Seethe Ramudi Katnam Today Episode: మధుమిత పూజ చేస్తుంటే మహాలక్ష్మి తన దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో నువ్వు పూజ చేయడం కొందరికి ఇష్టం లేదు మధు అని చెప్తుంది. దీంతో మధుమిత వాళ్ల మాటలు నేను వింటున్నాను అని అంటుంది. సీత స్థానంలో నువ్వు పూజ చేయడం చూసిన సీత ఎంత గొడవ చేస్తుందో చూడని ఇప్పుడు సీత బుద్ధి నీకు తెలిసి పోతుంది అని మహాలక్ష్మి అంటుంది.
అర్చన: ఏంటి సీత నీ స్థానంలో మీ అక్క పూజ చేస్తుంది అని కోపంగా ఉందా..
జనార్థన్: మధు పూజ చేయడం రేవతి, చలపతిలకు నచ్చలేదు నీకు కూడా నచ్చలేదా సీత.
సీత: నవ్వుతూ.. మీరందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు మన ఇంట్లో మా అక్క పూజ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందరూ షాక్ అవుతారు. మా అక్క చేసే ఈ పూజ గురించి మీకు ఇప్పుడే తెలిసిందేమో నాకు రాత్రే తెలిసింది.
మహాలక్ష్మి: ఏంటిది కవర్ చేస్తుందా లేక షాక్‌ను కంట్రోల్ చేసుకుంటుందా.
సీత: రాత్రి మహాలక్ష్మి అత్తయ్య నన్ను పిలిచి పొద్దున్న మీ అక్క మధుతో పూజ చేయిస్తాను అని చెప్పింది.
మధు: ఏంటి సీత నువ్వు చెప్పేది.
సీత: నిజం అక్క. అత్తయ్య నీ గురించి ఎంత గానో ఆలోచిస్తుంది. నీ కష్టాలు త్వరగా తీరిపోవాలి అని సూర్య బావ రిలీజ్ అయి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నీతో పూజ చేయిస్తాను అని మహాలక్ష్మి అత్తయ్య రాత్రే నాకు చెప్పారు.
అర్చన: మనసులో.. మాతో ఎందుకు మహా చెప్పలేదు.
గిరిధర్: ఈ ట్విస్ట్ ఏంటి.
మధు: మీరు ఎంత మంచివాళ్లు అండీ. నా గురించి అంతలా ఆలోంచారా..
సీత: అత్తయ్య గొప్పతనం నీకు తెలీదు అంటే నీకు ఇంకా నేను అసలు విషయం చెప్పలేదు. అది వింటే నువ్వు థ్రిల్ అయిపోతావు. రాత్రీ అత్తయ్య నాకు ఇంకా ఏం చెప్పింది అంటే నీ కోసం తను చేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి వెలిగిస్తారు అంట. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది.
మధు: నాకోసం మీరు చేతిలో కర్పూరం వెలిగించుకుంటారా.. మహాలక్ష్మి నీళ్లు నములుతుంది. సీత పెద్ద కర్పూరం తీసుకొని వస్తుంది. చేసేది ఏమీ లేక మహాలక్ష్మి ఆ పెద్ద సైజు కర్పూరాన్ని చేతిలో వెలిగించుకుంటుంది. సీత జయమంగళం అంటూ హారతి పాట పాడుతుంది. మహాలక్ష్మి చేయి కాలి నొప్పితో బాధ పడుతుంది. రేవతి, చలపతిలు సీత తెలివికి నవ్వుకుంటారు. మహాలక్ష్మి గదిలోకి వెళ్లి చేయి మంట అని బాధపడుతుంది. సీత కావాలనే ఇరికించిందని అని చెప్తుంది.
గిరిధర్: నువ్వు మధు మీద ప్రేమతో ఇలా చేశావ్ అనుకున్నాం వదిన.
మహాలక్ష్మి: కాదు నా మీద పగతో ఆ సీత ఇలా చేసింది. ఈ మంట తగ్గేదెల.
సీత: వెన్న పట్టుకొని వస్తుంది. చేయి మంట పుడుతుందా అత్తయ్య చేయి నొప్పిగా ఉందా చేయి ఇలా ఇవ్వండి వెన్నపూస రాస్తాను.
మహాలక్ష్మి: ఏం అవసరం లేదు గిచ్చి జోల పాట పాడాలి అని చూస్తున్నావా.
సీత: అహా నేను ఎంత పుణ్యం చేసుకున్నాను మా అత్తయ్య చేతికి వెన్న రాసే అదృష్టం నాకు వచ్చింది.
మహాలక్ష్మి: ఏంటే నీకు అంత వెటకారంగా ఉందా.
సీత: నన్ను మీరే పెట్టే బాధ ముందు ఈ మంట ఒక లెక్కా అత్తయ్య. మరి మీరు రోజు నా మనసుకు మంట పెడుతున్నారు. అది ఇంకా నొప్పి అని మీకు తెలీదా.. ఇంకోసారి మా అక్కతో ఇలాంటి పూజలు చేస్తే మిమల్ని నిప్పుల మీద నడిపిస్తా.
మహాలక్ష్మి: నాతోనే గేమ్స్ ఆడుతుంది దీన్ని ఏం చేయాలి..
అర్చన: వెంటనే ఆ సీత మీద పగ తీర్చుకోవాలి.
మహాలక్ష్మి: మధు నా కోడలి అయిన రోజు సీత కుమిలి కుమిలి చావాలి అదే నేను దానికి వేసే అతి పెద్ద శిక్ష. రామ్ మనసు మార్చడంతో పాటు ఆ శివకృష్ణ మనసు విరక్కొట్టాలి. మధుకి ఆ శివకృష్ణ సపోర్ట్ లేకుండా చేయాలి.
లలిత సీతకు ఫోన్ చేసి మధు గురించి అడగమని చెప్తుంది. సీతకు తన తండ్రి శివకృష్ణ ఫోన్ చేస్తాడు. లలిత మధు గురించి అడుతుంది. అక్క పూర్తిగా మారిపోయింది అని సీత చెప్తుంది. మధుని మహాలక్ష్మీ పూర్తిగా తన వైపునకు మార్చుకుంది అని సీత చెప్తుంది. తన అక్క తనని స్నేహితురాలిగా కూడా చూడటం లేదని ఏడుస్తుంది సీత. సూర్య బయటకు వస్తే తప్ప మధు ఆ ఇంటి నుంచి బయటకు రాదని సీత చెప్తుంది. ఇక సూర్య రిమాండ్‌లో ఉన్నాడని శివకృష్ణ చెప్తాడు. సీత గురించి ఇంట్లో వాళ్ల బాధ పడతారు. ఇక శివకృష్ణ తన చెల్లి ఫొటో దగ్గరకు వెళ్లి ఎంత ప్రేమగా చూసుకున్నానో నువ్వు నన్ను అంత మోసం చేశావని బాధ పడతాడు. ఇక గతంలో సుమతికి శివకృష్ణ పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. అందరూ సంతోషపడితే సుమతి బాధ పడుతుంది. తాను ఒకర్ని ప్రేమించాను అని సుమతి ఇంట్లో వాళ్లకు చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.