Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ వల్ల డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుందని మహాలక్ష్మీ తిట్టుకుంటుంది. రేవతి సీతని తన ఇంటికి తీసుకెళ్తుంది. అన్ని విషయాల్లో మేం నీకు అండగా ఉంటామని కిరణ్, రేవతిలు సీతతో చెప్తారు. సుమతి మేడంకి అన్యాయం జరిగినందుకు మహాలక్ష్మీకి శిక్ష పడాలని కిరణ్ అంటాడు. ఇక రేవతి సీతకి గది చూపిస్తుంది. తమకు ఎన్నో విషయాల్లో సాయం చేసిన నీకు ఎలాంటి సాయం చేయడానికి అయినా మేం రెడీ అని నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేస్తామని రేవతి సీతతో చెప్తుంది. 


సీత: మహాలక్ష్మీ అత్త ఆట నువ్వు మొదలు పెట్టావు నేను ముగిస్తాను. ఆల్రెడీ రంగంలోకి దిగాను. ఇప్పుడు నీకు ఊహించలేని ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు ఇస్తాను.
సీటీలో జరిగే మిస్ హైదరాబాద్ అందాల పోటీలకు మహాలక్ష్మీ ఛీప్ గెస్ట్‌గా మహాలక్ష్మీ వెళ్తుంది. మహాతో పాటు అర్చన కూడా వెళ్తుంది. మొత్తం మహాలక్ష్మీ కటౌట్‌లతో దారందా అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ పోటీకి మహాలక్ష్మీనే స్పాన్సర్‌ చేస్తుంది. సీత వెళ్లిపోగానే మనకు పూర్వ వైభవం వచ్చేసిందని మహాలక్ష్మీ అంటుంది. ఇక మహాలక్ష్మీ అర్చనతో నా కోడలి సెలక్షన్‌ ఇక్కడి నుంచి మొదలు పెడతానని అంటుంది. అందరూ మహాలక్ష్మీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్తారు. మోడల్స్ ఒక్కోక్కరిగా రాంప్ వాక్ చేస్తారు. తర్వాత అచ్చం సీతలా ఉండే మిధున ఎంట్రీ ఇవ్వడంతో మహాలక్ష్మీ, అర్చన బిత్తరపోతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. 


మహాలక్ష్మీ: సీత. 
అర్చన: మిధున.
మహాలక్ష్మీ: తను సీతే.
అర్చన: సరిగ్గా చూడు మహా అది సీత కాదు. సరిగ్గా చూడు
మహాలక్ష్మీ: ఇద్దరికీ ఒకే పోలికలు ఎలా వచ్చాయి. 
అర్చన: మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. కాంపిటీషన్ మొదటి రౌండ్‌లో 3 సెలక్ట్ అవుతారు. అందులో మిధున కూడా ఉంటుంది. ఒక్కో కంటెస్టెంట్ మాట్లాడుతారు. మిధున స్టేజ్ మీదకు రాగానే జడ్జిలు మిధునని ప్రశ్నిస్తారు. 


జడ్జి: మిధున ఆడతనాన్ని ఎలా డిస్కైబ్ చేస్తావ్.
మిధున: ఆడిది అంటే నేచర్. మౌంట్ ఎవరెస్ట్ అని చెప్తుంది. మిధున మాటలకు అర్చన మహాతో అది సీత గొంతు కాదని భాష అన్నీ వేరని చెప్తుంది. మహాలక్ష్మీ అక్కడున్న మేనేజర్‌కి పిలిచి ఏదో చెప్తుంది. దాంతో ఆయన వెళ్లి జడ్జిలకు చెప్తారు. ఇక యాంకర్ మహాలక్ష్మీని పిలిచి విన్నర్‌కి కిరీటం ఇవ్వాలని చెప్తారు. మహాలక్ష్మీతో పాటు అర్చన కూడా వెళ్తుంది. మహాలక్ష్మీ విన్నర్ మిస్ మిధున అని చెప్తుంది. మహాలక్ష్మీ మిధునకు మిస్ హైదరాబాద్ ట్యాగ్ వేసి కిరీటం పెడుతుంది. మిధునని చూసి ఫేస్ సేమ్ కానీ పర్సనాలిటీ వేరు అని అనుకుంటుంది.


మిధునని తనకు తాను పరిచయం చేసుకున్న మహాలక్ష్మీ మిధునని మాట్లాడమని అంటుంది. తాను మిధున అని న్యూయార్క్‌లో చదువుకున్నానని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మహాలక్ష్మీ, అర్చనలు అలా చూస్తూ ఉండిపోతారు. మిధునకి సీతకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని అర్చన మహాలక్ష్మీతో చెప్తుంది. మహాలక్ష్మీ మిధున గురించి తెలుసుకోవడానికి మిధునని ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అర్చనకు ఆ విషయం చెప్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి