ్చ , దేవయానికి షాకిచ్చిన శైలేంద్ర