Karthika Deepam 2 Preview: వంటలక్కకు నిజంగా వంట వచ్చా? డాక్టర్ బాబుపై ప్రేమి విశ్వనాథ్ సీరియస్ - ఇది ఊహించలేదు అక్కో!

Karthika Deepam 2: ‘కార్తీక దీపం’ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో ఏడాది తర్వాత దీనికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూలను ఏర్పాటు చేశారు.

Continues below advertisement

Karthika Deepam 2 Preview Event: ఈరోజుల్లో సీరియల్స్ ప్రమోషన్స్ కూడా సినిమా ప్రమోషన్స్ రేంజ్‌లో ఉంటున్నాయి. అంతే కాకుండా సినిమాలలాగానే సీరియల్స్‌కు కూడా సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి ‘కార్తీక దీపం’ సీక్వెల్. ప్రస్తుతం బుల్లితెరపై ‘కార్తీక దీపం 2’ గురించే చర్చలు జరుగుతుండగా.. తాజాగా టీమ్ అంతా కలిసి ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ విలేఖరులే అడిగిన ప్రశ్నలకు మేకర్స్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అసలు ‘కార్తీక దీపం 2’ ఎలా ఉండబోతుందా హింట్ ఇచ్చేశారు. ఇక కార్తిక్, వంటలక్కగా ఫేమస్ అయిన నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్.. విలేఖరుల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు.

Continues below advertisement

ఇప్పుడైనా నిజం చెప్పండి..

‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా వంటలక్కగా ఫేమస్ అయ్యారు ప్రేమి విశ్వనాథ్. అయితే నిజ జీవితంలో ఆమెకు వంటలు వచ్చా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆమె వంటను కార్తిక్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా అని కూడా అడిగారు. దానికి నిరుపమ్ ఫన్నీ సమాధానమిచ్చాడు. ‘‘ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం వంటలక్క భోజనం తినకపోవడమే’’ అని చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. కానీ ప్రేమి మాత్రం ‘‘నిజం చెప్పమని చెప్పండి’’ అని సీరియస్‌గా అడిగారు. ‘‘కార్తీక దీపం సీరియల్ మొదలయినప్పటి నుంచి అందులో నేను తప్పు చేయలేదు అని అబద్ధాలే చెప్తున్నారు. ఇప్పుడైనా నిజం చెప్పండి’’ అని ఆమె కూడా నవ్వేశారు.

టీఆర్‌పీ భయం ఉందా.?

ఇక తనకు వంట వచ్చా లేదా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు ప్రేమి విశ్వనాథ్. ‘‘నేను కార్తీక దీపం లొకేషన్‌లో కూడా వంటలు చేశాను. నేను చేసిన వంటలు తిన్నారు కూడా. లొకేషన్‌లో గ్యాప్‌లో నేను వంటలు చేస్తాను. చికెన్ చేశాను చాలాసార్లు’’ అని క్లారిటీ ఇచ్చారు. కార్తిక్‌కు, వంటలక్కకు గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులంతా తనను చాలా తిట్టుకున్నారని బయటపెట్టారు దర్శకుడు. ఇక మలయాళంలో ‘కరుత ముత్తు’ అనే సీరియల్‌ను తెలుగులో ‘కార్తీక దీపం’గా రీమేక్ చేశారు. అయితే ముందు ఆ సీరియల్‌కు పాపులారిటీ బాగానే ఉన్నా.. మెల్లగా టీఆర్‌పీ తగ్గడం వల్ల దానిని ఆపేయాల్సి వచ్చింది. తెలుగులో కూడా అలాంటివి జరుగుతాయని భయంగా ఉందా అని డైరెక్టర్‌కు ప్రశ్న ఎదురయ్యింది.

హిమ లేదు..

‘‘సీరియల్‌కు సీజన్ 2 తీయడానికి మాకు కూడా లోపల భయం ఉంటుంది. కానీ ఆ బలమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్, ప్రేమి దిట్ట కాబట్టి టీఆర్‌పీ తగ్గదని మాకు నమ్మకం ఉంది’’ అని సమాధానమిచ్చారు దర్శకుడు. ఇక ‘కార్తీక దీపం 2’కు సంబంధించిన పలు ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రౌడీ బేబీ అంటూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. మొదటి భాగంలో కూడా హిమ, శౌర్య అనే రెండు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఉండేవి. శౌర్యనే రౌడీ బేబీ అని పిలిచేవారు. సీక్వెల్‌లో రౌడీ బేబి క్యారెక్టర్ రీక్రియేట్ అయ్యింది. మరి హిమ క్యారెక్టర్ కూడా రీక్రియేట్ అవుతుందా అనే ప్రశ్నకు లేదు అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 

Also Read: 'కార్తీక దీపం 2'లో అదే దీప, కార్తీక్‌.. అవే ఎమోషన్స్ చూస్తారు - కానీ ఇది కొత్త కథ

Continues below advertisement
Sponsored Links by Taboola