Krishna Mukunda Murari Today Episode: మీరాలా ముకుంద భవాని ఇంట్లోకి వచ్చేస్తుంది. అందరూ మీరా రాకను ఇష్టపడితే ఆదర్శ్‌ మాత్రం చిరాకు పడతాడు. ఇక అందరూ భోజనాలకు సిద్ధం అవుతారు. ఆదర్శ్‌ని కూడా పిలవమని భవాని చెప్తుంది. దీంతో నందూ పిలిచినా రాడమ్మ అని చెప్తుంది ఎందుకు అని భవాని ప్రశ్నిస్తుంది.


రేవతి: ఎందుకంటే ఏం చెప్పాలి అక్క. నేను నా కొడుకు మురారిని ఒకలా ఆదర్శ్‌ని మరొలా చూస్తున్నాను అంట. ఇంట్లో ఎవరూ వాళ్లని పట్టించుకోవడం లేదంట.
నందూ: ఏదో ఒక కారణం వెతుక్కొని మరీ తిడుతున్నాడు. ఏదైనా అంటే నీకు ఇక్కడేం పని మీ ఇంటికి పో అంటున్నాడు.
భవాని: వెళ్లి వాడిని పిలవండి..
కృష్ణ: ఇప్పుడు ఎందుకు అత్తయ్య గొడవలు..
భవాని: గొడవకు కాదు పద్థతులు మార్చుకోమని చెప్పడానికి ఇలాగే వదిలేస్తే ఇంట్లో అందర్ని శత్రువులుగా చూస్తాడు. మధు వెళ్లి తీసుకొనిరా.. అవును మీరా ఎక్కడ. 
కృష్ణ: తను ఇప్పుడే పైకి వెళ్లింది అత్తయ్య నేను తీసుకొని వస్తా.
మీరా: మురారి షర్ట్‌ పట్టుకొని నిజంగానే మురారి వచ్చాడు అనుకొని ఊహించుకొని.. మురారి వచ్చేశావా నేను నీ ముకుందని చూడు నీ కోసం ఎలా మారిపోయానో. మాట్లాడవేంటి మురారి. చూశావా ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో. కానీ ఈ షర్ట్ వేసుకొని నువ్వు ఆ కృష్ణ పక్కన ఉంటే బాగోదే అదే నా పక్కన అయితే ఫెర్‌ఫెక్ట్. మురారి కృష్ణనీకు సెట్ అవ్వదు మనిద్దరం కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం వచ్చేయ్ మురారి అంటుంది. ఇంతలో కృష్ణ రావడంతో షర్ట్‌ని తలగడ కింద దాచేస్తుంది.
కృష్ణ: మీరా అంతా ఓకేనా ఎదో టెన్షన్‌లో ఉన్నట్లు ఉన్నావ్.. సరే అందరూ వెయిట్ చేస్తున్నారు రా భోజనం చేద్దాం. తొందరగా వచ్చేయ్..
ఆదర్శ్‌: అమ్మా పిలిచావు అంట. ఇష్టం లేని మనుషులు ఇంట్లో ఉంటే కష్టం గానే ఉంటుంది అమ్మ. 
భవాని: అంత ఇష్టం లేని వాళ్లు ఎవరు ఉన్నారు.
నందూ: ఇంకెవరు కృష్ణ, మురారి. ఇందాక మురారి అన్నయ్యతోనూ అదే అన్నాడు. నన్నూ పొమ్మన్నాడు. 
కృష్ణ: అంత కష్టం అయితే వెళ్లిపోతాం పెద్దమ్మ.
మురారి: అవును పెద్దమ్మ నచ్చని ముఖాలు చూస్తూ తిండి మానేయాల్సిన అవసరం ఏముంది.
భవాని: నోరు మూయండిరా. ముందు కూర్చొండి. వాడేదో అర్థం లేకుండా మాట్లాడితే వాడిని పట్టించుకుంటారేంటి. కొన్ని బంధాలు బాగుండాలి అంటే కొన్నింటిని లెక్కలోకి తీసుకోవాలి కొన్నింటిని లెక్కలోకి తీసుకోకూడదు. కొన్నాళ్లు నువ్వు దూరంగా ఉండి ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లని పొమ్మంటున్నావా..
ఆదర్శ్‌: నేను చెప్పింది మీరా గురించి. శిక్ష పడాల్సిన వారికి శిక్ష పడకుండా చేసింది తనని ఇంట్లోకి తీసుకురావడం నాకు నచ్చలేదమ్మ. మీరా వింటుంది. 
మీరా: ఓ నా మీద ఆదర్శ్‌ కోపానికి కారణం ఇదా.. మురారి వాళ్లు ఇంట్లో ఉండటం ఆదర్శ్‌కి ఇష్టం లేదా ఒకందుకు ఇదీ మంచిదే. మీరు గొడవ పడితేనే కదా నా పని సులభం అవుతుంది.
భవాని: అయితే ఇప్పుడేం చేయమంటావ్.
ఆదర్శ్: మీరాని ఇంట్లో నుంచి పంపేయండి. తను ఈ ఇంట్లో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. 
భవాని: అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే ఈ ఇంట్లో చోటు ఉంటుంది. అర్హత లేని వాళ్లు ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే ముకుందలా..
 మీరా: నేను ఎక్కడికీ పోలేదు అత్తయ్య. ఈ ఇంట్లో ఉండే అర్హత ఎవరికైనా ఎక్కువ ఉంది అంటే అదినాకే.. ఆ విషయం మీకు తొందర్లోనే అర్థమవుతుంది. అందరి దగ్గర సింపథి కొట్టేయాలి. ముకుందలా ముడుచుకు కూర్చొవాలి అంటే కుదరదు. క్యారెక్టర్ పూర్తిగా మార్చేయాలి.
రేవతి: అక్క మీరా వస్తుంది.
భవాని: మీరా నువ్వు ఇక్కడ ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. ముందు ఆ కళ్లు తుడుచుకో.
మీరా: నేను ఎడ్వటం లేదు మేడమ్. నేను అనాథని కదా ఇంత మందిని చూడటం కలిసి ఉండటంతో తెలీకుండానే కన్నీళ్లు వచ్చాయి. మనసులో అందరి మనసులు గెలుచుకున్నాను ఒక్క ఆదర్శ్‌ మనసు తప్ప ముందు ఆదర్శ్‌ మనసు గెలుచుకోవాలి. మేడం నాదో కోరిక నేను మీ అందరికీ వడ్డిస్తాడు. 


