Satyabhama Telugu Serial Today Episode : పారిజాతం క్రిష్ సత్యలకు శోభనం అవ్వలేదు అని భైరవితో చెప్తుంది. దీంతో భైరవి సత్య గదికి వచ్చి నిలదీస్తుంది. పెళ్లి జరిగిన మొదటి రాత్రే నా కొడుకుని బయట పడుకునేలా చేశావు అంటే నీదేనా నీ సంస్కారం అని అడుగుతుంది. క్రిష్‌ని పిలుస్తుంది. క్రిష్ బయట నుంచి వస్తాడు.


క్రిష్: అమ్మా ఏమైంది.
భైరవి: ప్రేమ ఎంత గుడ్డిదో ఇంకోసారి రుజువు అయిందిరా.. ప్రేమించిన వాడు ఎంత ఎడ్డొడో నా కళ్లముందు కనిపిస్తుంది.
క్రిష్: ఇప్పుడు ఏమైందని అని ఇంత లొల్లి చేస్తున్నావ్.
భైరవి: నేను అదే అడుగుతున్నా ఏమైంది అని బెడ్ చూపిస్తుంది. క్రిష్ సత్య ముఖం చూసి సత్య మాటలు గుర్తుచేసుకుంటాడు. నేను ఇటు అడుగుతుంటే దాని ముఖం చూస్తావేంట్రా. అదేమో నోరు విప్పదు. 
క్రిష్: నవ్వుతూ.. ఏంటి సత్య ఏం జరిగిందో అమ్మకు చెప్పలే. అమ్మ అంతగా అడిగితే చెప్పాలి కదా. కష్టపడి మొత్తం డెకరేషన్ చేయించింది అలాంటప్పుడు ఎక్కడికి అక్కడే ఉంటే వాళ్లకు బాధ అనిపిస్తుంది కదా. చెప్పేయాల్సింది. మా అమ్మ మాట చాలా కఠినంగా ఉంటుంది. కానీ మనసు చాలా మంచిది. ఇప్పటి కైనా మించిపోయింది లేదు జరిగింది ఏంటో చెప్పేయ్.
భైరవి: నువ్వేమో చెప్పమంటావ్ అదేమో నోరు కదపదు. ఏంట్రా ఈ తమాషా. ఆడుకుంటున్నారా నాతో. 
క్రిష్: ఊరుకోమ్మా... నీ కోడలు చెప్పడం లేదు కదా నేనే చెప్తాలే. ఎక్కడికి అక్కడ చెక్కు చెదరకుండా ఉంది అదే కదా నీ డౌట్. రాత్రి మేమిద్దరం టెర్రస్ మీద పండు వెన్నెల్లో పడుకున్నాం. అది నా కోరికే.. 


పగిలిన గాజు ముక్కని భైరవి కొడుకు చేతిలో పెట్టి ఇది ఎక్కడిది అని అడుగుతుంది. నాటకాలు ఆడుతున్నారా అని అడుతుంది. 
భైరవి: రాత్రి నీ పెళ్లం నీతో గొడవపడింది. గ్లాసు విసిరేసింది. నాకు తెలీదారా..
క్రిష్: సత్య నాతో గొడవ పడటం ఏంటి అమ్మ. నువ్వు అన్నీ ఇలా వంకరటింకర ఆలోచిస్తావ్. ఓపిక అంటే నీ చిన్న కోడలిదే. 
భైరవి: మీతో కాదురా డైరెక్ట్‌గా మీ మామతోనే ఫోన్ చేసి మాట్లాడుతా..
క్రిష్: అమ్మా నువ్వు లేనిపోని కిరికిరిలు తీసుకొనిరాకు. బుద్ధిగా కాపురం చేసుకుంటే ఇలా చేస్తావ్ ఏంటి.
భైరవి: రేయ్ నువ్వు ఒప్పుకోకపోయినా నీ అంతరాత్మకు తెలుసురా. రాత్రి జరిగిన ముచ్చట నీ నాన్నని తెలిసిందే అనుకో. ఎప్పుడెప్పుడు వారసుడిని ఎత్తుకుందామా అని నీ బాపు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో తెలుసా. జరిగింది తెలిస్తే నీ మక్కెలు ఇరక్కొడతాడు. ఈ ఇంట్లో ఎట్లా నడవాలో నీ పెళ్లానికి నేర్పించు. కోడలు అంటే నీ వదిన లెక్క వినయంగా ఉండాలి అని చెప్పు.


