Mollywood: కమల్‌ను మించిన నటుడు... ఒకే సినిమాలో 45 క్యారెక్టర్లు... సినిమా ఫ్లాపైనా గిన్నిస్ బుక్‌లోకి!

Johnson George : కమల్ హాసన్ ను మరిపించేలా ఒకే సినిమాలో 45 డిఫరెంట్ పాత్రలు చేసిన మలయాళ నటుడు జాన్సన్ జార్జ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుని మలయాళ సినిమా గర్వపడేలా చేశారు.

Continues below advertisement

హీరోలు తెరపై కన్పించి ద్విపాత్రాభినయం చేస్తేనే ఎంతో థ్రిల్ గా ఫీల్ అవుతాము. కానీ ఒక హీరో అంతకు మించి ఎక్కువ క్యారెక్టర్లలో, అది కూడా ఒకే సినిమాలో నటిస్తే... అది అభిమానులకు అదిరిపోయే ఫీస్ట్ అవుతుంది. ఇక అలా నటించాలంటే ఎంతో ధైర్యం అవసరం. 'దశావతారం' సినిమాలో ఏకంగా 10 పాత్రలు చేసి కమల్ హాసన్ చేసిన సాహసాన్ని ఇప్పటికే చూశాం మనం. అందుకే ఒకే సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ లో నటించిన హీరో అనగానే టక్కున కమల్ హాసన్ పేరు, 'దశావతారం' సినిమా గుర్తొస్తాయి. కానీ ఓ నటుడు మాత్రం ఏకంగా ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ ప్లాఫ్ అయినప్పటికీ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది సౌత్ సినిమానే అయినప్పటికీ, ఇక్కడి ఆడియన్స్ కి చాలామందికి ఈ మూవీ గురించి తెలియదని చెప్పాలి. 

Continues below advertisement

ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించిన నటుడు 
సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ కథలతో పాటు లవ్ స్టోరీలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. అయితే కొంతమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు మాత్రం అంతకుమించి ఏదో చేయాలని తపన పడుతుంటారు. ఫలితంగా కొన్ని ప్రయోగాత్మక సినిమాలు తెరపైకి వస్తాయి. వాటిలో కొన్ని జనాలకు నచ్చుతాయి, మరికొన్ని నచ్చకుండా పోతాయి కూడా. 2018లో ఇలాంటి సినిమానే ఒకటి రిలీజ్ అయింది. కానీ ఆ మూవీ ఫ్లాఫ్ అయింది. ఈ ప్లాపైన సినిమాపై ఆ తర్వాత ప్రశంసలు వర్షం కురిసింది. ఈ సినిమా పేరు 'అరాను న్జన్'. ఇదొక మలయాళ మూవీ. 

'అరాను న్జన్' మూవీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఎందుకంటే ఈ మూవీలో హీరో జాన్సన్ జార్జ్ ఏకంగా 45 పాత్రలు పోషించి ఆశ్చర్యపరిచాడు. ఏడు సంవత్సరాల క్రితం అంటే 2018 మార్చి 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మూవీకి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించగా, ఇందులో జాన్సన్... జీసస్, వివేకానంద, గాంధీ, డావెన్సీ వంటి  45 డిఫరెంట్ రోల్స్ పోషించారు. ఈ సినిమా రన్ టైం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. ఇందులో జాన్సన్ తో పాటు జయచంద్రన్ ఠాఘక్కారన్, ముహమ్మద్ నీలంబర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ రికార్డును ఇప్పటిదాకా ఒక్కరు కూడా బద్దలు కొట్టలేకపోయారు. కానీ ఇలాంటి సినిమాలు మాత్రం తెరపైకి చాలానే వచ్చాయి. అంటే ఓ సినిమాలో ఒకే నటుడు ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడం లాంటి ట్రెండ్ అన్నమాట.

ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన కమల్ 

భారతీయ సినిమా చరిత్రలో చాలా మంది నటులు తమ బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. వైవిధ్యమైన పాత్రలకు పేరుగాంచింది మాత్రం కమల్ హాసన్, విక్రమ్. 'దశావతారం' చిత్రంలో కమల్ 10 విభిన్న పాత్రలను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. అదేవిధంగా విక్రమ్ కూడా తన అసాధారణ నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. అయితే జాన్సన్ జార్జ్ మలయాళ చిత్రం 'అరాను న్జన్‌'లో 45 ప్రత్యేక పాత్రలను పోషించి వారిని మించిపోయాడు.

Also Read'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?

Continues below advertisement