మీరా అందరికీ వడ్డిస్తుంది. ఆదర్శ్‌ ప్లేట్ కూడా రివర్స్ చేయకపోతే తానే చేసి వడ్డిస్తుంది. ఆదర్శ్‌ సీరియస్‌గా చూస్తే కావాలనే ఎక్కువ సాంబారు పోసేస్తుంది. భవాని తినమని అంటే..
 
ఆదర్శ్‌: ఏంటి అమ్మా తినేది అందరికీ పప్పు వేసి నాకు మాత్రం సాంబారు వేసింది. నాకు సాంబారు అంటే ఇష్టం అని పప్పు కంటే ముందు సాంబారు వేసుకొని తింటాను అని తనకి ఎలా తెలుసు. 
మీరా: మనసులో.. నేను గెలవాలి అంటే నీకు నచ్చింది చేస్తూ నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలి కదా. 
ఆదర్శ్‌: చెప్పు నా ఇష్టం గురించి నీకు ఎలా తెలుసు.
మధు: ఇందులో ఏముందు ముకుంద ఫ్రెండ్ కదా చెప్పుంటుంది.
ఆదర్శ్‌: నా ఇష్టాలను తెలుసుకొని ఫ్రెండ్స్‌కి చెప్పేంత సీన్ ముకుందకు లేదులే. నువ్వు చెప్పు. 
మీరా: సారీ సార్. 
కృష్ణ: సారీ ఎందుకు పొరపాటు అయినా నచ్చిందే వేశావ్ కదా.. నువ్వు కూర్చో అందరం కలిసి తిందాం.


ఇక మీరా తన ఫొటోకి దండ వేసి ఉంటడం చూసి ముందు ఆ దండ తీయించేయాలి అనుకుంటుంది. ఇక మీరా తింటుంటే కృష్ణ మీరా నువ్వు అచ్చం మా ముకుంద అన్నం కలుపుకున్నట్లే కలుపుకుంటున్నావ్ తెలుసా అని అంటుంది. దీంతో మీరా ముకుంద కూడా ఇలాగే అనేది అని కవర్ చేస్తుంది. ఇక మీరా ముకుంద ఫొటో చూసి ఎమోషనల్‌గా మాట్లాడి ఆ ఫొటో తీసేయ్ మని అడుగుతుంది. దీంతో ఆదర్శ్‌ ఎవరిదైనా ఫొటో పెట్టుకున్నాం అంటే వాళ్ల చేదు జ్ఞాపకాలు కాదు తీపి జ్ఞాపకాలు రావాలి అని నాకు ఆ ఫొటో అక్కడ ఉండటం ఇష్టం లేదు అని ఆదర్శ్‌ అంటాడు. దీంతో భవాని అయితే వెళ్లి తీసేయ్‌రా అని అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: త్రినయని సీరియల్ మార్చి 29th: వామ్మో.. గాయత్రీ మాయం వెనుక తల్లి నయని హస్తమా.. తేల్చేసిన విశాలాక్షి, సుమన సేఫ్!