Seethe Ramudi Katnam Serial Today Episode సీతని చంపడానికి గౌతమ్ గెటప్ వేసుకొని ఇంటికి వస్తాడు. సీత పడుకున్న గదికి వెళ్తాడు. సీత పడుకొని ఉంటే రుమాలుకు పెట్టిన మత్తు మందుతో సీతకి మత్తు ఇచ్చి ఎత్తుకొని బయటకు వస్తాడు. బయటకు తీసుకెళ్లి చంపాలి అనుకుంటాడు. అయితే మధ్యలో కాలికి ఏదో తగలడంతో కింద పడిపోతాడు. సీత కూడా కింద పడిపోతుంది. పక్కనున్న ట్యాప్‌కి చేయ తగలడంతో సీత ముఖం మీద నీరు పడి సీతకి మెలకువ వస్తుంది.


సీత చంపాలని అని గౌతమ్ కత్తి తీసుకొని వెళ్తే సీత అడ్డుకుంటుంది. గౌతమ్‌ని నెట్టేసి కర్రో కొడుతుంది. గౌతమ్ ముఖం చూడటానికి ముఖం మీద రంగు పోవాలని నీరు కొడుతుంది. సీతని తోసేసి గౌతమ్ పారిపోతాడు. సీత ఇంట్లోకి వెళ్లి అందరినీ పిలుస్తుంది. అందరూ పరుగున కిందకి వస్తారు. ఏమైందని సీతని అడుగుతారు. తనని ఎవరో చంపడానికి వచ్చారని తన మీద హత్యాప్రయత్నం జరిగింది అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పీడ కల వచ్చిందా సీత అని మహాలక్ష్మీ అడుగుతుంది. నీకు ఎవరి మీద పగ ఉంటుందని అర్చన అంటుంది. ఒకడు ఒంటి నిండా రంగు పూసుకొని వచ్చాడని గదిలో పడుకున్న తనని మత్తు ఇచ్చి బయటకు తీసుకెళ్లి చంపబోయాడని అంటుంది. దానికి చలపతి అచ్చం సుమతి అక్కని చంపినట్లేనా అంటే అవును అని సీత చెప్తుంది. కచ్చితంగా నన్ను చంపాలి అని వచ్చాడు అని అంటుంది. సీత కట్టు కథ చెప్తుందని మహా బ్యాచ్ సీత మీద పడతారు. 


రామ్ సీతతో వాడు ఎలా ఉంటాడు అని అంటే గౌతమ్‌లా ఉంటాడు అని అంటుంది. నింద వేయడానికి ఆధారం ఉండాలని నోటికి వచ్చినట్లు చెప్పొద్దని జనార్థన్ అంటాడు. గౌతమ్ నిన్ను ఎందుకు చంపాలి అనుకుంటాడు నీకు తనకు శత్రుత్వం లేదు కదా అని రామ్ అంటాడు. అందరూ ఇక్కడే ఉన్నారు కదా మరి గౌతమ్ రాలేదు కదా నన్ను చంపాలి అనుకుంది గౌతమ్ అని గదికి వెళ్లి చూద్దామని అంటుంది. అందరూ గౌతమ్ గదికి వెళ్తారు. అక్కడ గౌతమ్ హాయిగా పడుకొని ఉంటాడు. సీత షాక్ అయిపోతుంది. మహాలక్ష్మీ గౌతమ్‌ని లేపుతుంది. అందర్ని చూసిన గౌతమ్ ఏమైంది అని అడుగుతాడు. బయటకు వెళ్లావా గౌతమ్ అని రామ్ అడిగితే లేదు అని చెప్తాడు. ఏమైందని అని గౌతమ్ అడిగితే నువ్వు రంగులు పూసుకొని వచ్చి సీతని చంపాలి అనుకున్నావని సీత అంటుందని చెప్తారు. సీత గౌతమ్‌ గొంతు పట్టుకొని చంపేస్తా నిన్ను నిజం చెప్పురా అని అంటుంది.


మహాలక్ష్మీ విడిపించి సీతని తిడుతుంది. సీత తగ్గకుండా చొక్కా విప్పితే గాయాలు ఉంటాయి అని అంటుంది. చలపతి సీతకి సపోర్ట్ చేస్తాడు. రామ్, జనార్థన్‌లు ఇద్దరినీ తిట్టి గౌతమ్‌ని అవమానించొద్దని చెప్తారు. ఇంట్లో ఉండిపోవడానికే సీత ఈ ప్లాన్ చేసిందని అర్చన అంటుంది. అందరూ ఎవరి గదులకు వాళ్లు వెళ్లిపోతారు. మహాలక్ష్మీ కొడుకుని సీరియస్‌గా చూస్తూ వెళ్తుంది. తర్వాత వచ్చి గౌతమ్‌ చెంప వాయిస్తుంది. నన్ను ఎందుకు కొట్టావని గౌతమ్ అడిగితే నువ్వు చేసిన వెదవ పనికి చంపేయాలి అని అంటుంది. సీతని చంపాలి అనుకున్నది నువ్వే అని నాకు తెలుసు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!