Karthika Deepam 2 Preview Event: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం ఒక సీరియల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. అదే వన్ అండ్ ఓన్లీ కార్తీక దీపం సీరియల్. బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ సీరియల్‌కు ఇప్పుడు పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ సిరీయల్ టెలికాస్ట్ కాబోతున్న సందర్భంగా నేడు (మార్చి 21) ప్రసాద్ లాబ్స్‌లో ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్‌తో పాటు మూవీ నిర్మాతలు, డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప అలియాస్ ప్రేమి విశ్వనాథన్ మాట్లాడుతూ.. మళ్లీ దీప, కార్తీక్‌ని తీసుకువస్తున్న మా మూవీ డైరెక్టర్, నిర్మాతలకు, రైటర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్తీక దీపం మళ్లీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'కార్తీక దీపం' ఫస్ట్ సీజన్ అయిపోయినప్పుడు మళ్లీ వస్తామని అప్పడే చెప్పాను. వచ్చేస్తుంది కార్తీక దీపం. మళ్లీ మమ్మల్నీ మీ ముందుకు తీసుకువస్తున్న మా దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే నా డాక్టర్ బాబుకి కూడా థ్యాంక్స్" అంటూ దీప ఆనందం వ్యక్తం చేశారు.
అదే దీప, కార్తీక్ ని చూస్తారు
అనంతరం డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ మాట్లాడుతూ.. "ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీ అభిమానం చూస్తుంటే కొత్తగా అనిపించడం లేదు. ఈ కార్తీక్, ఈ కార్తీక దీపం వైబ్ అనేది మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంటుంతో మాకు కూడా అడిక్షన్ ఉంది. ఈ సీరియల్ అయిపోతుందనగానే చాలా బాధేసింది. కార్తీక దీపం అయిపోయి నెల, రెండు నెలలు, ఆరు నెలలు.. ఇలా ఏడాది గడిచింది. కానీ ఎక్కడికి వెళ్లినీ సీరియల్ గురించే అంతా అడగడం, మాట్లాడం చూసి ఓ మంచి ప్రొడక్ట్ ఇచ్చామనే అనుభూతి ఇచ్చింది. ఈ సీరియల్ మళ్లీ చేయాలి అనే ప్రపోజల్ రావడంతో చాలా ఆనందంగా అనిపించింది. చేయాలి, తీయాలి అనే ఎగ్జయిట్‌మెంట్‌లోనే ఉన్నాం.
కానీ, కథేంటి ఎప్పుడు, ఎంటన్నది ఆలోచించలేదు. కార్తీక దీపం 2 సీరియల్ ప్రోమో చూసి అందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. కార్తీక దీపం 2 అంటున్నారు. ఇందులో శౌర్య చిన్నగా ఉంది. ఆ శౌర్య ఎప్పుడో పెద్దది అయ్యింది. ఇందులో ఏంటి చిన్నగా ఉంది. ఇంతకి ఇది కార్తీక దీపం కథేనా? ఇది సీక్వెలా? లేక వేరే కథ అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అదే దీప, కార్తీక్‌లు కానీ ఇది కొత్త కథ. మా పాత్రలు అవే కానీ, కథ మాత్రం కొత్తది. ఇది కార్తీక దీపంకు కొనసాగింపు కాదు. కొత్త కథతోనే మీ కార్తీక, దీప వస్తున్నారు" అని చెప్పుకొచ్చాడు. కానీ, తను మళ్లీ డాక్టర్ బాబు కాదనీ, వేరే బాబు అంటూ చమత్కిరంచాడు. దీప కూడా పూర్తిగా వంటలక్క కాదని, సగం వంటలక్క సగం దీప అంటూ చెప్పుకొచ్చారు. కానీ అవే ఎమోషన్స్, ప్రేమ, అప్యాయతలు చూస్తారంటూ ఆసక్తికర విషయం చెప్పాడు.
Also Read: 'హనుమాన్' చిత్రానికి తొలి అవార్డు అందుకున్న ప్రశాంత్ వర్మ - మురిసిపోతున్న డైరెక్టర్