Seethe Ramudi Katnam Today Episode
మధుమిత మహాలక్ష్మికి సీత, రామ్‌ల రిసెప్షన్ ఆల్బమ్ చూపించమని అడుగుతుంది. దీంతో మహా బ్యాచ్ అందరూ షాక్ అవుతారు. మహాలక్ష్మితో పాటు అందరూ ఇప్పుడు వద్దని దాని అవసరం లేదని మధుమితతో చెప్తారు. వాళ్లు అలా అనడంతో సీత మధుమితని రెచ్చగొడుతుంది.
సీత: చూశావా అక్క నువ్వు ఆల్బమ్ అడిగితే చూపించడం లేదు.
రేవతి: మధుకి ఆల్బమ్ చూపించొచ్చు కదా అన్నయ్య. చూపిస్తే తప్పేముంది.
చలపతి: మధు ఫోటోలు కూడా ఉన్నాయి కదా చూపిస్తే తప్పేముంది.
అర్చన: మనసులో.. ఇప్పుడు మధు ఆల్బమ్ చూస్తే మహా ప్లాన్ మధుకి అర్థమైపోతుంది.
జనార్ధన్: సీత ఇలాంటి చిక్కు తెచ్చి పెట్టింది ఏంటి.. మధు ఆల్బమ్ చూస్తే ఒక ప్రాబ్లం చూడకపోతే మరో ప్రాబ్లం.
సీత: ఆల్బమ్ చూపిస్తారా లేదా అడుగు అక్క.
మహాలక్ష్మి: రేపు చూపిస్తాను మధు.
సీత: కుదరదు ఈరోజే చూపించమని చెప్పు అక్క.
రామ్: పిన్ని రేపు చూపిస్తానని చెప్పింది కదా సీత.
రేవతి: ఇప్పుడు చూపిస్తే తప్పేంటి రామ్.
మధు: నాకు ఆల్బమ్ చూపించడానికి మీరందరూ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు అందులో ఏముంది.
మహాలక్ష్మి: ఆల్బమ్ ఎక్కడో ఉంది మధు..
రేవతి: ఇంట్లోనే ఉంది కదా వదిన.
చలపతి: నీ బీరువాలో పెట్టి భద్రంగా దాచావు కదా వదిన..
అర్చన: మహాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ఎవరికో చూడటానికి ఇచ్చి ఉండొచ్చు కదా.
సీత: అందరు చూడటం కంటే ముందు మా అక్క ఆ ఫొటోలు చూడాలి.
రామ్: సీత ఎందుకు ఇంత పట్టు పడుతున్నావ్. రేపో ఎల్లుండో చూడొచ్చు కదా.
సీత: మా అక్క ఈరోజే ఇప్పుడే చూడాలి.
మహాలక్ష్మి: అనుకున్నవన్నీ అనుకున్నప్పుడే జరిగిపోవాలి అంటే ఎలా. దేనికైనా టైం రావాలి కదా.
మధు: మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆల్బమ్ చూపించకపోతే మీరు ఏదో తప్పు చేశారు అని నేను అనుకోవాల్సి వస్తుంది.
రామ్: మేమేం తప్పు చేస్తాం మధుమిత గారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు.
మధు: మీ రిసెప్షన్ ఆల్బమ్‌లో నా ఫొటోస్ పెట్టారు అని సీత చెప్పింది రామ్ గారు. చాలా తప్పు కదా. అది నిజమో కాదో తెలియాలి అని అంటే నేను ఆల్బమ్ చూడాలి. మీరు చూపించకపోతే మా సీత చెప్పిందే నిజం అని నేను నమ్మాల్సి వస్తుంది. చెప్పండి నాకు ఆ ఆల్బమ్ చూపిస్తారా లేకపోతే నన్ను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోమంటారా..
సీత: వీళ్లు నీకు ఈ ఆల్బమ్ చూపించలేరు అక్క.
మహాలక్ష్మి: చూపిస్తాను. పదండి అని మహాలక్ష్మి అందర్ని తన గదికి తీసుకొస్తుంది. అందులో నుంచి ఆల్బమ్‌ను తీసి మధుమిత చేతికి ఇస్తుంది. అందులో రామ్ సీతల ఫొటోల ఆల్బమ్ ఉంటుంది.
సీత: చూశావా అక్క. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా.. తప్పు ఎవరిది. నాదా. మహాలక్ష్మి అత్తయ్యదా..
మధు: నీదే సీత.. సీత షాక్ అయిపోతుంది. ఈ ఆల్బమ్‌లో ఏ తప్పు లేదు. నువ్వు చెప్పినట్లు ఈ ఆల్బమ్‌లో ఎక్కడా నా ఫొటో లేదు. ఈ ఫొటో కట్ చేసి లేదు. ఆల్బమ్‌లో అన్నీ నువ్వు రామ్ గారు కలిసి ఉన్న ఫొటోలే ఉన్నాయి కావాలి అంటే చూడు. సీత చూసి షాక్ అయిపోతుంది.
సీత: లేదు. ఇది వేరు ఆల్బమ్ ఆ రోజు వచ్చింది ఇది కాదు మీరు ఆల్బమ్‌ని మార్చేశారు. మా అక్క ముందు మాయ చేస్తున్నారు.
మధు: ఇక చాలు ఆపు సీత. నీ మాటలు విని నేను అనవసరంగా అనుమానించాను. ఇబ్బంది కరంగా మాట్లాడాను.
