Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode: పిల్లలను స్కూల్‌కు రెడీ అవ్వమని లక్ష్మీ తొందరపెట్టగా...నువ్వు,నాన్న కూడా రెడీ అయ్యి మాతోపాటు స్కూల్‌కు రావాలని చెబుతారు.ఇంతకు ముందే మాకు  ప్రామీస్ చేశారని వాళ్లు గుర్తుచేస్తారు. మిత్రా నేను రెడీగానే ఉన్నాను..మమ్మీ రెడీ అవ్వగానే వెళ్తామని చెప్పి...లక్ష్మీని రెడీఅవ్వమని చెబుతాడు. వాళ్లిద్దరి అనుబంధాన్ని చూసి మనీషా,దేవయాని కుళ్లుకుంటారు. అప్పుడే పిల్లల కోరిక మేరకు రోజా పువ్వు తీసి మిత్రా లక్ష్మీతలలో పెట్టడం చూసి మౌనిక మరింత ఉడుక్కుంటుంది. పిల్లలను తీసుకుని మిత్రా, లక్ష్మీ స్కూలుకు బయలుదేరతారు. ఇది చూసి మండిపడిన  దేవయాని...మనీషాపై ఎగురుతుంది. రాత్రి మిత్రాతోఅది చేస్తాను..ఇది చేస్తానని చెప్పి గదిలోకి దూరి వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చావని....ఉదయమే ఆ లక్ష్మీ ఎడుస్తుందనుకుంటే  మొగుడితో కలిసి సంతోషంగా స్కూల్‌కు వెళ్తోందని గొడవచేస్తుంది. ఇదంతా నీ చేతకానితనం వల్లే జరిగిందని మనీషాను తిట్టిపోస్తుంది. దీంతో  కోపంతో రగిలిపోయిన  మనీషా...వాళ్ల నలుగురూ విడిపోయాలా చేస్తానంటూ శపథం చేస్తుంది.

 

                     మనీషా గుట్టు మొత్తం మీ అమ్మ దేవయానికి తెలుసని జానూ కిరణ్‌తో చెబుతుంది. ఈరోజు ఎలాగైనా మీ అమ్మ ఫోన్ చెక్‌ చేయాలని చెబుతుంది. ఆ గుర్తుతెలియని నెంబర్‌ ఎవరిదో తెలుసుకోవాలని చెబుతుంది. దానికి కిరణ్‌....అది తెలుసుకోవాలంటే అమ్మ ఫోన్ చెక్‌ చేయాల్సిన అవసరమే లేదని....మా అమ్మ పెట్టుకునే స్మార్ట్‌ వాచ్‌లో బగ్‌ పెడితే చాలని అంటాడు. రిసీవర్‌ ద్వారా  మొత్తం విని వాళ్లు చేసే ప్రతి ప్లాన్‌ వినొచ్చని అంటుంది. అమ్మకు తెలియకుండా వాచ్‌ కొట్టేదమని జానూకు చెబుతాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన దేవయాని దేని గురుంచి మాట్లాడుకుంటున్నారని నిలదీస్తుంది. నాపైనే కుట్రలు పన్నుతున్నారంటూ  జానూపై  దేవయాని చేయిచేసుకోబోగా....ఆమె తప్పుకుటుందిం. అదే సమయంలో పట్టుతప్పి మంచంపై పడుతుంది.

 

               మిత్ర, లక్ష్మీ  పిల్లలను తీసుకుని కారులో స్కూల్‌కు బయలుదేరి వెళ్తుంటారు. తమను స్కూల్‌లో దింపి మీరు ఇంటికి తిరిగి వెళ్లొద్దని...మధ్యాహ్నం వరకే స్కూలు ఉంటుంది కాబట్టి  అప్పటి వరకు అమ్మను బయట తిప్పి మళ్లీ స్కూల్‌ వద్దకు రావాలని  పిల్లలు కోరతారు. రెస్టారెంట్‌కు, సినిమాకు తీసుకెళ్లమని సలహాలు ఇస్తారు. ఈలోగా స్కూల్ నుంచి మిత్రాకు మెసేజ్‌ వస్తుంది . ఈరోజు స్కూల్‌ లేదని చెప్పడంతో వాళ్లిద్దరూ సంతోషంతో గెంతులు వేస్తారు. దీంతో అందరం కలిసి గుడికి వెళ్తామని పిల్లలు మారం చేస్తారు.

                            సరియు మనీషాను కలిసి మండిపడుతుంది. నువ్వేదో సాధిస్తావని మంచి పని అప్పగిస్తే....ఇలా చేశావేంటని నిలదీస్తుంది. లక్ష్మీ సంగతి తెలిసి కూడా అంత అజాగ్రత్తగా  ఎలా ఉన్నావంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మిత్రా ప్రిపేర్ చేసే ఫైల్ ఎంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పినా  అది నువ్వు సాధించలేకపోయావని తిడుతుంది. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమని మనీషా అడగగా...అందుకు ఎక్కువ సమయం లేదని రేపు ఆ టెండర్ దాఖలు చేస్తారని  ఆ తర్వాత ఆ ఫైల్‌ దొరికినా పెద్ద ఉపయోగం ఉండదని చెబుతుంది. ఇంతకు ముందుకన్నా పెద్ద ప్లాన్‌ వేశానని...మూడురోజులుపాటు నేను,మిత్ర ఒకే రూంలో ఉండబోతున్నామని చెబుతుంది. ఆ ప్లాన్ ఏంటని సరియు అడగ్గా...సోది చెప్పే ముసలమ్మను తీసుకొస్తుంది మనీషా.. తాను చెప్పినట్లు  చెబితే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెబుతుంది. నీను నీకొక అడ్రస్‌ ఇస్తానని అక్కడికి వచ్చి  ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడకు నీకొడుకుతోపాటు  కడుపుతో ఉన్న నీకోడలు ఇద్దరూ మూడు రాత్రులు ఒకే గదిలో ఉండాలని చెప్పాలని చెప్పి పంపిస్తుంది. ఈ సోదమ్మ చెప్పింది  అరవింద వింటుందా అని సరియు అడగ్గా....ఖచ్చితంగా  నమ్ముతుందని మిత్రా కొడుకు కోసమైనా  ఏం చెప్పినా చేస్తుందని అంటుంది. ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా చూసుకోమని...మిత్ర పక్కనే ఉండి ఆ ఫైల్‌లోని డిటైల్స్‌ అన్నీ తనకు పంపించమని చెప్పి సరియు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

 

                                  పిల్లలను తీసుకుని లక్ష్మీ,మిత్రా గుడికి వస్తారు. అక్కడ లక్ష్మీని ఓ గద్ద కాళ్లతో తన్నుకుంటూ పోవడంతో ఆమె చాలా భయపడిపోతుంది. చేయి అడ్డుపెట్టగానే ఆమె చేతికి ఉన్న గాజులు పగిలిపోతాయి. దీంతో లక్ష్మీ ఏదో కీడు శంకిస్తుంది. మంగళవారం రోజు చేతి గాజులు పగిలిపోయాయని...ఏమైనా కీడు జరుగుతుందంటా అంటూ పంతులుగారిని లక్ష్మీ అడుగుతుంది. మంగళవారం రోజు సుమంగళి చేతి గాజులు విరిగిపోవడం అమంగళమేనంటూ  పంతులుగారు చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.