Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు మార్చి 22nd ఎపిసోడ్)
అనుపమ హాస్పిటల్లో ఉందని తెలిసి ఫణింద్ర కాల్ చేసి సమాచారం అడుగుతాడు...ఫోన్ తీసుకున్న దేవయాని ఆరాలు మొదలెడుతుంది .. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది...మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని పంచ్ వేసిన మహేంద్ర, మీరు తెలుసుకున్నా లేకపోయినా ఎలాంటి ఉపయోగం లేదు వదినగారు అని కాల్ కట్ చేస్తాడు. అడిగినదానికి సమాధానం కూడా చెప్పలేదని పైర్ అవుతుంది దేవయాని... ఇప్పుడు నా తమ్ముడు మాట్లాడినదాంట్లో తప్పేముందని రివర్సవుతాడు ఫణీంద్ర... ఇంతకీ మన శత్రువులు ఎవరని క్వశ్చన్ చేయగానే... దేవయాని, శైలేంద్ర ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటారు...
శైలేంద్రకు కొత్త బాధ్యత
రిషిని టార్గెట్ చేసినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటాడు ఫణీంద్ర..అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది? ముందు రిషి కాలేజీ వదిలివెళ్లాలా చేశారు? జగతిని చంపేశారు? ఇప్పుడు కాలేజీకి సపోర్ట్ చేస్తున్న మనుపై అటాక్ చేశారు? ఇదంతా చూస్తుంటే కాలేజీని దక్కించుకునేందుకే ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది...వాళ్లెవరో నువ్వు కనిపెట్టు శైలేంద్ర అప్పుడు చెప్తా వాళ్లపని అని ఫైర్ అవుతాడు. నువ్వు కాలేజీకి వెళ్లి చేసే పనేం లేదు...మన శత్రువులు ఎవరో నువ్వు పసిగట్టి వాళ్లని సాక్ష్యాధారాలతో పట్టుకుని నాకు అప్పగించాలి అంటాడు. ధరణి నవ్వుకుంటుంది.... నీకేం అర్థమైందో ఏం చేస్తావో చూస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఫణీంద్ర....
హాస్పిటల్లో ఒంటరిగా కూర్చుని మను...తల్లి అనుపమ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు... అక్కడకు వచ్చిన ఏంజెల్, వసుధార మనుని చూసి బాధపడతారు. ఏదైనా తినమని ఏంజెల్ అడిగితే ఆకలి లేదు అనేస్తాడు. ఆకలిగా లేకపోయినా కానీ తినాలి అంటుంది వసుధార. ఇప్పటికే చాలా సేపటి నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావ్ అని ఏంజెల్ అంటే...కొన్నిసార్లు రోజుల తరబడి తినకుండా ఉండిపోయాను అంటాడు
ఏంజెల్: అమ్మ మనకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మన ఆకలి గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మను అమ్మ ప్రేమను దూరం చేసుకున్నాను.
వసు: కోపం వచ్చినప్పుడు ఆకలిపై చూపిస్తాం కానీ అలా చేయడం కరెక్ట్ కాదు తినండి
ఏంజెల్: నువ్వు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకోం తిను అంటూ బలవంతంగా కూర్చోపెడుతుంది... అయినా కానీ తినవా చెప్పు నేను తినిపిస్తా అంటుంది ఏంజెల్...
ఏంజెల్ స్వీట్ వార్నింగ్ కి భయపడి తింటాడు మను.. పొలమారడంతో వాటర్ బాటిల్ తీసుకొచ్చేందుకు వెళుతుంది వసుధార...ఇంతలో గ్లాస్ తో వాటర్ తీసుకొచ్చి తాగిస్తుంది ఏంజెల్...
Also Read: గుండెల్ని పిండేసే ఎపిసోడ్ - జగతి, రిషిని గుర్తుచేసిన అనుపమ-మను! , గుప్పెడంత మనసు మార్చి 21 ఎపిసోడ్!