పారిజాతం: అమ్మగారు నేను చెప్పింది నిజమే కదా.. పదండి అయ్యగారి దగ్గరకు వెళ్లి చెప్దాం. కొత్త కోడల్ని కర్రపట్టి బయటకు పంపేస్తారు. మీ పగ కూడా తీరుతుంది.
భైరవి: నాకు సత్య మీద కోపం ఉన్నమాట నిజమే. అలా అని చెప్తుంది వాళ్ల కాపురం కూల్చలేను. నాకు కావాల్సింది పెద్ద కోడల్లా చిన్న కోడలు కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి. 
పారిజాతం: మీ పెద్ద కోడలు చదువు లేని మొద్దు మీ మాట వింటుంది చిన్నకోడలు అలా కాదు. అయినా కన్న కూతురికి ఇష్టం లేని పెళ్లే ఆపలేకపోయారు. పెళ్లి చేసి చేతులెత్తేసి అత్తారింటికి పంపేశారు. మీ చిన్న కోడలితో జాగ్రత్తమ్మ కావాలనే శోభనం ఆపేసుంటుంది. ఎక్కడ నొక్కితే మొగుడు మాట వింటాడో ఎక్కడ టైట్ చేస్తే కంట్రోల్‌లో ఉంటాడో అదే చేస్తుంది. మొగుడిని కొంగులో కట్టేసింది అంటే మీకు కొడుకే కాదు మీ పెత్తనం కూడా పోతుంది. జాగ్రత్తమ్మా..


ఆఫీస్‌కు వెళ్తానని హర్ష హడావుడి చేస్తాడు. అందరూ రెస్ట్ తీసుకో అని అంటారు. నువ్వు కోడలు కలిసి పూజ చేయాలి అని విశాలాక్షి చెప్తుంది. ఆఫీస్‌కు వెళ్లొద్దు అంటారు. నా వల్ల కాదు అని హర్ష అంటాడు. ఇక నందిని నిద్ర లేవలేదు అని హర్ష చెప్తాడు.  ఇక విశాలాక్షి నందినిని లేపడానికి వెళ్తుంది.


విశాలాక్షి: తనలో తాను ఏమనుకుంటుందో ఏమో అసలే నోటి దురుసు ఎక్కువ పుసుక్కన ఓ మాట అనేస్తే లాక్కోలేక పీక్కోలేక చావాలి. ఎందుకొచ్చింది. ఏదో ఒక సారి అరిచింది అని ప్రతీ సారి ఎందుకు అలా చేస్తుందిలే బారెడు పొద్దెక్కింది లేపితే ఆమాత్రం అర్థం చేసుకోదా ఏంటి. పైగా అడగ్గానే మా గది ఇచ్చేశాం ఎందుకు ఏమంటుందిలే.. విశాలాక్షి లేపాలి అని ప్రయత్నిస్తే నందిని పనిమనిషి అనుకొని తిడుతుంది. విశాలాక్షి నందిని ఇంకా పుట్టింట్లో ఉంది అనుకుంటుంది అని మరోసారి లేపుతుంది. నందిని నేను అమ్మ మీ అత్తయ్యని.. లేవాలి కదా..
నందిని: మా ఇంట్లో పొద్దున్న పది గంటల్లో లేచే అలవాటే లేదు. నేను లేచినప్పుడే లేస్తా ఇలాగే సతాయిస్తే అస్సలు లేవను ఎవరికి చెప్తావో చెప్పుకో. 
విశాలాక్షి: అలా కాదమ్మా కొత్త కోడలివి కదా ఉదయమే స్నానం చేసి దీపం పెట్టాలి.
నందిని: ఈ దీపం చల్లగుండా.. నేను వెలిగిస్తే గానీ అది వెలగదా.. నన్ను సతాయించొద్దు పోయి పని చేసుకోండి.
విశాలాక్షి: పుట్టింట్లో గారాభం కదా..
శాంతమ్మ: అత్తింట్లో నువ్వూ చేస్తేన్నావ్ కదా.
విశాలాక్షి: కొన్ని రోజులు తప్పదు కాదా సర్దుకుపోవాలి కదా అత్తయ్య.
విశ్వనాథం: అంతేగా మనకు అలవాటే కదా. అని నవ్వుకుంటారు. 