మహాలక్ష్మి: సీత ఎప్పుడూ ఇంతే మధు జరగని విషయాలను జరిగినట్లు ఊహించుకుంటుంది. నా మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటుంది.
జనార్ధన్: అవును మధు ప్రతీసారి ఇలానే చూస్తుంది.
అర్చన: అందుకే సీతని రామ్ తిడతాడు. ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు.
గిరిధర్: అప్పటికీ మా వదిన ఓపికతో సీత చేష్టల్ని భరిస్తుంది.
మహాలక్ష్మి: ఇప్పటికైనా సీత స్టేటజీ నీకు అర్థమైందా మధు. ఇలా నా గురించి ఏదో ఒకటి చెప్పి ఇన్నాళ్లు రామ్ బుర్ర తినింది. ఇప్పుడు నీకు ఏవేవో చెప్తుంది. నీకు మంచి చేయాలి అని నేను ఇక్కడికి తీసుకొస్తే నిన్ను పంపేయాలి అని సీత ఏవేవో చెప్తుంది. ఇక నుంచి సీత ఏం చెప్పినా నువ్వు నమ్మొద్దు.
రామ్: మా పిన్నిని బ్లేమ్ చేయొద్దు నీకు ఎన్ని సార్లు చెప్పాను సీత. మీ అక్క ముందు ఇలా మాట్లాడొద్దు అంటే నువ్వు వినవా.
సీత: మీ పిన్ని ఆల్బమ్ మార్చేసింది అంటే మీరు నమ్మరా. ప్రతీ సారి ఆమె ఇలాగే ఏదో ఒక గిమ్మిక్కు చేస్తుంది.
మధు: గిమ్మిక్కులు చేస్తుంది నువ్వు సీత. నువ్వే ఆవిడ అంటే గిట్టనట్లు బిహేవ్ చేస్తున్నావ్. అంత మంచి మనిషిని అపార్థం చేసుకుంటున్నావ్. నువ్వే నిందలు వేస్తున్నావు అని ఈ ఆల్బమే చెప్తుంది.
సీత: ఆవిడ ఏం తప్పు చేయకపోతే.. అడిగిన వెంటనే ఎందుకు ఆల్బమ్ చూపించలేదు. ఎందుకు టెన్షన్ పడ్డారు.
మహాలక్ష్మి: ఎందుకు అంటే మధు బాధ పడుతుంది అని. ఆల్బమ్‌లో మీ అక్క ఫొటోలు ఎక్కడా లేవు కాబట్టి. మీ రిసెప్షన్‌తో పాటు మధు, సూర్యల రిసెప్షన్ చేస్తా అని నేను చెప్పాను. సూర్య రాకపోవడంతో ఆల్బమ్‌లో మీ ఫొటోలు చూసి తను బాధ పడుతుంది అని ఆలోచించాను.
మధు: నా గురించి మీరు ఎంత బాగా ఆలోచించారు. అండీ.. సారీ సీత చెప్పింది విని మిమల్ని అడిగి అవమానించాను. ఇక సీత ఏం చెప్పినా నేను నమ్మను. మహాలక్ష్మి గారు నన్ను మీ ఇంట్లో పెట్టుకున్నారు. నా మంచీ చెడు ఆలోచిస్తున్నారు. నా బాగోగులు పట్టించుకుంటున్నారు. అలాంటి గొప్ప మనిషి మీద నిందలు వేయడానికి నీకు సిగ్గుగా లేదా. ఇక జన్మలో నీ మాటలు వినను.
రామ్: ఇప్పటికైనా నీ పద్థతి మార్చుకో సీత ఇలా అందరితో మాటలు పడకు. నన్ను బాధ పెట్టకు..
జనార్ధన్: మధుమిత ఎక్కడ ఆ ఆల్బమ్ చూస్తుందో అని మేం చాలా టెన్షన్ పడ్డాం మహా కానీ నువ్వు భలే తిప్పికొట్టావ్.
గిరిధర్: సీత ఆడిన ప్రెగ్నెంట్ డ్రామాకు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు వదిన.
మహాలక్ష్మి: అక్కా చెల్లెల్ల మధ్య అడ్డుగోడ కట్టాను. మధుమితని మనవైపునకు తిప్పుకున్నాను. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి సీతకు చాలా టైం పడుతుంది.
మధుమిత, జలజకు ఫోన్ చేస్తుంది. ఇక జలజ సూర్య మధుమిత గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. సూర్య అపార్థం చేసుకుంటున్నాడు అని ఎంత నచ్చచెప్పినా వినడం లేదు అని చెప్తుంది. రామ్‌ని వదిలి తప్పు చేశావు అని మధుని రెచ్చగొడుతుంది జలజ.
మరోవైపు సీత జరిగిన దాని గురించి తలచుకొని బాధపడుతుంది. మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. మధు ఇంటికి వస్తే సీత ఆల్బమ్ రచ్చ చేస్తుంది అని ముందే ఊహించి ఆల్బమ్ మార్చేశాను అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక మహాలక్ష్మి మధుమిత జీవితాన్ని కాపాడుతాను అని అంటుంది. ఏ విధంగా మా అక్కని కాపాడుతారు అని సీత ప్రశ్నిస్తుంది. దీంతో మహాలక్ష్మి అవిటివాడు, డబ్బు లేని వాడు అయిన సూర్య నుంచి అందగాడు, ధనం ఉన్నవాడు, భార్యను మంచిగా చూసుకొని రామ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని మహాలక్ష్మి సీతకు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.