మహేంద్ర డాక్టర్ తో మాట్లాడేందుకు వెళతాడు.. తనకి ఎలా ఉందని అడిగితే..అంతా బాగానే ఉందని చెబుతుంది డాక్టర్. రేపు డిశ్శార్జ్ చేస్తాం అని చెబుతారు. హమ్మయ్య అనుకుంటారు అంతా... అత్తయ్యని మా ఇంటికి తీసుకెళ్తాను అని ఏంజెల్ అంటే..కాదు మా ఇంటికి అంటాడు మహేంద్ర. నా మాట కాదనకండి సర్ అని ఏంజెల్ అంటే... ఇన్నాళ్లూ మాకు అండగా ఉంది ఇలాంటి సిట్యుయేషన్లో అక్కడకు ఎలా పంపిస్తాను అంటాడు.
ఏంజెల్: నా పరిస్థితి అర్థం చేసుకోండి..నాకు అత్తయ్య ఉందని చాలా ఏళ్ల తర్వాత తెలిసింది..నాకు తల్లిప్రేమ లేదు..అత్తయ్య నుంచి పొందాలి అనుకున్నాను... తను మాతో ఉంటే బావుంటుందని అనిపించినా తన మాటకు అడ్డు చెప్పడం ఇష్టం లేక ఆగిపోయాను.. నువ్వునా సార్ కి చెప్పొచ్చు కదా అంటుంది
వసు: మను గారికి అమ్మ ఆమె...ఆయన ఏం చెబితే అది చేద్దాం అంటుంది
ఫైనల్ గా అందరూ కలసి ఒకే దగ్గర ఉందాం అని ఫిక్సవుతారు..
Also Read: కేజీఎఫ్ BGM తో పిండేశారు - అనుపమ గతం గురించి చెప్పనున్న మను , గుప్పెడంత మనసు మార్చి 20 ఎపిసోడ్!
దేవయాని-శైలేంద్ర
ఎండీ సీట్ ఎలా దక్కించుకోవాలో ఇద్దరూ చర్చించుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నేను చెబుతాను ఫాలో అవ్వు అంటుంది దేవయాని. అమ్మా-నాన్న-అమెరికా అబ్బాయి అంటే... మను-అనుపమ సరే మరి నాన్న ఎవరు? దీనిపై దృష్టి పెట్టు, అది తెలిస్తే దానివెనుకున్న రహస్యం ఉంటే అది మన గ్రిప్ లో పెట్టుకుని వాళ్లతో ఆడుకోవచ్చు అంటుంది దేవయాని. అవును అంటాడు శైలేంద్ర. ముందు అనుపమతో మాట్లాడాలి అంటుంది దేవయాని. వీలు చూసుకుని వెళతాను అని దేవయాని అంటే... ఇప్పుడే వెళ్లు అంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్లడం ఎందుకు ఇంటికి వచ్చాక వెళతాను అంటుంది...
ఇంటికి తీసుకొచ్చిన అనుపమని...ఏంజెల్-మను ఇద్దరూ చెరోపక్క జాగ్రత్తగా పట్టుకుని తీసుకొస్తారు. నేను నా ఇంటికి వెళ్లేదాన్ని కదా అంటే అక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు కదా అని మహేంద్ర అంటే..ఎప్పుడూ ఒంటరిగానే ఉన్నాను అంటుంది. మా అత్తయ్యన్ని మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకునేదాన్ని కదా అంటే...అప్పుడు రిషికి మీరు సేవలు చేశారు కదా ఇప్పుడు మీ అత్తయ్యకి మేం సేవలు చేస్తాం అంటాడు మహేంద్ర...
గుప్పెడంత మనసు ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...
గుప్పెడంత మనసు మార్చి 23 ఎపిసోడ్ (Guppedantha Manasu March 23nd Episode)లో మను తండ్రి ఎవరన్న విషయంపై దేవయాని ఎంక్వైరీ మొదలు....