Prabhas's Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ మూవీ 'ది రాజా సాబ్'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ మూవీ టీజర్ అదిరిపోయే సర్ప్రైజులతో లోడ్ అవుతుందనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది.
'ది రాజా సాబ్' టీజర్ లోడింగ్ ప్రభాస్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో 'ది రాజా సాబ్' మూవీలో చూడబోతున్నారని చెప్పి ఇప్పటికే మేకర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు. ఇక దీనికి సంబంధించిన రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. అయితే చాలాకాలంగా 'ది రాజాసాబ్' మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం డార్లింగ్ ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే 'రాజా సాబ్' టీజర్ రెడీ అనే అదిరిపోయే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
రూమర్స్ ప్రకారం ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు ఇప్పటికే డైరెక్టర్ మారుతి రఫ్ కట్ చూపించారు. ఇది చూసిన అందరి నోటా ప్రభాస్ నెంబర్ బిఫోర్ అనే ఒకే మాట వినిపిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా టీజర్ ట్రెండింగ్ డైలాగ్స్‌తో, స్టైలిష్ లుక్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి మారుతి ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడని సమాచారం. ఇక ఆ సర్ప్రైజ్‌లలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ డైలాగ్ ప్రభాస్ నుంచి వినిపించబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా డైలాగులు, ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయట. నిజానికి ఇప్పటి వరకు ఇదొక హర్రర్ సినిమా అనుకున్నారు. కానీ మారుతి సర్ప్రైజింగ్‌గా విజువల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడట. అంతేకాకుండా టీజర్‌లో ఉండే షాట్‌లో స్టైల్, స్టెప్, థ్రిల్ కలగలిపి ఉండడం ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వడం, మారుతీ ఇమాజినేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం అని టాక్ నడుస్తుంది. కాస్త ఆలస్యం అవ్వచ్చేమోగానీ, రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి మారుతి ఫుల్ మీల్స్ పెట్టడం గ్యారంటీ అని అంటున్నారు. మరి మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం రెడీ చేస్తున్న ఈ ఫుల్ మీల్స్ టేస్ట్ తెలియాలంటే టీజర్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ.
ఇంకా షూటింగ్ దశలోనే 'ది రాజా సాబ్'ఈ మూవీకి 3 గంటల 30 నిమిషాల రన్ టైమ్ వచ్చిందని, దాన్ని తగ్గించే పనిలోనే మారుతి పడ్డాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ లేట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ముందుగా ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ ఇదే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.