Seethe Ramudi Katnam Serial Today Episode సీత మిధునలా మహాలక్ష్మీ ఇంట్లో కన్న తండ్రి అయిన శివకృష్ణ చెంప పగలగొడుతుంది. రేవతి ఇంటికి వచ్చిన తర్వాత నా కూతురి స్పర్శ నాకు తెలీదా అంటూ శివకృష్ణ మాట్లాడటంతో సీత తండ్రి కాళ్ల మీద పడి క్షమించు నాన్న ఏ కూతురు చేయకూడని తప్పు చేశానని ఏడుస్తుంది. శివకృష్ణ ఏడుస్తూ సీతని పైకి లేపితే సీత మాత్రం తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని తండ్రి చేతులతో తనని తాను కొట్టుకుంటుంది.
సీత తండ్రిని కొట్టినందుకు సీత తన చేతిని కాల్చుకుంటుంది. శివకృష్ణ చూసి ప్రశ్నించడంతో నిన్ను కొట్టినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకున్నా నాన్న అని చెప్తుంది. శివుడి ముందు తండ్రిని కొట్టినందుకు ఏడుస్తూ దేవుడి ముందు ఉన్న దీపంపై చేయి పెడుతుంది. ఆ విషయం చెప్పడంతో శివకృష్ణ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. నన్ను కొట్టావని నీ చేతిని కాల్చుకున్నావా ఎంత పని చేశావ్ సీత అని అంటారు. నేను చేసిన తప్పునకు శిక్ష పడాలి కదా నాన్న అని అంటుంది. తండ్రీ కూతుళ్లు ఏడుస్తారు. రేవతి మందు తీసుకొచ్చి శివకృష్ణకు ఇవ్వడంతో శివకృష్ణ సీత చేతికి మందు రాస్తూ ఎమోషనల్ అవుతాడు. గౌతమ్ మిధున తనని కొట్టిందని రగిలిపోతూ ఉంటాడు. మహాలక్ష్మీ వచ్చి ఏంటి గౌతమ్ నన్ను రమ్మన్నావు అంటాడు. అర్చన చాటుగా ఇద్దరి మాటలు వింటుంది.
గౌతమ్: అర్జెంట్‌గా నాకు మిధునకు పెళ్లి చేస్తావా లేదా. మహాలక్ష్మీ: నువ్వు అడగ్గానే నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి అది నా అన్న కూతురు కాదు ముఖర్జీ కూతురు.గౌతమ్: అది ఎవరైనా సరే నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే.అర్చన: తనలో తాను వీడో పెద్ద మిలియనీర్ అడగ్గానే ముఖర్జీ కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలి. గౌతమ్: ఆ మిధున నా చెంప మీద కొట్టి నన్ను హర్ట్ చేసింది. కాబోయే పెళ్లాం కదా అని హగ్ చేసుకోబోయా అది తప్పా. మహాలక్ష్మీ: తనకు ఇష్టం లేకపోతే ఎవరైనా హగ్ చేసుకుంటే మిధునకు కోపం వస్తుంది.గౌతమ్: డబ్బు ఉందని దానికి పొగరు ఉంది. పెళ్లి చేసుకొని దాని పొగరు అణిచేస్తా.మహాలక్ష్మీ: నా టార్గెట్ కూడా అదే. మిధునకు వేల కోట్ల ఆస్తి ఉంది అది నా కోడలు అయితే ఆ ఆస్తి మొత్తం నాకే.అర్చన: పిచ్చి మహా అది పొరపాటున గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటే మీ అక్కకి కోడలు అవుతుంది నీకు కాదు.గౌతమ్: రామ్‌కి ఇచ్చి పెళ్లి చేయవు కదా. రామ్ నీ పెంపుడు కొడుకు అయితే నేను నీ కన్న కొడుకుని.అర్చన: ఏంటి వీడు మహా కొడుకా.గౌతమ్: నన్ను కని మా నాన్నని వదిలేశావ్. ఆస్తి కోసం ఈ ఇంట్లో తిష్టి వేశావ్. నాన్న ఎక్కడున్నాడో తెలీదు. మహాలక్ష్మీ: ఇప్పుడు నీ చరిత్ర ఎవరు అడిగాడురా.
గౌతమ్ మాటలు విన్ని అర్చన షాక్ అయిపోతుంది. కన్న కొడుకుని అక్క కొడుకు అంటావా.. ఇంకా ఎన్ని నిజాలు దాచిందో నీ సంగతి చెప్తా అని అర్చన వెళ్లిపోతుంది. సీత, శివకృష్ణతో తన మిధున క్యారెక్టర్ గురించి చెప్తుంది. రేవతి వల్ల ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అని అంటుంది. తండ్రి సీతకి జాగ్రత్తలు చెప్తాడు. డబ్బు కోసమే మహాలక్ష్మీ మిధున మీద ఇంట్రస్ట్ పెడుతుందని అంటాడు. నువ్వు నాన్న కాబట్టి నన్ను కనిపెట్టావ్ అందరూ కనిపెట్టలేరని అమ్మకి ఈ విషయం చెప్పొద్దని సీత చెప్తుంది. మరోవైపు రామ్ ముఖర్జీ ఇంటికి వెళ్తాడు. తన కూతురు మిధునని తీసుకొని ఆడిటర్ దగ్గరకి వెళ్లమని కొన్ని ఫైల్స్ రిఫరెన్స్ కావాలని అంటాడు. రామ్ తాను చూసుకుంటా అంటే ముఖర్జీ వాళ్లు రామ్‌ని మిధునని తీసుకెళ్లమంటారు. ఇంతలో మిధున వచ్చి నాతో ప్రాబ్లమ్ ఏంటి రామ్ అంటుంది. సీతతో తప్ప ఇంకెవరితో రామ్ వెళ్లడేమో అని సుశీల అంటుంది. సీత ఏమైనా అంటుందా అని భయపడుతున్నావా అని అడుగుతారు. దాంతో రామ్ మిధునని తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?