క్రిష్: ఒక్కటైనా కరెక్ట్‌గా తేలిపోయింది సంపంగి. దేవుడు నీకు అందం ఇచ్చాడు. దాన్ని బ్యాలెన్స్  చేయడానికి తెలివి కొంచెం తక్కువ ఇచ్చాడు. అరే నలగని పూల మంచం చూస్తే ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది అని కూడా తెలీదా నీకు. కథ అంతా లీక్ అవుతుంది అని నీకు తెలీదా.. నా మీద కోపం అందరికీ తెలియాలా..
సత్య: నీ మీద ఉన్నది కోపం కాదు తగ్గడానికి నేను నా కుటుంబం పడిన బాధ నుంచి వచ్చిన ద్వేషం.
క్రిష్: నిన్న ఎక్కడ ఆపావో మళ్లీ అక్కడే స్టార్ చేశావా. తెల్లారింది జరిగింది అర్థం చేసుకొని మారు సంపంగి ఇప్పటికే బంగారం లాంటి ఒక రాత్రి వేస్ట్ అయింది. మారు..
సత్య: నేను నీలా ఊసరవెళ్లి కాదు మాటలు మార్చడానికి.. నేను నీలా అన్ని మాటలు మార్చను.
క్రిష్: మీ చదువుకున్నవాళ్లతో ఇదే ప్రాబ్లమ్. అవసరం అయిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఏది అవసరమో అది వదిలేస్తారు.
సత్య: నా నూరేళ్ల జీవితం నీతో పసుపు తాడు కట్టించుకున్న రోజే నాశనం అయింది. 
క్రిష్:  అరే పిచ్చిదాని లెక్క మాట్లాడకు. ఏమైంది నీ జీవితానికి ఏం లోటు వచ్చింది. ప్రాణంగా ప్రేమించేవాడు దొరికాడు. నెత్తిమీద పెట్టుకొనే వాడు దొరికాడు ఇంకేం కావాలి.
సత్య: నీది దౌర్జన్యంతో కూడిన ప్రేమ, దాన్ని ప్రేమ అనరు.. ఏమంటారు అంటే..
క్రిష్:  చూడు సత్య ఇదంతా ఆరౌడీ గాడి వల్ల జరిగింది. నువ్వే ఏదేదో ఊహించుకుంటావ్. అయినా నీకు నాతో బంధం తెంచుకోవాలి అనిలేదు అందుకే మా అమ్మతో నిజం చెప్పలేకపోయావ్. అలాగే ప్రేమను వదులు కోవాలి అని నా మనసులో లేదు అందుకే అమ్మ దగ్గర నీ దిక్కు వేలు పెట్టి చూపలేదు. జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు అయినా నన్ను ప్రేమించు నేను ఏంటో తెలుస్తుంది.
సత్య: అది అస్సలు జరగదు. ప్రేమించాలి అంటే నమ్మకం ఉండాలి. నీ మీద నాకు అది లేదు. తప్పని సరై నేను కట్టించుకున్న తాళికి గౌరవించి ఉంటున్నా. మొగుడు రాక్షసుడు అయినా మెట్టినింటిలోనే ఆడదానికి జీవితం. 
క్రిష్: మొగుడు రాక్షసుడు అనుకుంటే ఎందుకు కలిసి ఉండటం. అయినా రాక్షసుడు అయిన రావణుడి భార్య కూడా ఆయనతో కలిసి ఉండి కాపురం చేసింది. నీ లెక్క చేయవేయనీయలేదు అనుకున్నావా. 
సత్య: రాక్షసుడు అయిన రావణుడు భార్యని మోసం చేయలేదు. కానీ నువ్వు నన్ను సొంతం చేసుకోవడానికి మోసం చేశావ్
క్రిష్: అరే మళ్లీ అదే మాట.. నేను నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ప్రేమించాను కాబట్టి నువ్వు నా మనసును ఇంత కష్టపెడుతున్నా భరిస్తున్నా.
సత్య: అంటే ఏంటి బెదిరిస్తున్నావా. నా ఇష్టంతో పనిలేకుండా నన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా.. రా టచ్ చేయ్ చెప్తా..
క్రిష్: సత్య పిచ్చిదాని లెక్క మాట్లాడకు. ఎందుకు నా గురించి ఇంత దుర్మార్గం ఆలోచిస్తున్నావ్. మనిషిని అర్థం చేసుకో నా గురించి అర్థం చేసుకో. అప్పుడు ఈ క్రిష్‌ ప్రేమ ఎంటో అర్థం అవుతుంది. అని క్రిష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


  Also Read: త్రినయని సీరియల్ మార్చి 29th: వామ్మో.. గాయత్రీ మాయం వెనుక తల్లి నయని హస్తమా.. తేల్చేసిన విశాలాక్షి, సుమన సేఫ్!